జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 16 50

ఇక అమ్మకు మరియు అంటీ కు ఇద్దరికి రక్తం చాలా పోయినందువల్ల , ఇద్దరి బ్లడ్ చెక్ చేసి వారికి సరిపోయే బ్లడ్ కోసం అన్ని హాస్పిటల్స్ కు మరియు బ్లడ్ బ్యాంక్ లకు కాల్స్ చేస్తుండగా ఒక 15 నిమిషాలలో అంటికి కావలసిన బ్లడ్ దొరకడంతో అంటీ కి ఎక్కిస్తూ తన తలకు తగిలిన దెబ్బకు చికిత్స చెయ్యసాగారు. అమ్మకు కావలసిన బ్లడ్ కోసం ఎంత ప్రయత్నించినా ఎక్కడా ఆశించిన సమాచారం దొరకక బ్లడ్ దొరకలేదని బ్లడ్ లేకపోతే ప్రాణానికి ప్రమాదమని హాస్పిటల్ మొత్తం డాక్టర్లు , నర్సులు మరియు స్టాఫ్ హడావిడిగా అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతుండగా , ఒక పక్క భయపడుతూ కన్నీరు కారుస్తూ నిలబడిన అమ్మ కు విషయం ఏమిటో అర్థం కాక కంగారు పడుతుండగా ఒక నర్సు ICU లో నుండి పరిగెత్తుతూ రిసెప్షన్ దగ్గరికి వెళ్లి బ్లడ్ గురించి ఏదైనా సమాచారం అందిందా అని అడుగగా , లేదు అని బాధతో చెప్పగా , హడావిడిగా అటు ఇటు తిరుగుతున్న నర్సును ఆపి మా అక్క వాళ్లకు ఇప్పుడు ఎలా ఉంది అని అడుగగా తలకు దెబ్బ తగిలింది ఆవిడకు బ్లడ్ దొరికింది ఆవిడకు ప్రమాదం ఏమి లేదు కానీ ఇంకొక ఆవిడకు సిటీలో ఎక్కడా కూడా బ్లడ్ దొరకలేదు , ఒక గంటలో బ్లడ్ దొరకాకపోతే ప్రాణానికి ప్రమాదం అని చెప్పగా ఇందు అమ్మ ఒక్కసారిగా షాక్ లో ఉన్నట్లుగా భయపడుతూ కదలకుండా ఉండిపోగా నర్సు లోపలికి వెళ్లిపోగా , పక్కనే ఉన్న అమ్మ కొలీగ్ మేడం మేడం అని పలకరించగా , వణుకుతూ తెరుకోగా కన్నీళ్లు కారుస్తూ భయంతో ఏడుపు వస్తుండగా , రిసెప్షన్ దగ్గరికి వెళ్లి ఏ బ్లడ్ కావాలో కనుక్కోగా కావలసింది తన బ్లడ్ గ్రూప్ అని తెలియగా , ఆనందిస్తూ పరిగెత్తుకుంటూ వెళ్లి ICU లో ఉన్న డాక్టర్ల కు నాది అదే బ్లడ్ గ్రూప్ నా నుండి రక్తం తీసుకోండి అని చెప్పగా , ఒక్క బాటిల్ సరిపోదు అండి, కనీసం 2 –2 1/2 బాటిల్స్ రక్తం కావాలి చాలా రక్తం పోయింది అని చెబుతుండగా మొత్తం నా నుండే తీసుకోండి డాక్టర్ అనగా , అది అస్సలు కుదరదు ఒక మనిషి నుండి మాక్సిమం ఒక బాటిల్ మాత్రమే తీసుకోవాలి అంతకంటే ఎక్కువ తీసుకుంటే మీ ప్రాణానికి ప్రమాదం అని వివరిస్తుండగా , అమ్మ డాక్టర్ కు చేతులెత్తి నమస్కరిస్తూ నేనుండగా మా అక్కయ్యకు జరగరానిది ఏదైనా జరిగితే నేను జీవించడం అనర్థం డాక్టర్ గారు , నా ప్రాణాలు పోయినా పర్లేదు డాక్టర్ మా అక్కను బ్రతికించండి అని ఏడుస్తూ ప్రాధేయపడగా , డాక్టర్ కు బ్లడ్ దొరికే ఏ మార్గము కనిపించకపోవడంతో కొద్దిసేపు ఆలోచిస్తుండగా , డాక్టర్ మీకు ఏ ప్రాబ్లెమ్ రాకండా నా సంతకం కూడా పెడతాను , మొత్తం నాదే బాధ్యత , ఎంత డబ్బు అయినా పర్లేదు ఇస్తాను, ఏమి ఆలోచించకుండా ఎంత రక్తం కావాలో తీసుకొని మా అక్క ప్రాణాలు నిలపండి డాక్టర్ అని రెండు చేతులతో మొక్కుతూ ఏడుస్తూ బతిమాలగా , హాస్పిటల్ లో ఉన్న పెద్ద డాక్టర్లందరిని పిలిపించి ఇద్దరి ప్రాణాలు ఎటువంటి హాని జరగకుండా డాక్టర్లందరు రెండు గ్రూప్ లుగా విడిపోయి, కొంతమంది లోపల ఉన్న అమ్మ ను చెక్ చెయ్యడానికి వెళ్లగా, నర్సు అమ్మను లోపలికి పిలుచుకొని వెళ్లి బెడ్ పై పడుకోబెట్టి బ్లడ్ తీసుకుంటూ మరొక గ్రూప్ డాక్టర్లు ఇందు అమ్మను ప్రతి క్షణం BP , బాడీ టెంపరేచర్ చెక్ చేస్తూ ఒక బాటిల్ రక్తం తీసుకొని , అమ్మకు ఎక్కించసాగారు.

ఒక బాటిల్ రక్తం తీసుకున్న మారు క్షణం నుండి ఇందు అమ్మను ఇంకా ఎక్కువ కేర్ తీసుకుంటూ దగ్గరుండి డాక్టర్లు చూసుకుంటూ , ఇలాంటి situation ను ఎప్పుడు ఎరుగకపోవడంతో డాక్టర్లే ఇందు అమ్మకు ఏమవుతుందో అని బయపడసాగారు , ఇందు అమ్మ మాత్రం తన శరీరం లోనుండి ప్రతి క్షణం శక్తి తీసేస్తున్నట్లుగా , ప్రాణం పోతున్నట్లుగా అనిపిస్తున్నా కూడా తన కన్న కొడుకును ప్రాణానికి ప్రాణంగా పెంచిన అక్కయ్యకు ఆ ప్రాణాన్ని ఇస్తున్నందుకు పెదాలపై చిరునవ్వుతో ఆనందించసాగింది. ఆ దృశ్యాన్ని డాక్టర్లందరు చూస్తూ ఆమె ప్రాణాలు కాపాడటం కోసం ఈమె తన ప్రాణాలు కూడా లెక్కచేస్తుండకపోవడంతో ఆశ్చర్యం వ్యక్తం చెయ్యసాగారు. అంతలో అమ్మ శక్తి లేకపోవడం వల్ల కళ్ళు మూతలు పడుతూ స్పృహ కోల్పోతుండటంతో వెంటనే బ్లడ్ తీసుకోవడం ఆపు చెయ్యగా అప్పటికే రెండో బాటిల్ కూడా దాదాపు నిండుకుని ఉండటంతో సరిపోతుందని , బ్లడ్ అమ్మకు ఎక్కిస్తూ , వెంటనే ఇందు అమ్మకు గ్లూకోస్ ఎక్కించసాగారు.

1 Comment

Comments are closed.