జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 17 50

అందరూ సమావేశమై మా జీవితాలను నాశనం చేశావని అతన్నే తిట్టి కొందరు చాలా ఘోరంగా మాట్లాడగా , చాలా మర్యాదగా బతికిన రాముడు తట్టుకోలేక జరిగినదంతా ఒక పేపర్ లో రాసి హ్యూమన్ రైట్స్ కమిషన్ కు లేఖ రాసి , ఆత్మ హత్య లేఖ తో పాటు అందర్నీ క్షమించమని కోరుతూ రాసి, గర్భవతిగా ఉన్న తన భార్యను కూతురుని చూసి ,ఆఫీస్ వాళ్ళు అన్న మాటలు గుర్తుకు రాగా తన వల్ల తమ మహిళలకు అటువంటిది జరగకూడదని ,ఇంట్లో అందరూ పడుకున్న తరువాత హాల్ లో కొచ్చి ఉరి వేసుకొని ప్రాణాలు వదిలేసాడు.

ఉదయం తన భార్య అరుపులకు అందరూ లేచి అతడిని కిందకు దించి పోలీసులకు తెలుపగా లేఖలను చూసి హ్యూమన్ రైట్స్ కమిషన్ కుచేర్చగా , అధికారులు వచ్చి మొత్తం అందరి వాదనలు విని కోర్ట్ లో కేస్ వేసి కేస్ తేలేంతవరకు ఎవ్వరు డబ్బు కట్టవలసిన అవసరం లేదు అని తీర్పు ఇవ్వగా ,ఉరి వేసుకున్న ఆ ఇంటిని సీల్ వెయ్యగా అందరూ సంతోషించిన పాపం ఆ అమ్మాయి మాత్రం సర్వం కోల్పోయి ఆ పెద్ద ఇంటిని వదిలి ఈ చిన్న ఇంటిలోకి రావలసి వచ్చింది. ఇదంతా జరిగిన రెండు నెలలు ఆమెకు పురిటి నొప్పులు వచ్చినా కూడా ఎవ్వరు సహాయం చేయకపోగా , పెద్దాయనకు తెలియగా అందరిని తిట్టి నన్ను పిలుచుకొని వెళ్లగా కష్టపడి దేవుడి దయ వల్ల ఎటువంటి అపాయం జరుగగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. పెద్దాయనతో ఉన్న కొంత డబ్బు ఆమెకు ఇవ్వగా తరువాత నుండి ఎక్కడో పనిచేస్తూ ఉదయం నుండి అర్ధరాత్రి వరకు కష్టపడి పిల్లల్ని పెంచుతోంది.

పాపం దేవుడు మాత్రం ఆమెకు చాలా చాలా అన్యాయం చేశాడని చెప్పి కళ్లల్లో నుండి కారుతున్న కన్నీళ్లను తుడుచుకొనసాగింది.అదంతా వింటున్న నాకే బాధతో కళ్లల్లో నుండి కన్నీళ్లు ఆగకుండా కారసాగాయి.

అవ్వ ఇదంతా గుర్తు చేసి మిమ్మల్ని బాధపెట్టాను నన్ను క్షమించండి అని కోరగా , అదేమీ లేదు నాయనా నేను ఇదంతా చెప్పడం వలన ఎవరైనా ఒక మంచి వ్యక్తి వారికి సహాయం చేస్తారేమో అని ఒక చిన్న ఆశ అని చెబుతూ బాధను దిగమింగుకుంటూ , కోడలా కొన్ని నీళ్లు తీసుకురామ్మా అని కేకేయ్యగా , ఒక చెంబు నీళ్లు రెండు గ్లాస్ లు తీసుకొని రాగా , నీళ్లు పోసి నాకు ఒక గ్లాస్ ఇవ్వగా తాగగా , నీళ్లు చాలా ఉప్పగా తాగడానికి వీలు లేకుండా ఉండగా అవ్వ మాత్రం దించకుండా తాగెయ్యగా , అవ్వ ఈ ఉప్పు నీళ్లు ఎలా తాగుతున్నావు అని అడగ్గా , నేనే కాదు నాయనా ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్లంతా ఇవే నీళ్లు తాగుతూ జీవచ్చవాళ్ళా బ్రతుకుతున్నారు అని చెప్పగా బాధ వేసి , అవ్వ ఇక నేను సెలవు తీసుకుంటాను అని అవ్వకు ధన్యవాదాలు తెలిపి అవ్వ చెప్పిన దానినే తలుచుకుంటూ పాప ఇంటి ముందు నిలబడి పర్సులో ఉన్న డబ్బంతా దారంతో చుట్టి కిటికీలో నుండి పాప ఇంటిలోకి వేసి ఇంటికి రాగా , కృష్ణ అప్పటికే పనివాళ్ళతో పని చేయిస్తుండగా దివ్యక్కకి కాల్ చేసి అమ్మకు ఇవ్వమని చెప్పి ఇప్పుడెలా ఉంది అమ్మ అని అడిగి , ఇక్కడ ఇంటి దగ్గర పని చూసుకొని వస్తాము మీరు భోజనం చేసి రెస్ట్ తీసుకోండి అని చెప్పి కాల్ కట్ చేసి , ఇక్కడ ఇంటిని మొత్తం శుభ్రం చేయించి , కొత్త తలుపులు పెట్టించి , హాల్ లోని గోడలకు రంగు వేయించి వాళ్లకు లాకర్ లో ఉన్న డబ్బు ఇచ్చేసి మిగిలిన డబ్బును పర్సులో పెట్టుకొని కృష్ణ గాడికి టవల్ అందించి స్నానం చెయ్యమని చెప్పి , నేను కూడా ఇంకో బాత్రూం లో ఫ్రెష్ గా స్నానం చేసి ఇద్దరు నా బట్టలు వేసుకొని అమ్మకు ఒక జత బట్టలు బ్యాగులో పెట్టుకొని కానిస్టేబుల్ లతో సహా బయటకు వచ్చి గేట్ కు కొత్త తాళాలు వేసి వారిని కారులో స్టేషన్ వరకు దింపేసి సరాసరి కృష్ణ ఇంటికి భయలుదేరాము.

సుమారు 4 గంటలకు ఇంటికి చేరుకోగా దివ్యక్క వంట గదిలో ఉండగా రూమ్ కు వెళ్లగా అమ్మ మరియు అంటీ ప్రశాంతంగా నిద్రపోతూ రెస్ట్ తీసుకుంటుండగా , ఇందుమతి గారు పక్కనే కుర్చీలో కూర్చొని ఇద్దరిని జాగ్రత్తగా చేసుకుంటుండగా చాలా ఆనందం వేసి , పక్కనే బెడ్ పై నెమ్మదిగా కూర్చొని అమ్మ నుదుటి పై ముద్దుపెట్టి అమ్మ చెయ్యి నెమ్మదిగా అందుకొని అమ్మను చూస్తూ ఉండగా , ఇందుమతి గారు వెళ్లి ప్లేట్ లో భోజనం తీసుకు వచ్చి ఇవ్వగా అక్కడే తినేసి చెయ్యి కడుక్కోవడానికి వెళ్తుండగా నీళ్లు అందిస్తూ ప్లేట్ లోనే కడుక్కోమని చెప్పగా అలాగే చెయ్యగా తుడుచుకోవడానికి టవల్ అందించి తాగడానికి నీళ్లు ఇచ్చి ప్లేట్ తీసుకొని వెళ్ళిపోయింది.

1 Comment

Comments are closed.