ఆదిత్య కూడా ఎందుకు అనుమానం గా ఉంటది. 198

ఉదయం 10: 00 దాటినా ఇంకా లేవలేదా మహారాణి గారు అంటూ మనవరాలి గురించి అడుగుతుంది తులసమ్మ తన కోడలైన రుక్మిణి నీ
మీకు తెలియని అత్తయ్య దానికి కాపలా గా వాళ్ళ నాన్న అక్కడే కూర్చుని ఎవరినైనా దాని రూములోకి వెళ్ళానిస్తే కదా అని కాఫీ ఇస్తూ అంటుంది….
మీ ఆయన ఒకడు కొడుకుల మీద కస్సుబుస్సు అంటాడు కానీ కూతురుని ఏమో నెత్తిన ఎక్కించుకుంటాడు అని కొంచె గట్టిగానే అంటుంది తులసమ్మ…
అబ్బా నానమ్మ ఈ రోజు సండే కదా కొంచెం సేపు పడుకొనివ్వు దాన్ని ఏమౌతుంది అంటూ హాల్ లోకి వస్తారు చందు పృద్వి…. మీరు మాట్లాడకండి రా వెధవల్లారా మీరందరూ ఇలానే వెనకేసుకుని వస్తారు కాబట్టి అది ఇలా తయారయింది. అది తన అంటే మీరు తందానా అంటూ ఎగురుతారు అంటూ తిట్టే స్తుంది ఇద్దరం మనవల్లని.

ఏమైంది నాన్న అంత కోపంగా ఉన్నావ్ అంటాడు ఆదిత్య. ఏం లేదు అన్నయ్య మనవరాలిని పొద్దున్నుండి చూడలేదని అందరి మీద చిందులేస్తుంది నానమ్మ నవ్వుతాడు చందు.
ఓహో అదా టైం అవుతుంది కదా లేస్తుంది లే అంటూ టిఫిన్ చేసి ఆఫీస్ కి వెళ్తాడు ఆదిత్య. అప్పుడే కిందికి వస్తున్నా చెల్లి ని చూసి బయటకు వెళ్ళకు, అల్లరి చేయకు, కాసేపు చదువుకో, టీవీ ఎక్కువ చూడకు అని చెప్పి , బయట ఏమైనా గొడవలు చేశావో ఈసారి చెల్లి అని కూడా చూడకుండా జైల్లో పెట్టిస్తా అంటూ బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు..

ఆదిత్య అలా వెళ్లగానే చూడు నాన్న అన్న ఎంత పెద్ద లిస్ట్ చెప్పాడో. నన్ను జైల్లో పెట్టేస్తాడు అంట అని కంప్లైంట్ ఇస్తున్నట్టు చెప్తుంది మాధవరావు కి పక్కనే కూర్చొని. పోనీలే అమ్మ సాయంత్రం వస్తాడు కదా అప్పుడు వాడికి మనమే పనిష్మెంట్ ఇద్దాము అంటూ మనవరాలికి వత్తాసు పలుకుతారు కృష్ణారావు. లవ్ యు తాతయ్య లవ్ యు నాన్నా అంటూ గారాలు పోతోంది మన హీరోయిన్ శైలు (శైలజ)

బాగుందండి ఇంట్లో అందరూ దాని వైపే చేరి దానికి ఏం పని రాకుండా చేస్తున్నారు అంటుంది తులసమ్మ. పోనీలే చిన్న పిల్ల అంటూ సర్ది చెప్తాడు కృష్ణారావు.

ఐ లైక్ యు నానమ్మ అంటూ నానమ్మ దగ్గరికి చేరి అల్లరి చేస్తూ కోపాన్ని మరిపించేస్తుంది శైలు (మన హీరోయిన్) మనవరాలు లను చూసి మురిసిపోతుంది తులసమ్మ…..

ఇంతలో రుక్మిణి గారు వచ్చి శైలు ఈ కాఫీ తాగి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రాపో మారు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతుంది. శైలు కాఫీ తాగుతూ బయటకు వచ్చి అక్కడే పని చేసే రంగయ్యాతో ఏదో కాసేపు బాతాకాని పెడుతుంది.
వాళ్ళ అమ్మ ఈసారి అరవడంతో లోపలికి పరుగులు పెడుతోంది. మేడంగారు ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి వాళ్ల ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం….

కృష్ణా రావు తులసమ్మ గారికి ఇద్దరు అబ్బాయిలు
మాధవరావు వారి భార్య రుక్మిని
మధుసూదన్రావు వారి భార్య రాధిక