జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 16 51

ఉదయం 6 గంటలకు ఫ్లైట్ కాశీ లో ల్యాండ్ అవ్వగా , బయటకు రాగా krishna and mahesh అని బోర్డ్ పట్టుకొని మాకోసం ఎదురుచూస్తున్న ఒక వ్యక్తి దగ్గరకు వెళ్లి వచ్చిరాని హిందీతో మేమే అని చెప్పగా , సాబ్ అని చేతులు కలిపి , తన క్యాబ్ వరకు తీసుకువెల్లగా ముందుగా ఫ్రెష్ అవ్వడానికి హోటల్ కు తీసుకునివెళ్ళమని చెప్పగా 10 నిమిషాల్లో పక్కనే ఉన్న హోటల్ లో డ్రాప్ చెయ్యగా డ్రైవర్ నెంబర్ తీసుకొని , ఒక రూమ్ తీసుకొని ఛార్జింగ్ పెడదామని బ్యాగ్ మొత్తం వెతకగా ఛార్జింగ్ wire పెట్టలేదని గుర్తుకు వచ్చి , బయట కొందామనుకొని ఇద్దరు 7 లోపల రెడి అయ్యి కృష్ణ మొబైల్ లో నుండి అమ్మకు కాల్ చెయ్యగా , మిబైల్ ఇంటిలోనే ఉండటం వలన ఎత్తకపోవడంతో ఇంకా నిద్రపోతున్నారేమో ఆనుకొని తరువాత కాల్ చేద్దామనుకొని డ్రైవర్ కు కాల్ చేసి అతడితో పాటు హోటల్ లోనే తినేసి కృష్ణ మొబైల్ లో ఉన్న ఆశ్రమం అడ్రస్ చూపించగా , సాబ్ ఆ ఆశ్రమానికి ప్రయాణం చాలా కష్టం , రోడ్ సరిగ్గా ఉండదు అడవిలోపలికి చాలా దూరం వెళ్ళాలి క్షమించండి నా వల్ల కుదరదు అని ఏమాత్రం ఆలోచించకుండా చెప్పెయ్యగా ,ఇతడే రాలేదంటే మరెవరూ రారని గ్రహించి అర్జెంట్ గా వెళ్ళాలి , అమౌంట్ డబల్ ఇస్తామని చెప్పగా ఆలోచించి, రోడ్ మొత్తం గుంతలు గుంతలు ముళ్ళతో ఉంటుంది కావున నెమ్మదిగా నడపవలసివస్తుంది , ప్రయాణానికి సమయం ఎక్కువ పడుతుంది మరియు ఆశ్రమం వరకు క్యాబ్ లో వెళ్లలేము , చాలా కష్ట ప్రయాణం అని చెబుతూ మీరే చూస్తారుగా అని చెప్పగా సరే అని క్యాబ్ లో భయలుదేరసాగాము.

ఉదయమే ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వలన ప్రయాణం మందకొడిగా సాగుతుండగా , అంత ఉదయమే షాప్స్ కూడా తెరవకపోవడంతో ఆశ్రమం లో రిక్వెస్ట్ చేసి ఛార్జింగ్ పెట్టుకోవచ్చులే అనుకోని 8 గంటల కల్లా సిటీ దాటడంతో హైవే లో క్యాబ్ ప్రయాణం సాగుతోంది. ఒక రెండు గంటల సాఫీ ప్రయాణం తరువాత మట్టి రోడ్ లో నెమ్మదిగా మరొక రెండు గంటల ప్రయాణం చెయ్యగా , సాబ్ ఇప్పటి నుండి అడవిలో ప్రయాణం కాస్త కష్టంగా ఉంది జాగ్రత్త అని చెప్పగా , క్యాబ్ మాత్రమే పెట్టె చిన్న దారిలో గతుకుల రోడ్డు మరియు ముళ్ళకంపలు దారి మధ్య వరకు పెరిగి ప్రయాణానికి అడ్డు అడ్డుగా వస్తూ ఒక అర గంట ప్రయాణం తరువాత కారు ఎంత తొక్కినా నెమ్మదిగామే వెళ్తుండగా, దారి మధ్యలోనే కారును ఆపి డ్రైవర్ కిందకు దిగి భయ్యా టైర్ పంక్చర్ అన్న ఒక చేదు వార్తను చెప్పి స్టెప్నీ ఉందన్న మంచి వార్తను చెప్పగా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని , ఇద్దరమూ డ్రైవర్ కు హెల్ప్ చెయ్యగా కొద్దిసేపట్లో టైర్ మార్చేసి నెమ్మదిగా కొన్ని గంటలు ప్రయాణం మొదలుపెట్టసాగాము.

సుమారు మధ్యాహ్నం 2 గంటల సమయానికి ఒక చిన్న గూడెం కు చేరుకోగా, తూర్పు వైపుకు ఒక పురాతనమైన ద్వారం చెట్టు వేర్లతో చుట్టుకొనిపోయి ఉండగా దానికి ఇవతలే కారును ఆపి , ఆ ద్వారం లోపలికి ఏ వాహనాలు వెళ్ళావు సాబ్ , ఇక్కడినుండి గుర్రపు బండిలో వెళ్లాల్సిందే , ఇక్కడ పూరి గుడిసెలో డబ్బు ఇస్తే అర గంటలో భోజనం తయారుచేస్తారు అని చెప్పగా, ప్రయాణం లో అలసిపోవటం వల్ల ఆకలి కూడా వేస్తుండటం వల్ల డ్రైవర్ తో పాటు వెళ్లి ముగ్గురికోసం డబ్బు ఇచ్చి ,ద్వారం దగ్గరికి వచ్చి డ్రైవర్ తోఇక్కడి పరిస్థితుల గురించి మొత్తం తెలిసినవారిలా ఉన్నారే , ముందు చాలా సార్లు వచ్చినట్లు ఉన్నారు అని అడుగగా , నహి సాబ్ ఇప్పటివరకు ఒక్కసారే ఇక్కడకు వచ్చాను , మన సిటీ కి ఇక్కడికి చాలా తేడా గనుక అలాగే గుర్తుండిపోయింది.

ఇంకా ఎంత దూరం ఉంది , ఇంతకు ఎందుకు ఈ ద్వారం నుండి వాహనాలు వెళ్లకూడదు అని ప్రశ్నించగా , నాకు గుర్తుండి ఇంకొంత దూరమే , వాహనాలే కాదు ఆశ్రమం మెయిన్ ప్రవేశం దగ్గర నుండి ఎలాంటి ఎలెక్ట్రానిక్ వస్తువులను కూడా లోపలికి అనుమతి ఇవ్వరు. మన దగ్గర ఉన్న మొత్తం స్విచ్ ఆఫ్ చేసి అక్కడే ఇచ్చేయ్యాలి మరల బయటకు వచ్చాక ఇస్తారు అని చెప్పగా , ఒకసారి అమ్మకు కాల్ చెయ్యాలి అనుకోని కృష్ణ గాడి మొబైల్ తీసుకోగా టవర్ కూడా లేకపోవడంతో , సాబ్ ఇదంతా అడవి సిగ్నల్ ఉండదు అని చెబుతుండగా , ఒక ముసలామే భోజనం రెడి అని పిలువగా అడవిలో దొరికిన వాటితో రుచికరంగా వండగా తృప్తిగా తినేసి ఆ అవ్వకు ఇంకొంత డబ్బు ఇచ్చి అవ్వ భోజనం బాగుంది అని చెప్పగా , క్యాబ్ ను డ్రైవర్ ఒక పక్కగా పార్క్ చేసి మాతోపాటు గుర్రపు బండిలో రాసాగాడు.

దట్టమైన అడవి వెలుతురు కూడా నేలను తాకకుండా ఆకులు దట్టంగా కమ్ముకుని ఉండగా ఆశ్రమం ప్రవేశ ద్వారం చేరుకునేసరికి 4 గంటలు అవ్వగా మేఘాలు దట్టంగా కమ్ముకుని పెద్ద వర్షం పడే సూచనలు కనిపిస్తుండగా , బండి దిగి డబ్బు ఇచ్చేసి లోపలికి వెళుతుండగా మమ్మల్ని పూర్తిగా చెక్ చేసి ముగ్గురికి మూడు జతల తెల్లని బట్టలు ఇచ్చి పక్కనే ఉన్న రూమ్ లో మార్చుకొని రమ్మని చెప్పగా , 10 నిమిషాలలో మార్చుకొని రాగా మా దగ్గర ఉన్నవన్నీ స్విచ్ ఆఫ్ చేసి డబ్బుతో సహా తీసుకొని బ్యాగులో పెట్టి బీరువాలో పెట్టి తాళం వేసి మాకే తాళం చెవి ఇచ్చేసారు. తెల్లటి బట్టలు వేసుకున్న ఒక వ్యక్తి మా దగ్గరికి వచ్చి మీరు మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చే వరకు నేను మీ వెంటే ఉంటాను అని లోపలికి పిలుచుకొనివేళ్ళాడు.

1 Comment

Comments are closed.