ఫోన్ చేసి చిత్ర వస్తున్నా అన్న, అంత లో చిత్ర సార్ అని కంగారు గా టెన్షన్ లో మాట్లాడుతుంది. ఎంటి చిత్ర అంటే కావ్య అక్క రెండు రోజులు నుండి కనబడటం లేదంట, వల్ల హస్బెండ్, బాబు బాధ పడుతున్నారు స్టేషన్ లో కూడ సరిగ్గా సమాధానం చెప్పట్లేదంట, సరే నేను వస్తున్న వుండు అని కావ్య ఇంటికి వెళ్ళాను వల్ల హస్బెండ్ నీ కలిశాను రెండు రోజుల నుండి ఇంటికి రాలేదట ఫోన్ పనిచేయలేదు ఎక్కడ వున్న ఫోన్ బాబు కోసం చేస్తుంది నేను స్టేషన్ కి వెళ్తే ఎవరు సమాధానం చెప్పటం లేదు అని చిత్ర చెప్పినదే చెప్పారు, నేను వెంటనే ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశాను నాకు తెలీదు మధు నువు హోమేమినిస్టర్ ఇంటికి రా నేను కూడా అక్కడకు వస్తాను అని అడ్రస్ చెప్పారు, నేను చిత్ర నీ, కావ్య హస్బెండ్ and బాబు నీ తీసుకొని అక్కడ కి వెళ్ళాను, నేను వెళ్ళిన పది నిమిషాలకి ఎమ్మెల్యే గారు వచ్చారు, మేము ఎమ్మెల్యే గారితో కలిసి హోం.మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, మేము రాగానే రండి కూర్చోండి అని చెప్పారు అక్కడే ఎస్పీ గారు కూడా వున్నారు, ఎస్పీ గారు ఫస్ట్ మా తరపున క్షమాపణ చెబుతున్నాను అని ఆయన అన్నారు, అసలు ఏమి అయింది అని నేను అడిగాను, చెప్తాను మధు అని ఎస్పీ గారు మొదలు పెట్టారు,
నెల రోజుల నుండి సిటీ లో బాగా డబ్బు వున్న వారి నలుగురు పిల్లల్ని కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా చంపి ఎక్కడ పడితే అక్కడ పడేసరు, అలా నలుగురి కుర్రాళ్ళని చంపారు, చనిపోయింది ఎవరో కనుక్కోవడానికి మాకు ఒక్కొక్కరికి మూడు రోజులు పట్టింది, ఆ కేస్ నీ కావ్య కి ఫార్వర్డ్ చేశాను, చనిపోయిన పిల్లలు అంత కూడా మెడిసిన్ చదివే వాళ్ళు, మరియు క్లోజ్ ఫ్రెండ్స్, మోటివ్ పర్సనల్ ప్రాబ్లెమ్ వల్ల అని అర్దం అవుతుంది, ఎవరు చంపుతున్నారు ఎందుకు చంపుతున్నారు మాకు తెలియ లేదు, కావ్య investigation చేస్తుండగా ఇంకొకరిని కిడ్నాప్ చేశారు, కావ్య ముందుగానే రాహుల్ నీ కిడ్నాప్ చేస్తారు అని గ్రహించి రాహుల్ నీ అడిగింది మీరు ఏమి అయిన చేశారా, ఏమైనా వుంటే నాకు చెప్పండి నేను మిమ్మలని సేవ్ చేస్తాను అని చెప్పింది, దానికి రాహుల్ మేము ఏమి చెయ్యలేదు అసలు మేము చదువు తప్ప ఇంకేం పట్టించుకోం, కావాలంటే కాలేజ్ లో అడగండి మేము అయిదుగురు ము మంచి ఫ్రెండ్స్, అని చెప్పాడు, కావ్య వెళ్లి వల్ల గురుంచి ఎంక్వైరీ చేస్తే చాలా మంచి వాళ్ళు అని చెప్పారు, కావ్య investigation చేస్తుండగా ఇప్పుడు వాడిని కిడ్నాప్ చెయ్యటం తో, కావ్య టీమ్ తేలికగా ట్రేస్ చేసి రాహుల్ నీ కాపాడారు కానీ ఇప్పుడు కావ్య టీమ్ కిడ్నాపర్ల చేతిలో వున్నారు, కావ్య కిడ్నాప్ అయిన రాహుల్ నీ కాపాడి ఎక్కడ దాచి పెట్టారో కూడా తెలీదు, వాళ్ళు అసలు ఎలా వున్నారో కూడా తెలియదు,
మరి వల్ల దగ్గర నుండి ఫోన్ ఏమీ రాలేదా అని అడిగాను, లేదు ఇంకా, కావ్య టీమ్ వాళ్ల మొబైల్ సిగ్నల్స్ ట్రేస్ చేసి మావాళ్ళు వెళ్ళారు అక్కడ మొబైల్స్ వున్నాయి కాని వాళ్ళు లేరు, ఏదో ఒకటి చెయ్యండి సార్ అర్జంట్ గా పాపం బాబు ఏడుస్తున్నాడు,వాళ్ల హస్బెండ్ కూడా బాగా బాధ పడుతున్నారు, లేదా మీకు చేతకాక పోతే చెప్పండి నేను చూసుకుంటాను అని కోపం లో అన్నాను, ఇంతలో హోమ్ మినిస్టర్ గారు, మధు ప్లీజ్ అర్డంచేసు కొండి వాళ్ళు అంత మా ఫ్యామిలీ, నాకు కూడా మీ బాధ అర్దం అయ్యింది కొంచం మా గురుంచి కూడా ఆలోచించండి, నికో ఇంకో విషయం చెప్పనా వాడు ఇప్పుడు కిడ్నాప్ చేసింది నా కొడుకుని అయిన కూడా నేను ధైర్యం గా వున్నాను , మీరు కూడా దైర్యం గా వుండండి, కావ్య మీద నాకు నమ్మకం వుంది మీరు కూడ నమ్మండి అని అన్నారు,
