జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 17 50

9 గంటల కల్లా ఫ్లైట్ వైజాగ్ లో ల్యాండ్ అవ్వగా బయట మా కోసమే విక్రమ్ మరియు విశ్వ సర్ లు వేచి చూస్తుండగా వెంటనే జీప్ లో సరాసరి హాస్పిటల్ కు చేరుకొని లోపలికి పరిగెత్తగా , విక్రమ్ సర్ కూడా పరిగెత్తుతూ ఇటువైపు అని ICU రూమ్ కు లోపలికి వెళ్లగా లోపల అందరూ నవ్వుతూ మాట్లాడుకొంటుండగా , అమ్మ నవ్వును చూసి గాని నా మనసు శాంతించి , గుండె మాములుగా కట్టుకొనసాగింది.

అమ్మ కూడా కన్నీళ్లు కారుస్తూ నన్నే చూస్తుండగా వేగంగా వెళ్లి అమ్మని చూస్తూ పక్కనే బెడ్ పై కూర్చొనగా కృష్ణ వెళ్లి అంటీ పక్కన కూర్చొనగా, చేతిని సున్నితంగా అందుకొని కన్నీళ్లు కారుస్తూ చూసి అమ్మ కళ్ళల్లోకి చూస్తూ అమ్మ ఇదంతా నావల్లే జరిగింది నేను అస్సలు నిన్ను విడిచి వెళ్లి ఉండకూడదు నన్ను క్షమించు అమ్మ , అంటీ ని చూస్తూ రెండు చేతులతో మొక్కుతూ కన్నీళ్లు కారుస్తూ నా వల్లే మీకు ఇలా జరిగింది నన్ను క్షమించండి అంటీ అని భావోద్వేగంతో చెప్పగా అంటీ కాళ్ళల్లో నీరు కారుతూ నన్ను ఆపుతూ,అమ్మ కన్నయ్య ఇప్పుడు ఇద్దరమూ బాగానే ఉన్నాము చూడు సంతోషంగా నవ్వుతున్నాము , చుట్టూ చూడు మా కోసం ఎంత మంది కోలుకోవాలని కోరుకుంటున్నారో , నువ్వు ఇంత మంది ఉండగా మాకు ఏమి అవ్వదు.

సమయానికి ఒక దేవత వచ్చి మమ్మల్ని కాపాడింది అని ఇందు అమ్మ కోసం చుట్టూ చూడగా కనిపించకపోవడంతో , దివ్య ఆమె ఎక్కడుందో చూడమని చెప్పగా , బాత్రూం మరియు బయట అంతా వేతకగా లేకపోవడంతో reception లో అడుగగా , ఇప్పుడే బిల్ కట్టేసి క్యాబ్ లో వెళ్లిపోయారని చెప్పగా , అమ్మకు అదే విషయం దివ్యక్క వచ్చి చెప్పగా , ఇంత చేసిన ఆ దేవతకు కనీసం థాంక్స్ అయినా చెప్పలేదు అని భాధపడుతుండగా , ఆ మాటలు వింటున్న నర్సు థాంక్స్ కాదండి , ఆమె చేసిన దానికి ఏమి ఇచ్చినా సరిపోదు , మీరు కేవలం మిమ్మల్ని హాస్పిటల్ కు తీసుకొచ్చి రక్షించారని మాత్రమే అనుకుంటున్నారేమో , మిమ్మల్ని తీసుకొచ్చిన వెంటనే డాక్టర్లు పరీక్షించగా చాలా రక్తం పోయిందని వెంటనే బ్లడ్ కావాలని చెప్పగా , మీ స్నేహితురాలికి మాత్రమే బ్లడ్ దొరికింది , సిటీ మొత్తం అన్ని హాస్పిటల్ లో వెతికినా మీ బ్లడ్ గ్రూప్ ఎక్కడ దొరకకపోయి మీరు ఆల్మోస్ట్ ప్రాణాపాయ స్థితికి చేరుకుంటుండగా , ఆ మేడంది కూడా మీ బ్లడ్ గ్రూప్ అని తెలియగా రక్తం ఇస్తానని డాక్టర్ కు చెప్పగా , ఒక వ్యక్తి నుండి ఒక బాటిల్ మాత్రమే తీసుకోవాలి , అది ఏమాత్రం సరిపోదు అని చెప్పగా , అయితే ఎంత కావాలంటే అంత తీసుకోండి అని చెప్పగా , అది మీ ప్రాణానికి ప్రమాదం అని చెప్పినా వినకుండా , మా అక్కయ్య కోసం నా ప్రాణాలైనా అర్పిస్తాను అని ప్రాధేయపడగా , వేరే ఉపాయం లేకపోవడంతో డాక్టర్లు అంతా ప్రతి క్షణం చెక్ చేస్తూ రెండు బాటిల్స్ రక్తం తీసుకొని మీకు ఎక్కించారు.

ఆ మేడం వెంటనే స్పృహ కోల్పోయినా మిమ్మల్ని కాపాడుకోవడం కోసం నీరసంగా ఉన్నా కూడా లేచి మీ పక్కనే రాత్రంతా కూర్చొని మిమ్మల్ని కాపాడుకోవాలన్న ఒకే ఒక్క ఆశయంతో జాగ్రత్తగా చూసుకొంది , నేను ఇవన్నీ ఇప్పుడు చెప్పకపోతే మీకు ఎప్పటికి తెలియదు అని చెప్పి ఉద్వేగంతో బయటకు వెళ్ళిపోయింది. ఆ మాటలు వింటున్న అందరి హృదయం కరిగిపోయి కన్నీరుగా బయటకు వస్తూ ఇందు అమ్మను తలుచుకుంటూ మౌనంగా ఉండిపోయారు.

ఎవరమ్మా ఆమె అని అడుగగా దివ్య పేపర్ అందుకు అని చెప్పగా నిన్నటి పేపర్ చూపించి ఈ దేవతామూర్తి అని చెప్పగా , అమ్మ ఫోటో చూసి షాక్ లోకి వెళ్ళిపోయి గుండె వేగంగా కొట్టుకుంటూ కదలకుండా ఉండిపోగా , విక్రమ్ సర్ వచ్చి నన్ను కదిలించగా సర్ వైపు చూడగా అవును అన్నట్లుగా తల ఊపగా, అమ్మ ఇప్పుడే వస్తాను , దివ్యక్క అమ్మను చూస్తూ ఉండమని చెప్పి బయటకు పరిగెత్తుతూ రోడ్ మీదకు వెళ్లి ప్రతి వెహికల్ లోపల చూస్తూ అమ్మ అమ్మ అని తలుచుకొంటుండగా మొబైల్ కు మెసేజ్ రాగా, “బేబీ నేను గోవా వెళ్లిపోతున్నాను , నువ్వు వస్తున్నావాని విక్రమ్ సర్ చెప్పగానే సంతోషంతో మనసుకు హాయిగా అనిపించగా నా ముఖం వెలిగిపోసాగింది.

1 Comment

Comments are closed.