జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 16 52

ఆ ఐదుగురిలో తెలుగు బాగా మాట్లాడేవాడు తలుపు కొట్టి నేను సెక్యూరిటీని మేడం తాగడానికి నీళ్లు కావాలి అని బాటిల్ తో తలుపు కొట్టగా అమ్మ పైకి లేచి ఫ్రిడ్జ్ లో ఒక వాటర్ బాటిల్ తీసుకొని తలుపు తెరిచి ఇస్తుండగా వెంటనే ఒకడు అమ్మ నోటిని చేతితో మూసేసి లోపలికి లాక్కొని వెళ్లి గొంతుపై కత్తి పెట్టి అరిచావో చంపేస్తా అని బెదిరించగా , అమ్మ బయపడక అంటీ ని హెచ్చరిస్తుండగా ఇంకొకడు వేగంగా లోపలికి వెళ్ళి అంటీ అరిచేలోపు చెంపపై గట్టిగా ఒక దెబ్బ వెయ్యగా వెళ్లి గోడకు తగిలి రక్తం కారుతూ కిందకు పడిపోగా , ఇద్దరి నోటిలో గుడ్డలు కుక్కి కుర్చీలలో కూర్చోబెట్టి తాళ్ళు అని అడుగగా బయటే విడిచి వచ్చామని హిందీలో చెప్పగా , త్వరగా తీసుకొని రండి అని అరవగా , నలుగురు అమ్మ అంటీ ని చెరొకవైపు పట్టుకోగా అమ్మ భయయపడుతూ , అంటీ స్పృహలో లేక వెనక్కు వాలిపోయి ఉండగా ఏమి చేస్తారో అని ఏడుస్తూ గుడ్డలు నోటిలో ఉండటం వల్ల అరవలేక పోతున్నారు. ఒకడు తలుపు తెరిచి పరిగెత్తుకుంటూ వెళ్లి తాళ్ళు తీసుకొని వేగంగా లోపలికి వస్తూ తలుపు సరిగ్గా వెయ్యక లోపలికి వెళ్ళి తాళ్లతో ఇద్దరిని కట్టేసి , ముగ్గురు అన్ని గదులలోకి వెళ్లి దొరికినవన్నీ హాల్ లోకి తెచ్చి బ్యాగులో నింపుతుండగా , ఒకడు అమ్మ దగ్గరికి వచ్చి నగలు డబ్బు ఎక్కడ అని గట్టిగా అరుస్తూ అడిగి గుడ్డ తియ్యగా, అమ్మ అంటీ ని వదిలేస్తే చెబుతాను అని సూటిగా చెప్పగా , అమ్మ చెంపపై ఒక దెబ్బ వేసి కత్తి అందుకొని కట్టేసిన ఒక్కొక్క చేతిపై నరం దగ్గర కట్ చెయ్యగా రక్తం సర్రుమని కారసాగింది.

అమ్మ నొప్పితో గట్టిగా అరవగా వెంటనే నోటిలోకి గుద్ద పెట్టెయ్యగా , ఆ అరుపుకు ఇంటి బయట రోడ్ లో గెంతుతూ పాటలు పాడుకుంటూ గేట్ దాటుతూ వెళుతున్న పాప వినగా , ఒక్కసారిగా ఆగిపోయి వెనక్కు వచ్చి చీకటిలో లోపలికి చూడగా , తలుపు సరిగ్గా వెయ్యనందువల్ల డబ్బు కోసం వెతుకుతూ అటు ఇటు తిరుగుతున్న ముసుగులో ఉన్న వాళ్ళు కనిపిస్తుండగా భయమేసి అటు ఇటు చూడగా గేట్ పక్కన తను రోజు చూసి మాట్లాడే సెక్యురిటి తాళ్లతో కట్టేసి కదలకుండా పది ఉండటంతో , వాళ్ళ అమ్మకు చెప్పాలని వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లి ఆయాసపడుతూ మాటలు రాక ఒక్కొక్క మాటే అర్థం కానట్లు చెబుతుండగా , వాళ్ళ అమ్మ ఎత్తుకొని ఓదార్చి కొన్ని నీళ్లు తాగించగా , ఆత్రంగా అక్కడ సెక్యురిటి అంకుల్ ను కొట్టి పడేసి ఉండగా , లోపల ముసుగు మనుషులు ఉన్నారమ్మా అని లోపల ఎవరివో అరుపులు వినిపించాయమ్మ అని గుక్కతిప్పుకోకుండా చెప్పగా ,వెంటనే పాప అమ్మ బయటకు వచ్చి గూడెం లో ఉన్నప్పుడు పెద్దగా ఉండే పెద్దయ్య దగ్గరికి వెళ్లి మొత్తం వివరించగా , అతడు ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా బయటకు వచ్చి ఒరేయ్ ఎల్లయ్య , రామయ్య , లక్షమయ్యా ………….

అని గట్టిగా అరవగా తలుపులు వేసుకున్న వారందరు బయటకు వచ్చి ఏమిటి పెద్దయ్య అని అడుగగా పాప చెప్పినదంతా చెప్పగా ఎక్కడికక్కడ అందరూ దొరికిన ఆయుధాన్ని చేతిలో పట్టుకొని శబ్దం చెయ్యకుండా 2 నిమిషాలలో గేట్ దగ్గరికి రాగా తలుపు వేసి ఉండగా పాప చూడు తాతయ్య అని సెక్యూరిటీని చూపించగా , ఒరేయ్ గేట్ ఎక్కండి రా అని అరవగా ఒక 20 మంది వెంట వెంటనే గేట్ ఎక్కి లోపలికి దూకి పెద్ద రాయి తీసుకొని తాళం పగలగొట్టగా 50 మందికి పైగా జనాలు గుంపుగా లోపలికి వెళ్లగా , ఆ శబ్దం విని ఒకడు తలుపు దగ్గరికి వచ్చి చూడగా చాలా మంది జనాలు పరిగెత్తుకుంటూ వస్తుండగా తలుపు వేసి ఘడి పెట్టి మిగతా వాళ్లందరికీ చెప్పగా , పారిపోండిరోయి అని దిక్కులకొకడు పరిగెత్తగా , అంతలోపు పెద్దాయన అందరితో ఇంటిని చుట్టూ ముట్టగా , కొందరు వెళ్లి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా కత్తిపట్టుకున్న వాడు దాడి చెయ్యబోగా అడవిలో పెరిగిన వీళ్ళు వాణ్ణి వొంగి పెట్టి కుమ్మేసి బయటకు ఈడ్చుకు వచ్చారు . వెనుక వైపు దుంకి పారిపోతున్న నలుగురిని కుమ్మేసి లాక్కొచ్చి ఇంటి ముందు పడెయ్యగా రక్తం కారుతుండగా నొప్పితో మూలుగుతూ ఉండగా , వారి ముసుగులు తియ్యగా అందులో ఒకడు ఉదయం క్యాబ్ లో ఎయిర్పోర్ట్ వరకు డ్రాప్ చేసినవాడు. అంటే ఉదయం నుండి ప్లాన్ వేసి చేశారు.

1 Comment

Comments are closed.