జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 16 51

నిన్న నన్ను అక్కయ్య అని పిలిచావుగా చెల్లెమ్మ అని దగ్గరకు తీసుకోగా , మొదటి సారిగా అమ్మను సంతోషంగా కౌగిలించుకొని మనసారా ఆనందించసాగింది.అంతలో సెక్యురిటి కూడా మేల్కొనగా తమ వారికి కాల్ చేసాడు. అర గంటలో అంకుల్ మరియు దివ్యక్క కంగారు పడుతూ హాస్పిటల్ కు చేరుకొని ఎక్కడ ఉన్నారో తెలుసుకొని ICU కు చేరుకొని ఇద్దరిని చూసి ఏడుస్తూ పక్కన కూర్చోగా , ఇప్పుడేమైంది ఇద్దరమూ బానే ఉన్నాము , ఇందు అమ్మను చూపిస్తూ మమ్మల్ని కాపాడి ఇప్పటివరకు ప్రాణంగా చేసుకొంది అని చెప్పగా , దివ్యక్క ఇందు అమ్మను చూసి ఆశ్చర్యపోతూ మేడం మీరు ఇక్కడా నిన్నటి నుండి నేను నాన్న గారు మీ గురించే మాట్లాడుకుంటున్నాము , ఈ రోజు అన్ని పేపర్స్ లో మీరే ఉన్నారు అని అమ్మకు అంటీ కు ఇందు అమ్మ ఎవరో వివరించసాగింది. ఇంత గొప్పవారు మాకు ఇంత తాపాత్రయ పడుతున్నారు మీ రుణం ఎలా తీర్చుకొనేది మేడం అని మాట్లాడగా , అక్కయ్య మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటే అదే మీరు నాకు ఇచ్చే రుణం అని చెప్పగా , అందరూ అమ్మ మంచితనానికి పులకించిపోసాగారు.

కొద్దిసేపటి తరువాత చీఫ్ డాక్టర్లు వచ్చి అందరిని పరిశీలించి , ఈ రోజు కూడా ఇక్కడే ఉండాలి రేపు చెక్ చేసి డిశ్చార్జ్ చేస్తామని చెప్పి సెక్యూరిటీని చెక్ చేసి కొలుకున్నాడని అతడికి తలకు కట్టు కట్టి రెండు రోజులకు మళ్ళీ రమ్మని చెప్పి డిశ్చార్జ్ చెయ్యగా వచ్చిన తన బంధువులతో వెళ్లిపోయారు. అమ్మ బ్యాంక్ చైర్మన్ ఫ్లైట్ సమయం అవుతోంది ఎక్కడ ఉన్నారు అని కాల్ చెయ్యగా సర్ నేను రెండు రోజుల తరువాత వస్తాను అని చెప్పి తనతో కొలీగ్ ను హోటల్ కు పంపించివేసింది. ఇందు అమ్మ , దివ్యక్క మరియు అంకుల్ , అమ్మ మరియు అంటీ ను జాగ్రత్తగా చీసుకుంటు , భోజనం , పళ్ళు , పళ్ళ రసాలు తాగిస్తూ మందులు ఇస్తూ నవ్విస్తూ మాట్లాడసాగారు.

విశ్వ సర్ వచ్చి విక్రమ్ సర్ తో మహేష్ ఎక్కడ ఉన్నది తెలియరాలేదు అని చెప్పగా , అమ్మ దగ్గరికి వచ్చి ఇదే విషయం చెప్పి సాయంత్రం లోపల ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటామని చెప్పగా , అమ్మ అది విని మహేష్ , ఈమె కొడుకు హైద్రాబాద్ కు ఫ్రెండ్ పెళ్లికి వెళ్లారని చెప్పగా వెంటనే బయటకు వచ్చి దీనికి కారణమైన ఆ దొంగలు ఎక్కడ అని కోపంగా అడుగగా , వెంటనే ఆ ఏరియా స్టేషన్ కు పిలుచుకొని వెళ్లగా సెల్ లోకి వెళ్లి లాఠీలు విరిగేలా కొట్టి వస్తున్న కోపాన్ని తీర్చుకొని విశ్వతో వీళ్లను వదలొద్దు అని చెప్పి, హైద్రాబాద్ లో సిగ్నల్స్ ఎక్కడ వస్తున్నాయో కనుక్కోవడానికి స్వయంగా పోలీస్ కంట్రోల్ కు వెల్లసాగారు.

మహేష్ మరియు కృష్ణ తెల్లని బట్టలు వేసుకొని అతడి వెంట నడుస్తుండగా లోపల అంతా పచ్చటి చెట్లతో , శుభ్రన్గా ప్రశాంతంగా ఎటువంటి శబ్దం లేకుండా అడవిలో దొరికే వాటితోనే వరుసగా పక్క పక్కనే కుటీరాలు చాలా ఉండగా మొదటి కుటీరం లోకి పిలుచుకొని వెళ్లగా , చెక్క కుర్చీలలో కూర్చోబెట్టి ఒక ముసలి వ్యక్తి ఎక్కడ నుండి వచ్చారు ఎవరు కావాలని అడుగగా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైజాగ్ నుండి వచ్చామని చెప్పి శివ గారి కోసం వచ్చామని చెప్పగా , ఆయన ఏమవుతారని ప్రశ్నించగా మా తండ్రి గారు ఆయనను ఒప్పించి పిలుచుకుపోవడానికి వచ్చామని చెప్పగా , ఆయన మీ వెంట వస్తే తప్పకుండా తీసుకువెళ్లొచ్చని మాట ఇవ్వసాగారు.

ఒక మధ్య వయసు వ్యక్తిని పిలిచి వైజాగ్ శివ గారిని పిలుచుకొని రమ్మనగా , వెంటనే వెళ్లి ఒక 5 నిమిషాల తరువాత వచ్చి మూలికలు తేవడానికి అడవిలోకి వెళ్లారని చెప్పగా , పక్కన గది ఉంది వేచి ఉండండి ఇంకో గంటలో వచ్చేస్తారని చెప్పగా థాంక్స్ చెప్పి బయటకు రాగా చుట్టూ చూడగా ఆహ్లాదంగా కనిపిస్తుండగా మొత్తం చూడొచ్చా అని మా పక్కనే ఉన్న వ్యక్తిని అడుగగా , ఇక్కడ ఎటువంటి restrictions ఉండవు ఎవరు ఎక్కడికైనా వెళ్లొచ్చు ఏమైనా చెయ్యొచ్చు అని స్వయంగా అతడే లోపల ఏమేమి ఉన్నాయో వివరిస్తూ చూపిస్తుండగా వర్షం చిన్నగా మొదలవ్వగా ఖాళీగా ఉన్న కుటీరం లోకి పిలుచుకొని వెళ్లగా వెంటనే ఉరుములు మెరుపులతో భయంకరమైన వర్షం కురావసాగింది. ఇక్కడ ఒక్కసారి వర్షం మొదలైందంటే ఉదయం వరకు ఆగదు అని చెప్పగా సహజసిద్ధమైన ప్రకృతిని ఆస్వాదించసాగాము.

1 Comment

Comments are closed.