జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 16 53

లోపల కాగడాల వెలుగులో నాన్న గారు తెల్లటి బట్టలు వేసుకొని ఉండగా చూడగా ముఖం లో ఒక తేజస్సు కనిపిస్తుండగా, సంతోషం పట్టలేక ఆత్రంగా వెళ్లి నాన్నా అని సంతోషంగా కౌగిలించుకొని రెండు చేతులతో ప్రేమగా నిమురుతుండగా , నాన్న లో సంతోషం , నవ్వు తప్ప ఏమాత్రం చలన0 లేకపోవడంతో వెనక్కు జరిగి నాన్న నేను నీ మహేష్ , వీడు కృష్ణ అని చెబుతుండగా , తెలుసు మహేష్ అని ముఖం లో నవ్వు తప్ప వేరే expressions లేకుండా స్వామిజీల లాగా మాట్లాడసాగాడు.

నాన్న ఎలా ఉన్నారు బాగున్నారా అని , చూస్తున్నావుగా ఇక్కడ సంతోషం తప్ప వేరే వాటికి చోటు ఉండదు. నాన్న మాతోపాటు వచ్చెయ్యండి మీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాము అని చెప్పగా , అవును అంకుల్ ఇక్కడి నుండి మన ఇంటికి వెళ్లిపోదాము అని కృష్ణ కూడా చెప్పగా , చూడు మహేష్ ఇప్పుడు నాకు ఏ సంబంధాలు , దాంపత్య జీవితం భార్య పిల్లలు అన్న రిలేషన్స్ లేవు , నేను ఇక్కడ హాయిగా , సంతోషంగా ఉన్నాను ఇక నుండి కూడా జీవితాంతం ఇలాగే ఇక్కడే ఆనందంగా జీవితం గడిపేస్తాను , అది కాదు నాన్న గారు అని మాట్లాడుతుండగా ,ఆపి నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నావా లేదా అని సూటి ప్రశ్న వెయ్యగా , మీరు ఎప్పుడు సంతోషంగా జీవించాలని కోరుకుంటాను నాన్న గారు అని బదులివ్వగా , అయితే నన్ను ఇక్కడి నుండి రమ్మని మాత్రం పిలవద్దు నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను , మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్లిపోండి అని సూటిగా చెప్పెయ్యగా , సరే నాన్న గారు వెళ్లిపోతాము మీరు సంతోషంగా ఉండటమే నాకు కావాల్సింది.

మీకు ఎప్పుడైనా రావాలి అని అనిపించినా వెంటనే వచ్చెయ్యండి మీ రాక కోసం ఎప్పుడు ఎదురుచుస్తూనే ఉంటాము అని చెప్పి ఒకసారి ఆప్యాయంగా కౌగిలించుకొని వెళ్ళొస్తాము నాన్నగారు అని చెప్పి బయటకు వస్తుండగా, మహేష్ అని పిలువగా నాన్న అని వెనుకకు తిరగగా , ఒకసారి మన లాయర్ ని కలవమని చెప్పి , అమ్మను జాగ్రత్తగా చూసుకో అని చెప్పి బయటకు వెళ్లిపోయారు.

వెంటనే కృష్ణ ఒరేయ్ ఆపరా ఎలాగైనా పిలుచుకొని వెళదాము అని చెప్పగా , లేదు రా నాన్న ఇంత సంతోషంగా ఉండటం ఎప్పుడు చూడలేదు , కొన్ని నెలలు ఇక్కడే గడపనీ తరువాత మళ్ళీ వచ్చి పిలుచుకొని వెళదాము అని చెప్పి బయటకు రాగా వర్షం పూర్తిగా నిలబడిపోయి ఉండటంతో , మొదట కుటీరం లో కలిసిన ముసలాయనను కలిసి డబ్బు ఇవ్వబోగా , ఇక్కడ డబ్బుకు స్థానం లేదు బాబు అని తిరస్కరించగా , మా నాన్న గారిని జాగ్రత్తగా చూసుకోండి అని మరి మరీ చెబుతుండగా , చూడు బాబు ఇక్కడ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని చూడము , అందరిని సమానంగా చూస్తూ వారి వారి సంతోషాన్ని వారు వెతుక్కుంటారు అని చెప్పగా ధన్యవాదాలు తెలిపి బయటకు వచ్చి మా బట్టలు వేసుకొని మొబైల్స్ తీసుకొని చూడగా కృష్ణ మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది.

సమయం రాత్రి 10 గంటలు అవుతుండగా డ్రైవర్ వైపుకు తిరిగి ఇప్పుడే వెళ్దామా , ఉదయం వెళదామా అని అడుగగా , ఎలాగోలా నెమ్మదిగా వెళ్లిపోదామని చెప్పగా , డ్రైవ్ చెయ్యగలవా అని అడుగగా , ఇలాంటివి ఎన్నో చూసాను సాబ్ వెళ్లిపోదాము అని చెప్పగా , బయట గుర్రపు బండిలోనే నిద్రపోతున్న వ్యక్తిని లేపి వెన్నెల వెలుగులో గంటలో క్యాబ్ వద్దకు చేరుకొని , క్యాబ్ లో నెమ్మదిగా భయలుదేరసాగాము.

డ్రైవర్ కు చార్జర్ ఉందా అని అడుగగా ఉంది అని wire ఇవ్వగా ముందుకు వెళ్లి కూర్చొని అక్కడే నా మొబైల్ ఛార్జింగ్ పెట్టి 5 నిమిషాల తరువాత on చెయ్యగా సిగ్నల్ తగలకపోవడంతో అలాగే పక్కన పెట్టేసి జాగ్రత్తగా రోడ్ చూస్తూ అడవిలో ఏదైనా అడ్డు వచ్చినప్పుడు డ్రైవర్ ను హెచ్చరించసాగాను. రెండు గంటలలో హైవే చేరుకోగా…..

1 Comment

Comments are closed.