జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 16 50

అది చూసి అమ్మ కన్నీళ్లు కారుస్తూ నన్నే తలుచుకుంటూ మొబైల్ లో ఉన్న ఫోటోను తన గుండెలపై హత్తుకొని విపరీతమైన భావోద్వెగంతో సంతోషంతో ఆనంద భాస్పాలు కారుస్తూ ఉండగా , గవర్నర్ చైర్మన్ గారి చెవిలో ఏదో చెప్పగా , బ్యాంకులకే కొత్త దారిని చూపించిన మిస్ ఇందుప్రియ గారిని best employee of the year గానే కాకుండా ఇండియా లోని అన్ని బ్యాంకుల ఆదరాభిమానాలు పొందినందుకు All India banks association తరుపున best employee of the decade గాను సత్కరించాలని గవర్నర్ గారు ప్రతిపాదించారని సగర్వాంగా ప్రకటిస్తున్నాను అని చెప్పగా , హాల్ మొత్తం చప్పట్లతో , కేకలతో దడ దడ లాడిపోయింది.

చైర్మన్ గారు మైకులో ఇప్పటివరకు మాటల ద్వారా మరియు వీడియో లలో చూసిన ఇందుప్రియ గారిని డైరెక్ట్ గా అందరూ కలుసుకోవాలని అనుకుంటున్నారా? అని చెప్పగా , అందరూ ఆశ్చర్యంగా చుట్టూ చూస్తూ , అమ్మ ఇక్కడే ఉన్నారా అన్నట్లుగా ముఖాలు పెట్టి yes yes yes అని హాల్ దద్దరిల్లిపోతుండగా , ఇందరి ఆదరాభిమానాలను చూరగొన్న ఇందుప్రియ గారిని సగర్వాంగా , సాదరంగా అందరి తరుపున ఆహ్వానిస్తూ స్టేజి పైకి రావాల్సిందిగా గౌరవంగా కోరగా ,అందరూ చప్పట్లు కొడుతూ తమ అభిమానాన్ని తెలియపరుస్తుండగా, అది విని చూస్తూ అమ్మ గుండె వేగంగా కొట్టుకుంటూ , కళ్ళార్పకుండా షాక్ లో ఉండిపోగా , పక్కన ఉన్నవాళ్ళంతా మేడం మేడం పిలుస్తున్నా కూడా పలకకపోవడంతో, మైకులో అమ్మను మళ్ళీ పిలుస్తుండగా , న్యూస్ ఛానల్ కెమెరాలన్ని అమ్మ ఎక్కడ ఎక్కడ అన్నట్లుగా అటు ఇటు తిప్పుతూ షూట్ చేస్తుండగా, చాలసేపటి వరకు అమ్మ లెవకపోవడంతో ముందు వరుసలో కూర్చున్న అమ్మ బ్యాంక్ చైర్మన్ , అమ్మ దగ్గరికి వచ్చి అమ్మను పలకరించగా , అమ్మ తన కాళ్ళను తుడుచుకుని కుర్చీలో నుండి పైకి లేవగా , అన్ని కెమెరాలు మరియు కూర్చున్న వారంతా అమ్మ వైపు గర్వపడుతూ చూస్తూ పైకి లేచి చప్పట్లు కొడుతూ స్టేజి పైకి ఆహ్వానించసాగారు.

అమ్మతో పాటు చైర్మన్ మరియు అమ్మతోపాటు వచ్చిన వాళ్ళు స్టేజి పైకి వెళ్లగా , కింద కూర్చున్న వాళ్లంతా 10 నిమిషాల పాటు లేచి ఆగకుండా చప్పట్లు కొడుతూనే ఉండగా అమ్మ అదంతా చూస్తూ థాంక్స్ బేబీ , థాంక్స్ బేబీ , లవ్ యు బేబీ అని మనసులో తలుచుకుంటూనే ఉంది. కొంతసేపటి తరువాత చైర్మన్ మైకులో ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫైనాన్స్ మినిస్టర్ గారిని అవార్డ్ బహుకరించవలసిందిగా కోరగా అందరూ దానిని చూడతానికన్నట్లు నిశ్శబ్దన్గా అయిపోగా , మినిస్టర్ గారు అమ్మ దగ్గరికి వచ్చి చేతికి శాలువా ఇచ్చి గౌరవిస్తూ , రెండు అవార్డులను బహుకరించి మైకు అందుకొని అమ్మను ఆకాశానికి పొగిడేయ్యగా చప్పట్లతో సభ మొత్తం దద్దరిల్లిపోయింది. చివరగా అమ్మను మాట్లాడవలసిందిగా కోరగా అమ్మ మాటలు వినడం కోసం హాల్ మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్ గా అయిపోగా, అమ్మ సంతోషిస్తూ మైకు దగ్గరకు వెళ్లి మొదట తన మనసులో నన్ను తలుచుకొని తరువాత అతిథులను గౌరవిస్తూ ప్రసంగం మొదలుపెట్టసాగింది.

ముందుగా చెప్పవలసినదిగా ఇది నా ఒక్కరి విజయం కాదు , దీని వెనుక నా కంటే మరో ముగ్గురు శ్రమే ఎక్కువ అని చెప్పగా , అందరూ ఎవరా అన్నట్లుగా అమ్మవైపే చూస్తుండగా , మొదటి వ్యక్తి ఆ మహేశ్వరుడు , అందరూ దేవుడు అనుకుంటుండగా తన మనసులో నా బేబీ అని నన్ను తలుచుకొనసాగింది. రెండవ వ్యక్తి అప్పటి గోవా old city SI ఇప్పుడు గోవా DSP గా కర్తవ్య బాధ్యతలు నిర్వహిస్తున్న sri విక్రమ్ గారు , మూడవ వ్యక్తి గోవా govt womens మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అని వివరించగా దేశం మొత్తం అన్ని న్యూస్ ఛానెల్స్ లో వారి పేరు వినిపించడం వల్ల అందరూ వారి గురించే చర్చించడం జరుగుతోంది.ఇక్కడ హాల్ లో విన్నవాళ్ళంతా మొత్తం క్రెడిట్ ను అమ్మ మాత్రమే తీసుకోకుండా సహాయం చేసిన వారితో కూడా పంచుకున్నందుకు , అమ్మ నిజాయితీని మెచ్చుకొంటున్నట్లుగా నిశ్శబ్దన్గా వింటున్న ఉద్యోగులంతా ఒక్కసారిగా లేచి నిలబడి అమ్మ పేరు హాల్ మొత్తం ధ్వనించేలా సాహో అంటూ కరతాళధ్వనులతో కొన్ని నిమిషాల వరకు మోతమోగించారు. ఆ స్పందనను చూసి విచ్చేసిన అతిథులు కూడా లేచి నిలబడి గట్టిగా చప్పట్లు కొట్టసాగారు.

1 Comment

Comments are closed.