జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 16 52

ఇక్కడ నేను ఆమెను గట్టిగా కౌగిలించుకొని వీపుపై నిమురుతోయి తలపై ముద్దులు పెడుతూ ఉండిపోగా , అన్నయ్య అన్న దివ్యక్క పిలుపుకు తెరుకోగా కష్టంగా బాధతో ఆమెను విడవలేక విడిచి హాల్ లోకి వెళ్లగా , దివ్యక్క ఆ అమ్మాయికి శుభ్రన్గా స్నానం చేయించి కొత్త బట్టలు తొడిగించి , అందంగా అలంకరించి ,వెంట్రుకలు కిందవరకు వదులుగా వదిలేసి , బొట్టు పెట్టుకొని, అమ్మాయి ఒంటిపై ఎటువంటి ఆభరణాలు లేకపోవడంతో అక్కయ్య వేసుకున్న బంగారు చెవి కమ్మలు , ముక్కు పడక , మెడలో గొలుసు , చేతికి గాజులు , వేలిపై ఉంగరం మరియు కాళ్లకు పట్టీలు తీసి అమ్మాయికి అలంకరించి తన రెండు భుజాలపై చెరొక చెయ్యి వేసి అన్నయ్య ఎలా తయారుచేసాను అని అడుగగా , ఒక్కసారిగా కళ్లల్లో ఆనంద భాస్ఫాలు కారగా అక్కయ్య దగ్గరికి వెళ్లి పక్క నుండి అక్కయ్యను కౌగిలించుకొని సంతోషంగా నవ్వుతూ నుదుటి పక్కన అక్కకు ముద్దు పెడుతూ మా అక్కయ్య మనసు బంగారం అని చెప్పాను.

ఇప్పిడేలా ఉంది అన్నయ్య అని అడుగగా లక్ష్మీ దేవి ఇంటికి వచ్చినట్టుగా చాలా చాలా అందంగా ఉంది మన దిష్టి తగిలేటట్లుగా ఉంది అక్కయ్య అని వెనుక నుండి ఆ అమ్మాయి వెంట్రుకలపై ఆప్యాయంగా నిమరసాగాను. ఎదురుగా ఆమెను చూడగా ఆనంద బాస్పాలతో కన్నీరును జలపాతం లా కారుస్తూ , ముందుకు వచ్చి తన చెల్లెలు బుగ్గలపై ఆమె రెండు చేతులు వేసి నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టి సూటిగా ముఖం లోకి చూస్తూ , అమ్మాయి కళ్లపై చెరొక ముద్దు పెట్టి వెంటనే బాధపడుతూ మాకు కనిపించారాదని వెనక్కు తిరగగా , ఎందుకో అర్థమవ్వగా అక్కయ్య ఆమెకు మరియు ముసలావిడకు కూడా బాత్రూం చూపించు స్నానం చేసేస్తారు అని చెప్పి కృష్ణ దగ్గరికి వెల్లసాగాను.

రేయ్ కృష్ణ అని పిలువగా ఫ్లైట్ గురించి కనుక్కున్నావా అని అడుగగా , ఇందాకే కాల్ చేసానురా 11:30 కు ఫ్లైట్ అని చెప్పారు అని చెప్పగా , ఇంకా 5 గంటలు సమయం ఉందని ఆనందిస్తూ, సరే డ్రైవర్ ను కారు స్టార్ట్ చేసి ఉంచమని చెప్పు అర్జెంట్ గా బయటకు వెళదాము అని చెప్పగా , నేను లోపలికి రాగా ఆ చిన్న అబ్బాయి స్నానం చేసి బట్టలు వేసుకొని వాళ్ళ అక్క దగ్గర ఉండగా ,పెద్దవాళ్ళు ఇద్దరు స్నానానికి వెళ్లగా , బాబు అక్కయ్యను జాగ్రత్తగా పిలుచుకొని రా బయటకు వెళదాము అని చెప్పగా , సరే అన్న అని చెప్పి బయటకు నెమ్మదిగా చెయ్యి పట్టుకొని వెళుతుండగా, దివ్యక్కకు ఆ అమ్మాయి కళ్ళు ఒకసారి డాక్టర్ కు చూపిస్తానని చెప్పగా సంతోషిస్తూ అన్నయ్య గుడ్ న్యూస్ తో తిరిగి రా అని మనఃస్ఫూర్తిగా చెప్పగా , నువ్వన్నదే జరగాలి అక్క అని బయటకు వెళ్లి నెమ్మదిగా కారులో కూర్చోబెట్టి , బాబుకు అక్కను జాగ్రత్తగా పట్టుకోమని చెప్పి బాబు పక్కనే కూర్చొని సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ కు పోనివ్వమని చెప్పారా మామా అని చెప్పగా , ఎందుకో అర్థమయ్యి డ్రైవర్ కు అడ్రస్ చెప్పి వెల్లమంటాడు.

బాబు అక్కయ్యకు ఎప్పట్నుంచి కళ్ళు కనపడటం లేదు అని అడుగగా , ఆ అమ్మాయి తమ్ముడు పేరు రాము అని చెప్పగా , అవునన్నయ్య నా పేరు రాము అక్కయ్య పేరు సౌమ్య అని నవ్వుతూ చెబుతూ అక్కయ్యకు చిన్నప్పుడు కళ్ళ లోకి ఏదో రసం కారగా అప్పటి నుండి కనిపించలేదు అని పెద్ద అక్కయ్య చెపుతుండగా విన్నాను అని బాధతో చెప్పగా సరే అయితే అక్కకు కచ్చితంగా చూపు రావచ్చు అని చెప్పగా , రాము సంతోషిస్తూ అక్కకు చూపు వస్తుందా అన్నయ్య చాలా థాంక్స్ అన్నయ్య అని అక్కయ్య చేతిని ఆనందంతో గట్టిగా పట్టుకోగా , సౌమ్య ముఖం లో చిన్నగా సంతోషం కనబడసాగింది.

1 Comment

Comments are closed.