నేను మీకు సహాయం చేస్తాను! Part 8 1

నేను ఒక్కసారిగా దుకి హోం మినిస్టర్ గారిని పడిపోకుండా పట్టుకున్నాను, ఆయనకి ఏమీ కాలేదని చూసి అరే నిన్ను అని వెనక్కి తిరిగాను వాడిని అలానే చూస్తూ నిలబడ్డా, వాడి చేతిలో నుండి గన్ కింద పడి పోయింది, ఇప్పటిదాకా కోపం తో సింహం లాగా మీద పడినివాడు ఒక్కసారి గా వొంట్లో శక్తి లెనివడిల అయిపోయాడు, నెమ్మదిగా కళ్ళ నుండి నీరు కార్చుకుంటూ నా దగ్గరికి వచ్చి ఒక్కసారి గా కుల బడిపోయాడు, అన్నయ్య అని నా కాళ్ళు పట్టుకొని ఎప్పటి నుండి అపుకున్నాడో కన్నీళ్లు వరదలా పారుతూ, చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు, అరే విక్కి నువు ఏంట్రా ఇలా, అసలు ఎం జరుగుతుంది రా ఇక్కడ, తమ్ముడు చెల్లి ఏరి, మీరేనా వాళ్ళని చంపింది అని వాడిని పైకి లేపి నాకున్న కోపం తో వాడిని నాలుగు దెబ్బలు కొట్టి ఒక్కసారిగా వాటేసుకున్నాను,

ఎస్పీ గారు హోం మినిస్టర్ గారు ఆశ్చర్యం తో చూస్తున్నారు, మధు నికు వీళ్ళు తెలుసా వీళ్ళని నమ్మ వద్దు నా కొడుకుని కాపాడు అని హోం మినిస్టర్ గారు అన్నారు, సార్ వీడి గురుంచి నాకు బాగా తెలుసు వాళ్ళని చంపారు అంటే వీడి సైడ్ న్యాయం కచ్చితంగా వుంటుంది, వీడి గురుంచి నాకు బాగా తెలుసు, నేను కనుక్కొని చెప్తాను సార్, విక్కి అసలు ఏడుపు అపట్లెద్గు ఏదో బలమైన బాధ కలిగితే తప్ప వీడు అసలు ఇలా వుండడు,

నేను కాలేజ్ చదివే రోజుల్లో,
మా తాతయ్య బాగా పలుకు బడి వున్న వ్యక్తి నేను అంటే చుట్టూ పక్కల గ్రామాలలో అందరికీ తెలుసు, కాలేజ్ లో చాలా మంది అమ్మాయిలు నా వెంట పడుతున్న నేను వెంటపడే ది ఒకే అమ్మాయి నా ప్రియమైన శత్రువు, మరదలు వర్షా తో, కాలేజ్ లో ఎప్పుడు దానిని ఏడిపిస్తూ వుంటాను, మా ఇద్దరికీ అస్సలు పడదు నాకు అదంటే ఇష్టం అయిన దానికి మాత్రం కోపం నేను అంటే. ఆ రోజు దానికి ఒకడు ప్రపోజ్ చేసాడు నేను గమనిస్తూనే వున్నాను, అది వాడిని కొట్టిద్దేమో అనుకున్నాను,వాడితో నవ్వుతూ మాట్లాడుతుంది నాకు లోపల తగలబడెలా వుంది, చూస్తున్న కొద్దీ నాకు కోపం ఎక్కువ అయ్యింది నేను తట్టుకోలేక వెంటనే దాని దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని ఎంటే ఈ మధ్య పొగరు బాగా ఎక్కువైంది కాలేజ్ ల్.ఎవరితోనూ మాట్లాడవద్దు అన్ననా,బయం లేకుండా నా ముందే నవ్వుతూ మాట్లాడతా వా అన్నాను, నా ఇష్టం రా నువు చెప్పేది ఎంటి ఎవరితో అయినా మాట్లాడతా ఎం చేస్తావు రా అని మీద మీద కి వస్తుంది, ఎం చేస్తానా అని వర్ష పెదాలు నా పెదాలతో మూసేశాను, అంతే చుస్తున్నవారు ఎక్కడి కక్కడే ఆగిపోయారు, అందరూ నోళ్ళు తెరిచారు, దానికి నేను పెట్టిన ఫస్ట్ ముద్దు కాకపోయినా ఇంత మందిలో పెట్టే సరికి వర్ష కూడా షాక్ లో వుండి, నాకు లాగి పెట్టు ఒకటి ఇచ్చి అక్కడి నుండి పారిపోయింది, నేను కోపం లో దానికి ప్రపోజ్ చేసిన వాడిని కాలేజ్ మొత్తం పరిగెట్టిచ్చి కొట్టాను, అప్పుడప్పుడు మందు తాగటం నా అలవాటు, చిరాకు లో ఫ్రెండ్స్ తో కూర్చొని కొంచం ఎక్కువ తాగాను, ఇంకా అందరికీ బై చెప్పి బయలుదేరాను, దారి మధ్యలో ఎక్కడో పడిపోయాను, తెల్లవారుజామున మెళుకువ వచ్చి లేగిస్తే ఎక్కడో ఒక తెలియని ఇంట్లో వున్నాను ఎదురుగా నవుతు అందమైన మొహం తో చందమామ లా గా వుంది, ఆ మొహాన్ని చూస్తే ఎన్ని బాధలు వున్నా ఇట్టే మర్చిపోతాం అంత అందం గా వుంది, తనని చూస్తే నా చెల్లి స్వాతి గుర్తుకు వచ్చింది, నేను లేవటం చూసి అన్నయ్య లెచరా, కాఫీ టీ మిల్క్ ఎం తాగుతారు అని అడిగింది, నేను ఎక్కడ వున్నాను అని అడిగాను, మీకు రాత్రి బాగా ఎక్కువ అయింది మా ఇంటికి కొంచం దూరం లో పడిపోయి వున్నారు మేము బొంచేసి కొంచం సేపు వాకింగ్ చేద్దాం అని నడుచుకుంటూ అటు వైపు వెళ్తుండగా మిమ్మలని చూసాము, అప్పటికే మీరు బాగా నిద్ర లో వున్నారు చేతికి దెబ్బలు తగిలాయి ఫస్ట్ అయిడ్ చేశాను, నొప్పి ఏమైనా వుందా అని అడిగింది, థాంక్స్ అమ్మ నీ పేరు అడిగాను, అంత లో తను విక్కి, చక్రి అని పిలిచింది, వాళ్ళు వచ్చారు వాళ్ళు కూడా నన్ను చూసి బాగున్నారా అన్నయ్య దెబ్బ నొప్పి ఎం లేదు కదా అని అడిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *