ఉదయం లేవగానే అందరికంటే ముందే ఆఫీస్ చేరుకోవాలి అక్కడ విజయ్ పర్సనల్ రూమ్ వెతికితే ఎదైనా తన అనుమానాలు తీర్చే విషయాలు దొరకవచ్చు అని గురునాధం రెండు గంటల ముందే ఆఫీస్ చేరుకున్నాడు
ఆఫీస్ లో అందరికంటే ముందే చేరుకుని విజయ్ పర్సనల్ రూమ్ లో ఎంత వెతికినా ఎలాంటి అనుమానపు ఆధారాలు దొరకలేదు
చివరిగా సురేష్ రూమ్ లో వెతికితే ఎదైనా దొరుకుతాయి అని అనుమానంతో సురేష్ రూమ్ లో అంతా వెతకడం మొదలుపెట్టాడు గురునాధం
ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఎటువంటి ఆధారాలు దొరకకుండా జాగ్రత్తగా ఉన్నాడు సురేష్ కూడా గురునాధనికి అసహనం మొదలైంది
వీళ్ళు ఇద్దరు ఎదో తప్పుడు వ్యాపారాలు చేస్తున్నారు అని నా మనసు అనుమానం పడుతుంది కానీ ఎలాంటి ఆధారాలు దొరకకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎలా ఎలా అని గురునాధం చాలా సేపు వెతికాడు కానీ లాభం లేదు
అంతలో తలుక్కున తన భార్య అన్న ఒక మాట గుర్తుకు వచ్చింది
మంచి అంతటా వెతుకు చెడు డస్ట్ బిన్ లో వెతకాలి అని వెంటనే గురునాధం సురేష్ డస్ట్ బిన్ వెతకడం ప్రారంభించాడు
గురునాధనికి కొన్ని విషయాలు రుజువులతో సహా దొరకడం ప్రారంభించాయి
మొత్తానికి తోడుదొంగలు ఇద్దరు తాను అనుమానించినట్లే దొంగ వ్యాపారాలు మొదలెట్టి చాలా కాలం అయింది అని రుడి చేసుకున్నాడు
వెంటనే సురేష్ డస్ట్ బిన్ లోని చింపిన కాగితాలను ఒక కవర్ లో వేసుకుని విజయ్ రూమ్ లో ఉన్న డస్ట్ బిన్ లోని చింపిన కాగితాలను కూడా ఇంకో కవర్ లో వేసుకుని వచ్చి తన రూం లో కూర్చుని అంతా చూసుకుంటూ ఒక అంచనాకు వచ్చాడు
వీళ్ళు చేయని దొంగ వ్యాపారాలు లేవు ముఖ్యంగా
ఉగ్రవాదులతో కూడా సంబంధాలు కలిగి ఉన్నారు
అని గురునాధం అంచనా వేసాడు
ఈ రోజు ఎలాగైనా వీరి రహస్య స్థావరాలు ఎక్కడ ఉన్నాయో కనుక్కోవాలి అని అనుకున్నాడు గురునాధం ఆఫీస్ మొదలవగానే అంత మమూలుగా ప్రవర్తిస్తూ తన పని తాను చేసుకుంటూ ఇద్దరి మీద నీగ ఉంచాడు గురునాధం
అలా మధ్యాహ్నం భోజనానికి కూడా వెళ్లకూండా
ఎదురుచూస్తూ ఉన్నాడు మధ్యాహ్నం విజయ్ సురేష్ భోజనానికి వెళ్లాక మరోసారి వారి రూం లో వెతికి పర్సనల్ కంప్యూటర్ కూడా వెతికి మరికొంత సమాచారం సేకరించాడు
ఇక మిగిలింది ప్రత్యక్ష సాక్షులు సేకరించడం దాని కోసం ఎదురు చూస్తూ కూచున్నాడు
సాయంత్రం ఏడు గంటలకు ఇద్దరు కలిసి బయలు దేరాగనే తన బైక్ మీద వారిని ఫాలో అయ్యాడు
గురునాధం అనుకున్నట్లు గానే ఇద్దరు ఊరికి దూరంగా ఉన్న ఫ్యాక్టరీ గోడౌన్ వేపు వెళ్లారు
కారు ఫ్యాక్టరీ గేటు దాటి లోపలికి వెళ్లింది
గురునాధం మాత్రం కాస్త దూరంగా బైక్ ఆపి ఎలాగో గోడ దూకి లోపలికి చేరాడు
మెయిన్ గోడౌన్ కాకుండాగా ఇంకో వైపు ఉన్న గోడౌన్ వైపు ఉంది విజయ్ కారు సామాన్యంగా అది వాడుకలో లేదు అని అందరూ అనుకుంటున్నారు
కానీ విజయ్ సురేష్ తమ అక్రమ వ్యాపారాలకు అదికూడా రాత్రి వేళల్లో తమకు అనుకూలమైన ఒక ఇరువై మంది రౌడీలతో అక్కడ పని చేయించుకుంటున్నారు
ఇప్పుడు కూడా నిన్న తమకు చేరినా కొన్ని కేజీల మాదకద్రవ్యాలను చిన్న చిన్న ప్యాకేట్లుగా చేసి డిస్ట్రిబ్యూట్ చేయడానికి రెడీ చేస్తున్నారు
అలా రెడీ చేసినా మాదకద్రవ్యాలను తమ కంపెనీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ లో అన్ని రాష్ట్రాలకు చేరవేస్తారు
Super