జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 16 53

కొద్దిసేపు ఇద్దరమూ మౌనంగా అక్కడ ఉన్న సోఫాలలో బాధపడుతూ కూర్చోగా , ఆమెను పర్సు అడిగినప్పుడు , పిల్లలకు పాలు ,డబ్బు తీసుకుని వెళ్లకపోతే నన్ను వాళ్ళు ఊరికే వదలరు అని చెప్పడంతో ,అది గుర్తుకు రాగా , రేయ్ కృష్ణ పదరా అని తమ వస్తువులన్నీ బ్యాగులో సర్దుకొని హోటల్ రూమ్ లోనుండి బయటకు వచ్చి వేగంగా పరుగు అందుకోగా , అరే మామా ఎక్కడికి రా అని అడుగుతూ నా వెనుకే వాడు కూడా పరిగెత్తసాగాడు.

నేను రోడ్ లో పరిగెత్తుతుండగా కృష్ణ ఒక క్యాబ్ ను ఆపి అందులో ఎక్కి నన్ను ఫాలో కమ్మని చెప్పగా , నా దగ్గరికి వేగంగా క్యాబ్ రాగా మామా ఎక్కరా అని చెప్పగా , క్యాబ్ ఎక్కి దారి చూపిస్తూ ఫాస్ట్ గా వెళ్ళమని చెప్పి ఆమెను ఎక్కడైతే కలిసామో ఆ వీధి వైపు క్యాబ్ ను పోనివ్వమని దారి చూపించసాగాను. ఆ వీధిలోకి ప్రవేశించగానే దూరంగా ఆమె ఆటో దిగి నడుస్తూ వెళుతుండగా క్యాబ్ ను కొద్ది దూరం లోనే ఆపగా , కృష్ణ డబ్బు ఇచ్చి వెనక్కు పంపెయ్యగా, ఆమె వెనుకే కనబడకుండా నడవసాగాము.

అలా ఆమె ఒక కిలోమీటర్ వరకు కష్టంగా చేతిలో బ్యాగుతో నడిస్తుండగా , చుట్టూ చూడగా ఒక్క ఇల్లు కూడా లేకపోవడంతో , వెంటనే పొదల లోకి చిన్న దారి ఉండగా లోపలికి వెల్లసాగింది. రెండు నిమిషాలు వేచి చూసి మేము కూడా లోపలికి 10 నిమిషాలు నడువగా , ఒక పెద్ద పాడుబడ్డ భవంతి కనబడగా , ఆమె లోపలికి వెల్లసాగింది. మేము కూడా ఆ భవంతికి దగ్గర చేరుకున్న కొద్ది చిన్న పిల్లల అరుపులు ఎక్కువ అవుతున్నాయి.

చుట్టూ చూడగా ఎవ్వరు లేకపోవడంతో ముందుకు వెళ్లి తలుపు తెరిచి ఉండగా లోపలికి పిల్లల అరుపుల వైపు వెళ్లగా , చివరన ఒక రూమ్ ఉండటంతో ఆ రూమ్ లోకి కిటికీలో నుండి తొంగి చూడగా , ఆమె ఒక వ్యక్తికి డబ్బు ఇచ్చి ఏడుస్తున్న పిల్లల దగ్గరికి వెళ్లి బ్యాగులో నుండి పాలను తీసి , ఇద్దరు చిన్న పిల్లలు గుక్క తిప్పుకోకుండా ఏడుస్తుండగా , పక్కనే ఒక ముసలావిడ వాళ్ళ ఏడుపును ఆపించడానికి శతవిధాల ప్రయత్నిస్తుండగా , ఆమె ఒక పిల్లవాన్ని ఎత్తుకొని పాలు సీసాలో వేసి అందివ్వబోతుండగా, అక్కడ ఉన్న వ్యక్తి డబ్బు లెక్కపెట్టి ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చావే అని గట్టిగా అడుగుతూ , ఆమె కట్టుకున్న కొత్త చీర బ్యాగులో వస్తువులను చూసి నీకు కొత్త చీర కావాల్సి వచ్చిందా , అంటే ఇంకా ఎక్కువ డబ్బే వచ్చింది , దానిని నాకు ఇవ్వకుండా జల్సాలు చేస్తున్నావా అని ఆమె దగ్గరకు వెళ్లి చెంపపై ఒక్క దెబ్బ వేసి , విప్పవే చీర కొత్త చీర అమ్మితే డబ్బు వస్తుంది అని పిల్లవాన్ని ఎత్తుకుందని కనికరం లేకుండా ఇంకో దెబ్బ వెయ్యగా చేతిలో ఉన్న పాల సీసా కింద పడిపోయి ఆమె కూడా పడిపోతుండగా వెంటనే లోపలికి వెళ్ళి పడిపోకుండా పట్టుకొని పిల్లవాన్ని ఎత్తుకొని ,

1 Comment

  1. 👌👌👌👌

Comments are closed.