జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 16 52

మహేష్ , కృష్ణ ఫ్లైట్ లో కూర్చున్న 10 నిమిషాలకు గాలిలోకి ఎగురగా , అదే సమయానికి డ్రైవర్ మేడం ఇదే మీరు చూపించిన ఇంటి అడ్రస్ అని గేట్ తెరిచి ఉండగా బయట వెహికల్ ఆపగా చాలా మంది జనాలు లోపల అరుస్తూ ఉండగా ఏమి జరిగిందో అని కార్ డోర్ తీసుకొని పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్లగా , కింద పడిన వాళ్ళను కాళ్లతో కొడుతుండగా , ఇంటిలోపలికి వెళ్లగా , అమ్మ అంటీ ఇద్దరిని కట్టివేయ్యబడి చేతిలో నుండి రక్తం చాలా కారిపోతుండగా ,పాప అంటీ అంటీ అని పీలుస్తూ ఉండగా అమ్మ పాపను గుర్తుపట్టి కళ్ళు కూడా తెర్వలేని స్థితిలో ఉండగా,నా మొబైల్ లో చేసినందువల్ల అమ్మను అమ్మ గుర్తుపట్టి కన్నీళ్లు కారుస్తూ అక్కయ్య అని గట్టిగా పిలుస్తూ వెంటనే తనతో ఉన్న karchief లను రక్తం కారకుండా గట్టిగా కడుతూ డ్రైవర్ అని గట్టిగా అరవసాగింది. అమ్మతో పాటు లోపలికి వచ్చిన తన కొలీగ్ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి డ్రైవర్ ను వెహికల్ లోపలికి తీసుకొని రమ్మని చెప్పగా గేర్ మార్చి వెనక్కు వేగంగా తీసుకొని తలుపు వరకు రాగా ఇందు అమ్మ కంగారుగా భయపడుతూ రక్తం కారనీయకుండా గట్టిగా చేతిని పట్టుకొని ఉండగా పెద్దాయన మరియు మరి కొందరి సహాయంతో నెమ్మదిగా ఎత్తుకొని కారు వరకు రాగా ఇందు అమ్మ ముందు ఎక్కగా అమ్మను నిదానంగా లోపల తన ఒడిలో కూర్చోబెట్టుకొని సున్నితంగా చెంపను నిమురుతూ అక్కయ్య నా ప్రాణాలు పణంగా పెట్టి అయినా మిమ్మల్ని కాపాడుకుంటాను అని ధైర్యం చెబుతుండగా , అంటీని కూడా నెమ్మదిగా కూర్చోబెట్టగా పక్కనే అమ్మ కొలీగ్ లోపల కూర్చొని అంటీ ని పట్టుకోగా , సెక్యూరిటీని ముందు సీట్ లో కూర్చోబెట్టగా డ్రైవర్ అతని నడుముకు సీట్ బెల్ట్ తగిలించి హాస్పిటల్ కు వేగంగా పోనిచ్చాడు.

వెంటనే అమ్మ తన హాండ్ బాగ్ లోని మొబైల్ అందుకొని నాకు కాల్ చెయ్యగా స్విచ్ ఆఫ్ అని వస్తుండగా మొబైల్ ను బ్యాగులో పడేసి ఇంకా స్పీడ్ గా వెళ్ళమని చెప్పింది. ఫ్లైట్ లో మనసుకు ఏదో uneasy గా అనిపిస్తుండగా ఎయిర్ హోస్టెస్ తో నీళ్లు తెప్పించుకుని తాగి అందరూ బాగుండాలని కోరుకున్నాను.రక్తం ఎక్కువగా పోయినందువల్ల అమ్మ కళ్ళు మూతలు పడి స్పృహ కోల్పోతుండటంతో ఇందు ఆమ్మ్ చెంపలపై సున్నితంగా తడుతూ కన్నీళ్లు కారుస్తూ అక్కయ్య అక్కయ్య అని పీలుస్తూ కళ్ళు మూతలు పడనియ్యకుండా చూసుకుంటూ బాబు తొందరగా పోనివ్వు అని వేడుకొనగా సరే మేడం అని ఫుల్ స్పీడ్ లో 15 నిమిషాల్లో దగ్గరలోని ఆసుపత్రికి చేరుకొని ఎమర్జెన్సీ బ్లాక్ దగ్గర కారును ఆపి వెంటనే లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్లి డాక్టర్ డాక్టర్ అని అరుస్తూ మూడు స్ట్రేచర్ లను సిబ్బంది సహాయంతో కారువరకు తీసుకొని వచ్చి వాళ్ళ సహాయంతో వాటిలోకి మార్చి అమ్మ చెయ్యి పట్టుకొని ICU వరకు వెళ్లగా , నర్స్ మేడం మేము చేసుకుంటామని చెప్పగా జాగ్రత్త అని చెప్పి బాధతో చెయ్యి విడవగా వేగంగా లోపలికి తీసుకొనివేల్లి తలుపు వేశారు.

ఆ వెంటనే ముగ్గురు డాక్టర్ లు లోపలికి వెల్లసాగారు. ************** ఇక్కడ ఇంటిదగ్గర పోలీస్ లకు ఫోన్ చెయ్యగా కొన్ని నిమిషాల తరువాత సైరెన్ మ్రోగుతూ పోలీసులు రాగా కింద పడిన ముసుగు దొంగలను జీప్ లోకి ఎక్కించి ఏమి జరిగింది అని అడుగగా పెద్దాయన ముందుకు వచ్చి మేమంతా పక్కనే నివాసిస్తాము అని , పాపను పిలిచి చెప్పామనగా , పాప దారిలో వెల్తూ అంటీ కేకలు వినపడటం నుండి ఇప్పటి వరకు జరిగిందంతా చెప్పగా ,పోలీస్ గుడ్ గర్ల్ అని ఎత్తుకొని పాప చాలా ధైర్యవంతురాలు అని ఒక selfie తీసుకొని నీకు మంచి అవార్డ్ ఇప్పిస్తాను అని చెప్పి వాళ్లకు అప్పగించి , వీళ్లంతా బీహార్ నుండి దిగిన బ్యాచ్ ఈనాకొడుకులకి మంచి బుద్ధి చెప్పారు అని ప్రశంసిస్తూ ఎవరికైనా దెబ్బలు తగిలాయా అని అడుగగా , పెద్దాయన లోపలికి పిలుచుకొని వెళ్లి రక్తం చూపించి కట్టివేసి హింసించారని ఒకామె సెక్యురిటి తో సహా ముగ్గురిని కారులో ఆసుపత్రికి పిలుచుకొని వెళ్లిందని చెప్పగా , ఇల్లు మొత్తం పోలీస్ లు పరిశీలిస్తుండగా , అన్ని ఖరీదైన వస్తువులు హాల్ లో కుప్పగా పెట్టి ఉండగా ఫోటోలు తీసుకొని గోడపై ఉన్న ఫోటోను చూసి ఒక కానిస్టేబుల్ సర్ ఇతను మన విశ్వ సర్ కు బాగా తెలిసిన వ్యక్తి సర్ ఒకసారి ఇతన్ని సర్ స్వయంగా వెళ్లి కాపాడారు అని చెప్పగా , వెంటనే సర్ కు కాల్ చేసి విషయం చెప్పగా అడ్రస్ అడిగి వెంటనే వచ్చేస్తాను అని చెప్పి బయలుదేరారు. **************** ఇక్కడ హాస్పిటల్ లో సెక్యూర్టీకి మత్తు ఇంజక్షన్ వేసి వెనుక దెబ్బ తగిలిన దగ్గర కుట్లు వేసి ఏమి ప్రమాదం లేదని తెలుసుకొని అతడిని ICU లో ఒక పక్కన బెడ్ పై పడుకోబెట్టారు.

1 Comment

Comments are closed.