జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 16 50

ఈమె ఒంటిపై ఒక్క దెబ్బ పడినా నీ ప్రాణాలు తీస్తా అని బెదిరించగా , వాడు కోపంతో ఊగిపోతూ నా మీదకు మనుషుల్ని ఉసిగొలుపుతావా , నీ చెల్లెల్ని ,తమ్ముణ్ణి ఏమి చేస్తానో చూడు అని జేబులో ఉన్న మొబైల్ తీసి కాల్ చేస్తుండగా , ఆమె వాళ్ళను ఏమి చేయొద్దని ఏడుస్తూ ప్రాధేయపడుతుండగా , పిల్లవాణ్ణి గట్టిగా పట్టుకొని కాలితో గట్టిగా ఒక్క తన్ను తన్నగా మొబైల్ దూరంగా ఎగిరిపోగా వాడు వెనక్కు ఎగిరిపడి నొప్పి అని అరుస్తూ ఒరేయ్ ఎక్కడున్నారురా నన్ను ఇక్కడ ఎవడో కొడుతున్నాడు అని అరవగా , ఇద్దరు రూమ్ లోకి రాగా కృష్ణ గాడు ఒకడిని పట్టుకొని కుమ్మేయ్యగా , నా వైపు వచ్చిన వాణ్ణి ఒక్క దెబ్బ తల పక్కన చెవిపై గట్టిగా కొత్తగా నేలపై పది మళ్ళీ లేవలేదు.

అది చూసి వాడు భయపడగా కిందపడిన మొబైల్ లో హలొ హలొ అని వినబడుతుండగా కట్ చేసి , ఆమె వైపు తిరిగి తల వంచుకొని అమ్మా….. అని వినయంగా పీలుస్తూ మీ వాళ్ళను ఎక్కడ బంధించాడో మీకు తెలుసా అని అడుగగా , మాకే తెలియనివ్వకుండా దాచిపెట్టి మమ్మల్ని ఇలా కష్టపెడుతున్నాడు అని చెప్పగా , కింద పడిన వాడి దగ్గరికి వెళ్లి రెండు చేతులతో పైకి లేపి కడుపులో కొన్ని గుద్దులు గుద్ది చెప్పారా వాళ్ళను ఎక్కడ దాచావో అని చెంపలపై అటు ఇటు కొట్టగా , చాలు , చాలు చెబుతాను అని వేడుకొనగా , అరే కృష్ణ పిల్లలను , వీళ్లను నెమ్మదిగా రోడ్ లోకి తీసుకుని రా , మేము వాళ్ళను కూడా విడిపించుకొని వస్తాను అని బయట ఉన్న వాడి బైకులో వాన్నే తొలమని చెప్పి రోడ్ లోకి రాగా , సిటీ కి వ్యతిరేకదిశలో 15 నిమిషాలు వెల్లసాగాము.

రోడ్ నుండి కుడి వైపు రెండు నిమిషాలు లోపలికి వెళ్లగా ఇక్కడ కూడా ఒక పాడుబడ్డ భవనం లోకి వెళ్లగా , వీడికి తగిలిన దెబ్బలు చూసి వీడేనా కొట్టింది అని ఇద్దరు నా పైకి రాగా , వీడిని ఒక్క తన్ను తన్నగా కిందకు పడిపోగా , మిగిలిన ఇద్దరు అది చూసి కోపంతో నా మీదకు రాగా , కింద పడిన రాయి తీసుకొని ఒకడి కాలికి విసరగా అయ్యో కాలు అని అక్కడికక్కడే పడిపోగా ,ముందుకు వెళ్లి మిగిలిన వాడి మూతి పగలగొట్టగా రెండు చేతులను నొప్పి అంటూ మూతిపై పెట్టుకోగా డొక్కలో ఒక్క గుద్దు గుద్దగా అక్కడికక్కడే పడిపోయి నొప్పితో అరవసాగాడు.

వాళ్ళు ఎక్కడ అని నాతో వచ్చిన వాణ్ణి అడుగగా లోపల రూమ్ చూపించగా , మిగిలిన ఇద్దరిని అక్కడే ఉన్న తాళ్లతో కట్టివేసి , వీడి గొంతు పట్టుకొని రూమ్ లోకి వెళ్లగా ఒక 20 ఏళ్ల అమ్మాయి మరియు ఒక 10 ఏళ్ల అబ్బాయి ని గోడకు తాళ్లతో కట్టివేసి ఉండగా , వెంటనే తాళ్ళు విప్పగా , ఆ అమ్మాయి ఎవరు ఎవరు , మమ్మల్ని ఏమి చేయవద్దు అని , చేతులు చాపుతూ తమ్ముడు తమ్ముడు అని పిలువగా , అక్కయ్య అని ఆ అమ్మాయిని హత్తుకోగా అప్పుడు తెలిసింది ఆ అమ్మాయికి కళ్ళు లేవని , ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకోగా, కళ్ళు లేని అమ్మాయిని హింసిస్తారురా అని వాడి ముక్కు మొహం ఏకమయ్యేలా పైడి గుద్దులు గుద్దగా స్పృహ తప్పి పడిపోగా తాళ్లతో కాళ్ళు చేతులు కట్టివేసి , వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్లగా మమ్మల్ని ఏమి చేయొద్దు అని ఏడుస్తూ ప్రాధేయపడగా , నా వల్ల మీకు ఏమి భయం లేదు మీ అక్కయ్య దగ్గరికి తీసుకు వెళ్తాను అని చెప్పగా , అక్కయ్యనా ఎక్కడుంది అని సంతోషంగా అడుగగా , ఆ అమ్మాయిని నెమ్మదిగా పైకి లేపాగా వెనుక డ్రెస్ అంతా చినిగిపోయి ఉండగా నా షర్ట్ విప్పి ఆమెకు కప్పి బనియన్ తోనే ఆమెను నెమ్మదిగా నడిపించుకుంటు బైకులో కూర్చోబెట్టి వెనుక పిల్లవాన్ని కూర్చోబెట్టుకొని నెమ్మదిగా పోనిస్తూ 20 నిమిషాలలో కృష్ణ వాళ్ళు ఉన్న దగ్గరికి చేరుకోగా అప్పటికే వాడు ఒక క్యాబ్ ను arrange చేసాడు. మమ్మల్ని చూడగానే ఆమె ఆత్రంగా వాళ్ళ తమ్ముడు , చెల్లెలి దగ్గరికి వచ్చి గట్టిగా కౌగిలించుకొని ఆనంద భాస్పాలు కారుస్తూ సంతోషాన్ని పంచుకోసాగారు.

1 Comment

Comments are closed.