జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 16 50

ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది మన బ్యాంకులకే గర్వకారణంగా నిలిచే ఒక గొప్ప మనిషి గురించి , నేను చెప్పడం కంటే మీరు AV ద్వారా చూస్తే వారి గురించి అందరికి అర్థమవుతుంది అని , ప్లీస్ ప్లే the AV on the screen అని గట్టిగా గర్వంగా చెప్పగా , అందరూ నిశ్శబ్దన్గా అయిపోయి స్క్రీన్ వైపు ఆతృతగా చూడసాగారు. అమ్మ వాళ్ళ గ్రూప్ అంతా తీవ్ర నిస్పృహలో ఏవిధమైన ఫీలింగ్స్ బయటపెట్టక కుర్చీలలో వెనక్కు వాలిపోయి ఎవరి గురించో అని స్క్రీన్ వైపు చూడసాగారు. పక్కన స్పీకర్ ల లో నుండి సౌండ్ వస్తూ స్క్రీన్ పై ఇండియా మ్యాప్ కనబడుతూ వేగంగా zoom అవుతూ గోవా రాష్ట్రం దగ్గర నుండి నెమ్మదిగా జూమ్ అవుతూ , ఒక్కసారిగా గోవా సిటీ లోని బ్యాంకుల భవనాలన్ని చూపెడుతూ అమ్మ పని చేసే బ్యాంక్ దగ్గర వీడియో ఫోకస్ చేస్తుండగా అమ్మ పక్కన కూర్చున్నవాళ్ళంతా అమ్మ వైపే ఆశ్చర్యంగా చూస్తుండగా అమ్మ అంత కంటే ఎక్కువ ఆశ్చర్యపోతూ కనురెప్ప వేయకుండా స్క్రీన్ వైపే చూడసాగింది.

వీడియో లో బ్యాంక్ లోపల మొత్తం చూపిస్తూ స్పీకర్ లో నుండి , కొన్ని రోజుల క్రితం గోవా సిటీ లోని అన్ని బ్యాంకులలో వేళా కోట్ల రూపాయల డబ్బును ఋణంగా ఒక వ్యక్తి మారు పేర్లతో మోసం చేసి , ఫేక్ డాకుమెంట్స్ బ్యాంకులలో చూపించి తీసుకొని ఒక నెల కూడా రుణం కట్టకుండా ఎగ్గొట్టడం వల్ల బ్యాంకులలో డబ్బులు లేక , ATM లలో డబ్బు పెట్టక సిటీ ప్రజలు మరియు చుట్టూ ఉన్న గ్రామాలు , పట్టణాలు చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో , అన్ని బ్యాంకుల చైర్మన్ లు ఏమి చెయ్యాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఇదే బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్న ఒక మహిళ ఎవ్వరి సహాయం లేకున్నా ,గోవా లోనే అత్యంత క్రూరుడు , కిరాతకమైన రౌడి నుండి ప్రాణాలకు తెగించి సుమారు 30 వేల కోట్లకు పైగా అన్ని బ్యాంకులకు కట్టవలసిన మొండి బకాయిలను ప్రతి రూపాయితో సహా జమ చేయించేలా చేసి , అతడి వల్ల ఇక ఏ ఒక్కరు కష్టపడకుండా అతడిని కటకటాలు లెక్కించేలా చేసి , గోవా ప్రజలు ప్రశాంతంగా జీవించేలా చేసి, అది మాత్రమే కాకుండా తనకు లభించిన 10 శాతం డబ్బును గోవా లోని అనాధ శరణాలయం , వృద్ధాశ్రమం మరియు అంధుల ఆశ్రమానికి కోట్ల రూపాయల డబ్బును ఇస్తూ , తన జీతం లోని సగం డబ్బును కూడా వారికే ఇస్తూ , బ్యాంకు ఉద్యోగులు ప్రజల సేవే కాకుండా సమాజ సేవ కూడా చేస్తున్నారని ప్రతి ఒక్కరికి తెలియజేసేలా చేస్తున్న , వీడియోలో ఆశ్రమం పెద్దలు మరియు అంధ పిల్లలు అమ్మ రాక ముందు వారి కష్టాలను , ధీన స్థితిని వివరిస్తూ, అమ్మ గురించి మరియు అమ్మ వాళ్లకు చేసిన సహాయాన్ని ఉద్వేగంతో చెబుతూ , చిన్న పిల్లలు అమ్మ పేరును సంతోషంగా గట్టిగా అరుస్తూ తమ కృతజ్ఞతలు తెలుపుతుండగా , ఇక్కడ ఆ వీడియో ను చూస్తున్న వాళ్లు అంతా కళ్ళల్లో నీళ్లు తిరిగి భావోద్వేగంతో చూస్తూ ఆమె ఎవరా అని ఎదురుచూస్తున్నారు.

అప్పటివరకు ఏదో తమ పేపర్ లకు మరియు న్యూస్ కోసం వచ్చిన రిపోర్టర్స్ ,వెంటనే తమ తమ చానెల్స్ కు కాల్స్ చేసి ఒక గ్రేట్ న్యూస్ , ఇండియా లోని ప్రతి ఒక్కరు చూడాల్సిన న్యూస్ సర్ వెంటనే లైవ్ కనెక్ట్ చెయ్యండి అని చెప్పి బయట ఉన్న న్యూస్ వాహనాలు అలెర్ట్ అయిపోయి లైవ్ ప్రసారాలను మొదలెట్టేసారు. అప్పటికే అమ్మకు , అమ్మతో పాటు వచ్చిన మిగతా వాళ్లకు అది ఎవరో తెలిసిపోయి ఉండటంతో మేడం , మేడం అని సంతోషంగా గర్వపడుతుండగా , అమ్మకు వీడియో వైపే కళ్ళార్పకుండా భావోద్వేగంతో చూస్తుండగా ,మైకులో ఆ ఉద్యోగి ఎవరో తెలుసుకోవాలని ఉందా అని అడుగగా , అందరూ ఒక్కసారిగా పైకి లేచి గట్టిగా yes yes …….అని అరుస్తుండగా , మీతో పాటు నాకు కూడా ఆ గ్రేట్ పర్సన్ గురించి తెలుసుకోవాలని ఉంది అని ,ఆమె పేరు ఇందు ప్రియ అని చెబుతూ, అమ్మ లక్షణంగా చీర కట్టుకొని బ్యాంకులోకి ప్రవేశిస్తున్న వీడియో మరియు ఆశ్రమం వాళ్ళను ప్రేమగా పలకరిస్తున్న మరియు పిల్లలను అయ్యాయంగా ఎత్తుకొని ముద్దాడుతున్న వీడియో లు ప్లే అవుతుండగా అందులో అక్కడక్కడ నేను కనిపించడంతో అమ్మ కళ్లల్లో ఒక్కసారిగా తనకు తెలియకుండానే , బాధ తోనో , లేక ఆనందం తోనో అర్థం కానట్లుగా కన్నీళ్లు కారసాగాయి.

అందరూ సీట్ లపై ఎక్కి మరీ ఎగిరెగిరి , తొంగి తొంగి చూస్తుండగా , మైకులో దయ చేసి ముందున్న వాళ్ళు కూర్చోవలసిందిగా కొడుతుండగా అందరూ కూర్చొని కళ్ళార్పకుండా చూడసాగారు. అతిథులుగా వచ్చిన ఫైనాన్స్ మినిస్టర్ మరియు RBI గవర్నర్ కూర్చున్న వాళ్ళు లేచి స్క్రీన్ కు ఎదురుగా వచ్చి చూస్తుండటంతో అది చూసిన అమ్మ ఆనందంతో పరవశించిపోతోంది. కొన్ని నిమిషాల తరువాత thank you అని పడి వీడియో అయిపోవడంతో అందరూ ఏదో సూపర్ బంపర్ హిట్ సినిమా స్క్రీన్ పై ఆగిపోతే ఎలా నిట్టూరుస్తూ నిరుత్సాహపడతారో , అదేవిధంగా ఇంకా అమ్మ చేసిన మంచి పనులు చూడటానికి ఇష్టపడుతున్నట్లుగా నిరుత్సాహంగా మౌనంగా ఉండిపోయారు.

మైకులో ఇంకా ఆ గ్రేట్ పర్సన్ గురించి తెలుసుకోవాలంటే చాలా ఉంది కాని మనకు ఉన్న సమయాభావం వల్ల ముగించాము అని చెబుతూ, ఇప్పుడు ఈ సంవత్సరానికి గాను బెస్ట్ employee అవార్డును ప్రకటించవలసిందిగా RBI గవర్నర్ ను గౌరవంగా కోరగా , ఆయన పైకి లేచి తన ముందు ఉన్న కవర్ ను అందుకొని ఓపెన్ చేస్తుండగా , అందరూ పైకి లేచి ముక్త కంఠంతో ఇందుప్రియ గారు, ఇందుప్రియ గారు ……..అని అమ్మ పేరును గట్టిగా హాల్ మారుమ్రోగేలా అరుస్తుండగా , గవర్నర్ మైకు అందుకొని నేను కూడా అదే కోరుకుంటున్నాను అని గర్వపడుతూ చెబుతూ ఉండగా , స్క్రీన్ పై కవర్ తెరుస్తున్న దృశ్యాలు ప్లే అవుతుండగా , నెమ్మదిగా తెరిచి చూసి నవ్వుతూ అందరి వైపు తిప్పి చూపించగా miss INDUPRIYA అని ఉండటంతో అందరూ సంతోషంతో తమ చేతిలో ఉన్న పేపర్ లను పైకి ఎగరేస్తూ హాల్ దద్దరిల్లేలా అరవసాగారు.

1 Comment

Comments are closed.