జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 17 50

సుమారు 100 కు పైనే కుటుంబాలు ఏవిధమైన కల్మషాలు మరియు అసూయలు లేకుండా హాయిగా జీవించేవాళ్ళము , మా తెగకు పెద్దయ్య దేవుడు లాంటి వారు. ఆయన మాట అంటే అందరికి వేదం లాంటిది , అందరూ కలిసిమెలిసి ఉన్న చిన్న స్థలాలలో పంటలు పండించి , అడవిలో దొరికే వాటితో బొమ్మలు తయారుచేసి అమ్ముకొని ప్రశాంతంగా జీవించేవాళ్ళము. వర్షాకాలంలో ఒక రోజు భయంకరంగా పడిన గాలి తుఫానుకు కొండచరియలు విరిగిపడి కొండపక్కనే ఉన్న ఇళ్లల్లో నివసిస్తున్న వారు ఇల్లాల్లో ఉండగానే ఇళ్లతో సహా మట్టి చరియలు మరియు కొండ రాళ్లు పది ఊపిరి ఆడక చనిపోగా , తరువాతి రోజు ఇది తెలుసుకొని కలెక్టర్ తో సహా చాలా మంది అధికారులు వచ్చి అంతా పరిశీలించగా ఇప్పుడు జరిగింది కొద్దిగా మాత్రమే , ఇంకా పెద్ద తుఫాను వస్తే ఈ ప్రాంతం మొత్తం ఇలాగే నాశనం అవుతుందని ఆధారాలతో సహా నిరూపించి , మీకు ప్రభుత్వం తరపున పక్కా గృహాలు కట్టించి ఇస్తామని , ప్రతి ఒక్కరికి పని దొరికేలా చూస్తామని భరోసా ఇవ్వగా , ఇక్కడ ఉండి చనిపోవడం కంటే ఎక్కడో ఒక దగ్గర బతికితే చాలు ఆనుకొని అందరూ పెద్దాయన తో మొర పెట్టుకోగా , సరే అని ఆయన కూడా చెప్పగా 6 నెలలలో మాట ఇచ్చిన విధంగానే మాకు ఇక్కడ గృహాలు కట్టించి అందరిని ఇక్కడకు మార్చగా , అందరూ తాము బతకడానికి పనిని మీరే చూసిపెట్టాలని కలెక్టర్ గారిని వేడుకొనగా , వీళ్ళందరి బాగు కోసం ప్రభుత్వం డబ్బు ఇప్పటికే చాలా ఖర్చు పెట్టారు ఇంకా అంటే కుదరదు అని వెంటనే ఆ కలెక్టర్ గారిని వేరే ఊరికి పంపించివేశారు అని మా దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పి బాధతో వెళ్లిపోయారు.

ప్రతి కుటుంబం లో ఆదాయం లేక దాచుకున్న కొద్ది డబ్బు కూడా అయిపోయి అందరూ ఆకలితో అలమటిస్తుండగా , పెద్దాయన అందరిలోకి కొద్దిగో గొప్పో చదివిన అదిగో దూరంగా కనిపిస్తున్న రంగు వెలసిన పెద్ద ఇల్లు లో నివసిస్తున్న నువ్వడిగిన పాప తండ్రి రాముడిని పిలిచి సిటీ లో ఎవరైనా చిన్న చిన్న బొమ్మాలు తయారుచేసి అమ్ముకోవడానికి కావలసిన పెట్టుబడిని అప్పుగా ఇస్తారేమో అని చూడమని చెప్పగా , అందరి పరిస్థితిని చూసి వారం రోజులు కాళ్ళు అరిగేలా తిరిగి చివరగా , ఒక సంస్థను పిలుచుకొని వచ్చి అందరితో సంతకాలు చేయించి కుటుంబానికి రూపాయి వడ్డీతో 50000 అప్పు ఇప్పించగా అందరూ రాముడిని సంతోషంగా పొగుడుతూ తీసుకొని , మరుసటి రోజు నుండి ఆ డబ్బుతో వాళ్లకు తెలిసిన పని ముడి సరుకులను కొని చేతి వస్తువులను తయారు చేసి సిటీలో అమ్ముకొని హాయిగా జీవించడం మొదలుపెట్టాము.

అలా ఒక నెల గడవగా అందరూ లాభపడి తమ తమ వడ్డీ డబ్బులను స్వయంగా తెచ్చి రాముడికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇస్తూ మీ వల్ల ఇంటిలో అందరూ కడుపునిండా మూడు పూటలా తింటున్నాము అని చెప్పి ఆశీర్వదించి వెళ్లగా రాముడు అతడి భార్య పాప సంతోషించి , డబ్బు తీసుకొని సిటీకి ఆఫీసు కు వెళ్లి వడ్డీ డబ్బు అని కౌంటర్ లో కట్టడానికి వెళ్లగా , కంప్యూటర్ లో చూసి మొత్తం మీరు కట్టవలసింది 50 లక్షలు అని చెప్పగా , కంగారు పడిపోతూ పేరు చెప్పి మళ్ళీ ఒకసారి సరిగ్గా చూడమనగా , చూసి 50 లక్షలే అని చెప్పగా , ఒక్కసారిగా షాక్ కొట్టిన వాడిలా నిలబడిపోయి వొళ్ళంతా చెమటతో తడిసిపోయింది.

కొద్దిసేపటి తరువాత తేరుకొని ధైర్యంగా వాళ్ళ దగ్గరికి వెళ్లి తను ఎంత తీసుకున్నది , దానికి వడ్డీ ఇంత అని లెక్కవేసి చెబుతుండగా , మీరు తీసుకున్నది కుటుంబానికి 50 వేలు కాదు 50 లక్షలు దానికి వద్దే నెలకు 50 వేలు చొప్పున 100 కుటుంబాలకు మొత్తం 50 లక్షలు అని వివరించగా , మేము ఒక కుటుంబానికి తీసుకున్నది 50 వేలు మాత్రమే అని గట్టిగా గలాట చెయ్యగా పక్కనే ఉన్న దిట్టంగా పొడవుగా ఉన్న ముగ్గురు అతడిని లాక్కొని లోపలికి వెళ్ళి సంతకాలు పెట్టిన పేపర్స్ చూపించగా అందులో 50 లక్షలు రాసి ఉండగా , నన్నే మోసం చేస్తారా అని అధికారి మీదకు కోపంగా వెళ్లగా పక్కనే ఉన్న వాళ్ళు గట్టిగా పట్టుకొని ముఖం పై కొట్టి రేపటి కల్లా మొత్తం డబ్బు తీసుకొని వచ్చి కట్టు లేకపోతే మేమేం చేస్తామో నీకు తెలియదు అని తెచ్చిన డబ్బును అతడికి ఇచ్చి బయటకు తోసివేశారు. వెంటనే పెద్దాయన దగ్గరికి వచ్చి జారిందంతా చెప్పగా అందరిని పిలిచి చెప్పగా , అప్పటి వరకు పొగిడిన వాళ్ళు అంత డబ్బు కట్టవలిసి వస్తుందో అన్న భయంతో రాముడిని మీద అందరూ కోపంగా అరవసాగారు.

పెద్దయ్య అందరిని ఆపి వాడు చేసింది మన బాగు కోసమే కదా ఇలా జరుగుతుంది అని ఎవరికి తెలుసు అని ఒక 10 మందిని తీసుకొని పోలీస్ కంప్లైంట్ ఇద్దామని వెళ్లగా , వాళ్ళను కూడా పిలిపించగా , పత్రాలు అన్ని వాళ్ళ వైపే ఉండటంతో పోలీస్ లు కూడా వారికే సపోర్ట్ చెయ్యగా ఏమి చెయ్యాలో తెలియక బయటకు రాగా , మా మీదనే కంప్లైంట్ ఇస్తారా రేపు వడ్డీ కట్టకపోతే అప్పుడు మేమంటే ఏమిటో చూపిస్తాం అని అందర్నీ భయపెట్టగా , రాముడు వెళ్లి తప్పు అయ్యింది మమ్మల్ని వదిలెయ్యండి అని వాళ్ళ కాళ్ళ మీద పడి బ్రతిమాలగా పైకి లేపి నువ్వు డబ్బు కట్టకపోతే మిమ్మల్ని ఏమి చెయ్యం మీ అడవిలో పెరిగిన ఆడవాళ్లు చాలా దిట్టంగా అందంగా ఉంటారని విన్నాము వాళ్ళను తీసుకొని వెళ్లి వాళ్ళ ద్వారా ఎలా డబ్బులు సంపాదించాలో మా కాల్ మనీ వాళ్లకు బాగా తెలుసు అని రాముడి చెవిలో నెమ్మదిగా చెప్పగా , నోటి మాట రాక దిక్కులేక వెనక్కు తిరిగి వచ్చేసారు.

1 Comment

Comments are closed.