జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 16 52

డాక్టర్లు ఇందు అమ్మకు అన్ని చెక్ చేసి కొన్ని గంటలు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని అందరూ ఊపిరి పీల్చుకొనసాగారు. రాత్రంతా ఇద్దరు డాక్టర్లను ICU రూమ్ లోనే ఉండమని చెప్పి అర గంటకోసారి వారి ఆరోగ్యం చెక్ చేస్తూ ఉదయం వరకు రిజిస్టర్ చెయ్యమని చెప్పి మిగిలిన డాక్టర్లు బయటకు వచ్చి ఇప్పుడేమి పర్లేదు అందరూ బాగున్నారు ఉదయానికల్లా అంతా సెట్ అవుతుంది అని డ్రైవర్ మరియు అమ్మ కొలీగ్ తో చెప్పి వెళ్లిపోయారు. వాళ్లిద్దరూ ఆనందపడుతూ అమ్మ కొలీగ్ డ్రైవర్ తో మీరు వెల్లలనుకుంటే వెళ్ళండి నేను చూసుకుంటాను అని చెప్పగా ,సరే మేడం నేను ఉండేవాన్ని కాకుంటే ఇంటి దగ్గర పిల్లలు ఎదురుచూస్తుంటారు , ఇప్పుడు వెళ్లి ఉదయమే వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తరువాత నర్సు బయటకు రాగా పక్కన కుర్చీలో కూర్చున్న అమ్మ కొలీగ్ ను చూసి , మేడం లోపలికి రండి అని పిలుచుకొని వెళ్లి ఒక బెడ్ చూపించి ఇక్కడ రెస్ట్ తీసుకోండి , మేము చూసుకుంటాము అని చెప్పగా , ఒకసారి అమ్మ చెయ్యి అందుకొని నిమురుతూ కొద్దిసేపు పక్కనే కూర్చుని తరువాత కొద్దిసేపు పడుకొనసాగింది.

విశ్వ సర్ మహేష్ ఇంటికి వచ్చేటప్పటికి పోలీసులు పెద్దయ్యతో పాటు ఒక ఇద్దరిని ఇక్కడే ఉండమని చెప్పి మిగతా వారందరినీ వారి వారి ఇళ్లకు పంపించివేశారు. విశ్వ సర్ వేగంగా జీప్ దిగి లోపలికి వెళ్ళి మొత్తం ఇల్లు పరిశీలించి హాల్ మొత్తం రక్తం ఉండగా ఏమి జరిగిందో అని కంగారు పడుతూ , జరిగినదంతా తెలుసుకొని నాకు ఫోన్ చెయ్యగా స్విచ్ ఆఫ్ రావడంతో , అర్ధరాత్రి 1 గంట దాటుతుండగా విక్రమ్ కు ఫోన్ చెయ్యగా చాలా సేపటి తరువాత ఎత్తగా , జరిగిందంతా చెప్పి ఎవరో ఒక ఆమె ఇద్దరిని హాస్పిటల్ కు తీసుకొని వెళ్లిందంట అని చెబుతూ మహేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది ఇప్పుడేం చెయ్యాలి అని అడుగగా , ఉండరా ఒక్క నిమిషం కాల్ చేస్తానని కట్ చేసి ఇందు అమ్మ వైజాగ్ లో ఉందని తెలుసు కాబట్టి ఒకవేళ అమ్మే వాళ్ళను తీసుకుని హాస్పిటల్ కు వెళ్లి ఉంటుందేమో అని ఐడియా రాగా , వెంటనే ఇందు అమ్మకు కాల్ చెయ్యగా ఇక్కడ ICU రూమ్ లో ఫోన్ అమ్మ హాండ్ బాగ్ లో మ్రోగుతుండగా , నర్సు తీసి ఎత్తగా మేము పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాము మేడం ఎక్కడ అని అడుగగా హాస్పిటల్ పెరు చెప్పి నర్సును మాట్లాడుతున్నాను అని జరిగినదంతా వివరించగా , ఆత్రంగా పక్కన ఎవరైనా డాక్టర్ ఉన్నారా అని అడుగగా సర్ అని డాక్టర్ కు ఫోన్ ఇవ్వగా , నేను DSP మాట్లాడుతున్నాను నేను వచ్చే వరకు మేడం ను మరియు మేడం తీసుకొచ్చిన వారందరినీ జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి , వెంటనే విశ్వ సర్ కు కాల్ చేసి ఉన్న పలంగా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళమని , నేను ఉదయానికళ్ల వైజాగ్ వచ్చేస్తాను , వాళ్లకు ఏదైనా జరిగితే నేను తట్టుకోలేనురా అని బాధపడుతూ చెప్పగా , ఇప్పుడే వెళుతున్నాను వారికి ఏమి జరగకుండా దగ్గరుండి డాక్టర్ల సహాయంతో జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది అని నువ్వేమి కంగారు పడకు జాగ్రత్తగా రమ్మని చెప్పి కాల్ కట్ చేశారు.

విశ్వ సర్ జీపులో ఉన్న దొంగలను కర్ర విరిగేట్లుగా కొట్టి ఇంటి దగ్గర ఇద్దరు కానిస్టేబుల్ లను ఉంచి ఈ నా కొడుకుల్ని స్టేషన్ లో బూకలో వెయ్యండి ఉదయం వచ్చి వీళ్ళ పని చూస్తాను అని జీప్ లో హాస్పిటల్ కు వెల్లసాగారు. ఎవరండి అని నిద్రలేస్తూ విక్రమ్ సర్ భార్య అడుగగా జరిగిందంతా వివరించగా , కంగారుపడుతూ మహేష్ అన్నయ్యకు ఎలా ఉందంట అని అడుగగా , మహేష్ అక్కడ లేదు అందుకే కచ్చితంగా వెళ్ళాలి అని చెప్పగా , వెంటనే బాగు సర్ది ఇస్తూ , మా గురించి భయపడవద్దు పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటాను వెళ్లిన వెంటనే కాల్ చెయ్యండి అని చెప్పగా , ప్రేమగా తన భార్యకు , పిల్లలకు ముద్దు పెట్టి బయట కాపలా ఉన్న కానిస్టేబుళ్ళకు జాగ్రత్తగా ఉండమని హెచ్చరించి , పోలీస్ వ్యాన్ లో ఎయిర్పోర్ట్ కు వెల్తూ వైజాగ్ కి వెంటనే ఏ ఫ్లైట్ ఉందొ దానికి టికెట్ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్ చేరుకొని వైజాగ్ బయలుదేరారు.హాస్పిటల్ లో శరీరంలో శక్తి లేకున్నా ఇందు అమ్మ బెడ్ పై లేచి కూర్చొని చేతికున్న గ్లూకోస్ ను పీకి వేసి అమ్మకు ఎలా ఉందో చూడాలని బెడ్ నుండి దిగి అమ్మ బెడ్ దగ్గరికి నెమ్మదిగా వెళుతుండగా డాక్టర్ నర్సు కంగారు పడుతూ , నర్సు ఇందు అమ్మ దగ్గరికి వచ్చి పడిపోకుండా పట్టుకొని అమ్మ బెడ్ దగ్గరకు నిదానంగా పిలుచుకొని వెళ్లగా , బెడ్ పై అమ్మ పక్కనే కూర్చుని చేతి వేళ్ళను సున్నితంగా తడుముతూ కన్నీళ్లు కారుస్తుండగా మేడం ఏమి భయపడాల్సిన పని లేదు డాక్టర్లు ఉదయానికల్లా మాములు స్థితికి వచ్చేస్తారు అని చెప్పారు , వీళ్ళ కోసం మీరు పడిన శ్రమ వృధా పోలేదు మీరు భయపడాల్సిన పని లేదు అని ధైర్యం చెప్పసాగింది.

మీకు రెస్ట్ అవసరమని ఎంత చెప్పినా వినకుండా అమ్మను చూస్తూ పక్కనే కూర్చుండిపోయింది. అంతలో విశ్వ సర్ హాస్పిటల్ కు పోలీస్ సైరెన్ తో చేరుకొని రిసెప్షన్ లో ఎంక్విరీ చేస్తుండగా వెళ్లి చీఫ్ డాక్టర్ ను పిలుచుకొని రాగా స్వయంగా సర్ ని ICU కి పిలుచుకొనివెళ్లి ముగ్గురి ట్రీట్మెంట్ గురించి వివరిస్తూ , ఇందు అమ్మతో మేడం మీకు రెస్ట్ అవసరం మేము దగ్గరుండి చూసుంటాము అని డాక్టర్ చెప్పగా నర్సు దగ్గరుండి అమ్మను బెడ్ వరకు తీసుకు వెళ్లి పడుకోబెట్టగా ,నర్స్ ఒక వేళ ఆమెకు నిద్రపోకపోతే ఫ్రూట్ జ్యూస్ తాగించండి అని చెప్పసాగారు. విశ్వ సర్ అమ్మను నిన్న టీవీ లో చూసినందువల్ల గుర్తుపట్టినా ఇప్పుడు రెస్ట్ కావాలని డాక్టర్ చెబుతున్నందువల్ల ఉదయం మాట్లాడొచ్చని అనుకొని , అందరిని జాగ్రత్తగా ట్రీట్ చేస్తున్నందుకు చాలా చాలా థాంక్స్ డాక్టర్ అని చెప్పి ఇలాగే చూసుకోండి అని , ఏదైనా అవసరం అయితే నాకు కాల్ చెయ్యండి అని సర్ నెంబర్ ఇచ్చి బయటకు వస్తూ , వాళ్లంతా మాకు చాలా దగ్గరి వాళ్ళు , ఆమె ఎవరో మీకు ఉదయం తెలుస్తుంది అప్పటివరకు చాలా జాగ్రత్తగా చూసుకోండి , నాకు స్టేషన్ లో పని ఉంది ఉదయం వస్తాను అని చెప్పి , విక్రమ్ కు కాల్ చెయ్యగా తగలకపోవడంతో , All are safe అని మెసేజ్ పెట్టి స్టేషన్ కు వెళ్లిపోయారు. అమ్మకు కూడా నీరసంగా ఉండటంతో నర్సు ఇచ్చిన జ్యూస్ తాగగా నెమ్మదిగా కళ్ళు మూతపడుతుండగా అలాగే నిద్రపోయింది. తెల్లవార్లు డాక్టర్లు నలుగురి ఆరోగ్య పరిస్థితిని జాగ్రత్తగా చూసుకొనసాగారు.

1 Comment

Comments are closed.