జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 16 52

మొత్తం తెలుసుకుంటుండగా హాస్పిటల్ కు చేరుకోగా , నెమ్మదిగా లోపలికి పిలుచుకొని వెళ్లి కూర్చోబెట్టి డాక్టర్ అపోయింట్మెంట్ తీసుకొనగా కొద్దిసేపటి తరువాత లోపలికి పిలువగా , సౌమ్యను పిలుచుకొని వెళ్లగా కంటి చూపు గురించి రాము కి తెలిసినదంతా తెలుసుకొని ఒక ఫైల్ తీసుకొని వివరాలన్నీ రాసుకొని , పక్క రూమ్ లోకి పిలుచుకొని రమ్మనగా రాము నెమ్మదిగా పిలుచుకొని వెళ్లగా , వెనుక నేను లోపలికి వెళ్లగా , గంట పాటు కళ్లను పెద్ద పెద్ద పరికరాలతో చెక్ చేసి , చాలా సంవత్సరాలు అయినందువల్ల లోపల లిక్విడ్ రియాక్షన్ జరిగి కళ్ళు దెబ్బ తిన్నాయి , పెద్ద ఆపరేషన్ చెయ్యాలి చాలా డబ్బు అవుతుంది తప్పకుండా చూపు వస్తుంది అని చెప్పగా , చాలా థాంక్స్ డాక్టర్ ఎంత డబ్బు అయినా పర్లేదు , తనకి చూపు రావాలి అని చెప్పగా , చాలా సంవత్సరాలుగా కంటికి చికిత్స చెయ్యకుండా వదిలెయ్యడం వలన లోపల చిన్న చిన్న బ్లాక్ డాట్స్ ఏర్పడి , డస్ట్ మొత్తం లోపలే ఉండిపోయింది , కొన్ని టాబ్లెట్స్ మరియు కంటి లిక్విడ్ ఇస్తాను , అవి నెల రోజుల పాటు వాడండి అవి బయటకు వచ్చేస్తే మనం ఆపరేషన్ చెయ్యొచ్చు అని వివరించగా , చాలా చాలా థాంక్స్ డాక్టర్ అని బయటకు వచ్చి బిల్ పే చేసి , అక్కడే మందులు తీసుకొని డాక్టర్ తో ఎలా వాడాలో రాయించుకొని , రాము అక్కయ్యకు కచ్చితంగా చూపు వస్తుంది అని చెప్పగా ఇద్దరు ఆనందంగా కారు ఎక్కగా , కృష్ణ తో 5 నిమిషాలు అని చెప్పి ఎదురుగా ఉన్న ATM కు వెళ్లి అంకుల్ కు కాల్ చేసి అకౌంట్ నెంబర్ తెలుసుకొని ఒక 5 లక్షలు ట్రాన్స్ఫర్ చేసి , కొంత డబ్బు డ్రా చేసుకొని ,కారు దగ్గరకు వచ్చి రామును మొబైల్ షాప్ కు వెళ్లి తనకు నచ్చిన స్మార్ట్ మొబైల్ మరియు ఒక కీప్యాడ్ మొబైల్ కొని వాటికి సిమ్ లు కొని వేసి మిస్సెద్ కాల్ ఇచ్చుకొని సేవ్ చేసి , దివ్యక్క నెంబర్ కూడా సేవ్ చేసి స్మార్ట్ మిబైల్ రాముకు ఇచ్చి , కారులో ఇంటికి వెళుతూ సమయం 9 అవుతుండగా దారిలో అందరికి భోజనాలు పార్సెల్ తీసుకొని ఇంటికి చేరుకోగా , రాము సౌమ్యను నెమ్మదిగా లోపలికి పిలుచుకొని వెళ్లగా అప్పటికే దివ్యక్క ఆమెకు మొత్తం చెప్పినందువల్ల కృష్ణతో పాటు లోపలికి వెళ్లగా , ఆమె నా వైపు భావోద్వేగంతో కన్నీళ్లు కారుస్తూ ఆరాధనగా చూడసాగింది.

దివ్యక్క దగ్గరికి వెళ్లి లేట్ అవుతుందని అందరికి ఈ పూటకి భోజనాలు తెచ్చేసాను ఆకలిగా ఉంది అందరూ తినేద్దాము అని అంకుల్ తో పాటు అందరూ కూర్చొని తినేసి , అంకుల్ దగ్గరికి వెళ్లి మీ అకౌంట్ లో 5 లక్షలు వేసాను రేపు ఇంటికి కావాల్సిన అన్ని వస్తువులను తీసుకోండి అని చెప్పి , అమ్మకు ఉదయమే వెళతాము అని చెప్పాము , ఈ విషయాలన్నీ అమ్మకు తెలియనివ్వకండి , తెలిస్తే బాధపడుతుంది , దివ్యక్క ఫ్లైట్ సమయం అవుతోంది వెళ్ళొస్తాము అని చెప్పగా , అప్పటి వరకు ఆనందంగా ఉన్న రాము పెద్దక్క ముఖం ఒక్కసారిగా బాధగా అయ్యి రూమ్ లోకి వెళ్లిపోగా , ఆమెకు కూడా చెప్పి వెళ్దామని లోపలికి వెళ్లగా వెనక్కు తిరిగి ఉండగా , ఏమండీ అని భుజాలపై చేతులు వేసి నా వైపు తిప్పుకోగా కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తుండగా , ఎందుకో అర్థమయ్యి ఆమె కన్నీళ్లను తుడుస్తూ అర్జెంట్ పని ఉంది కచ్చితంగా వెళ్ళాలి రెండు రోజుల్లో వచ్చేస్తానుగా అని మిమ్మల్ని విడిచి వెళ్లడం నాకు కూడా ఇష్టం లేదు అయినా తప్పటం లేదు , పని అయిన మరుక్షణం మీ ముందు ఉంటాను అని నా రెండు చేతులను ఆమె చెంపలపై సున్నితంగా వేసి అదురుతున్న పెదాలతో ముద్దు పెట్టాలా వద్దా అని సంకోచిస్తుండగా , అమాంతం నా పెదవులపై ఘాడమైన ముద్దు పెట్టి , నేను మీ దాసీని నన్ను మీరు ఏమైనా చేసుకోవచ్చు అని ఉద్వేగంతో చెప్పగా , ఆనందిస్తూ ఏముంది నొప్పి తగ్గిందా అని ప్రేమగా అడుగగా , నా పేరు చెప్పనీలేదు కదూ అని తన నుదుటిపై చిన్నగా కొట్టుకొని నా కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ నా పేరు ఇందుమతి అని తియ్యగా చెప్పి నా గుండెలపై ప్రేమగా వాలిపోయి నన్ను గట్టిగా కౌగిలించుకొని , ఆ పేరు వినగానే శరీరం మొత్తం పులకించిపోతూ , హృదయ చప్పుడు అమ్మ పేరు తియ్యగా పలికినట్లుగా అనిపిస్తుండగా , అందుకేనేమో ఈమె చేతి స్పర్శే నన్ను అణువణువు పులకింపచేసి నేను చేసిన తప్పును తెలియజేసింది అని నా గుండెలపై వాలిపోయిన ఆమెను అమితమైన ప్రేమతో ముద్దులుపెడుతూ చేతితో సున్నితంగా నిమురుతూ లవ్ యు అమ్మ అని చిన్నగా అమ్మను తలుచుకున్నాను.

1 Comment

Comments are closed.