నేను మీకు సహాయం చేస్తాను! Part 8 1

టిఫిన్ తిన్నాక కూర్చొని ఇంటిని గమనిస్తున్న ఇల్లు చాలా బాగుంది, ముగ్గురే వుంటున్నారు తల్లితండ్రులు ఎక్కడ వున్నారు అని ఆలోచనలో పడ్డాను, అప్పుడే విక్కి చక్రి వచ్చారు ప్రియ లోపల పని చేసుకుంటుంది, నేను విక్కి నీ అడిగాను మీ పేరెంట్స్ కనిపించటం లేదు అని, లేరు అన్నయ్య వాళ్ళు మేము చిన్నగా వున్నప్పుడే వాళ్ళు చనిపోయారు అని చెప్పాడు, అయ్యె సారీ విక్కి అని నేను అన్నాను, విక్కి బాధలో ఓకె అన్నయ్య అని అన్నాడు, చక్కగా చదువు కో వచ్చుగా విక్కి ప్రియ బాధ పడుతుంది కదా మీరు చక్కగా చదువుకొని మంచి పొజిషన్లో లో వుంటే ప్రియ హ్యాపీ గా ఫీల్ అవుతుంది, మీ భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది అని అంటే విక్కి నవ్వి ఆ చదువులు అంటే మాకు పడవు అన్నయ్య మా ప్రియ చదివితే చాలు మేము ఇలాగే బిందాస్ గా లైఫ్ నీ గడుపుతము అని విక్కి చెప్పి అన్నయ్య నేను తమ్ముడు అలా బయటకి వెళ్లి వస్తమూ, లంచ్ టైం కళ్ళ వస్తము ఈలోపు మా ప్రియ తో కబుర్లు చెప్పండి అని విక్కి అన్నాడు, విక్కి ఏదో దాస్తున్నడు, వీళ్ళ ముగ్గుర్నీ చూస్తుంటే నాకు ముచ్చట వేస్తుంది అన్నయ్య అని ప్రేమగా అన్నారు వీళ్ళ లైఫ్ నీ సెట్ చేసే బాధ్యత తీసుకోవాలి అని మనసులో అనుకున్నాను, ఇంతలో విక్కి నా బుజాలు పట్టుకొని అన్నయ్య అన్నాడు ఎం ఆలోచిస్తున్నావు అని నేను విక్కి మాటకి హా విక్కి అదేం లేదు ఇంకా నేను వెళతాను ఇంట్లో కూడ కంగారు పడుతారు అని అంటే ఇంతలో చక్రి ప్రియ కూడా వచ్చి అన్నయ్య ఈవెనింగ్ వెల్దురు కానీ ఇవ్వాలా సండే కదా మీకు కాలేజ్ లేదు మా ప్రియ కు కాలేజ్ లేదు ప్లీజ్ అన్నయ్య వుండండి అని చక్రి రిక్వెస్ట్ గా అడుగుతున్నడు, అవును అన్నయ్య మిమ్మలని చూస్తుంటే బాగా దగ్గరి వారిలా అనిపిస్తున్నారు అని విక్కి అన్నాడు, నాకు కూడా వీళ్ళని చూస్తుంటే వెళ్ళాలని లేదు ముఖ్యం గా ప్రియ నీ, ప్రియ కూడా వుండండి అన్నయ్య మీకోసం బిర్యానీ చేస్తాను అని రిక్వెస్ట్ చేస్తే ఇంకా సరే వుంటాను అని చెప్పను, ముగ్గురు సంతోషం తో గెంతులు వేస్తున్నారు, వాళ్ళని చూస్తుంటే ముచ్చటి వేస్తుంది,

సరే అన్నయ్య మేము బిర్యానీ అవ్వగానే మెక్కటనికి వచ్చేసాం బై అన్నయ్య అని చెప్పి ఇద్దరు వెళ్ళిపోయారు, ప్రియ నా దగ్గరికి వచ్చి అన్నయ్య ఏ బిర్యానీ కావాలి చెప్పు అన్నయ్య నా చేతి బిర్యానీ తింటే రోజు కావాలి అంటావు, అమ్మో అయితే వద్దులే రోజు మీ ఇంటికి ఎక్కడ రానూ అని అంటే ప్రియ నవ్వి నేను రోజు చెయ్యనగ అన్నయ అని అంది, హ్మ్మ్ అంటే నన్ను రోజు రావద్దు అంటావు అంతేగా అయ్యె అలా అనలేదు అన్నయ్య మీరు తిట్టుకున్నా సరే నేను వస్తాను కాలేజ్ కి వెళ్ళే రూటే కదా అని అన్నాను, ప్రియ సంతోషం గా థాంక్స్ అన్నయ్య అని చెప్పింది, అవును ఇంతకీ ఏమీ బిర్యానీ కావాలి అంది నేను ఆలోచించి వెజిటబుల్ బిర్యాని అన్నాను ప్రియ హ్యాపీ గా నాకు కూడా అదే తినాలని వుంది అన్నయ్య అంది, అవును ప్రియ ఇప్పుడు వీళ్ళు ఎక్కడకి వెళ్ళారు అంత అర్జంట్ గా అన్నాను, ఇంక ఎక్కడికి వూరు మీద పడి తిరగటానికి అన్నయ్య అని లోపలకి వెళ్ళింది, నేను ప్రియ వెనక వెళ్లి ఎందుకు ప్రియ వాళ్ళు అలా తయారయ్యారు ఏ బాధ్యత లేకుండా అన్నాను ఏమో అన్నయ్య అని ప్రియ అంది, ప్రియ సమాధానం కొంచం బాధ తో చెప్పింది ఈసారి, ప్రియ అల బాధ గా ఎందుకు సమాధానం చెబుతుందో నాకు అర్దం అవుతుంది, నేను నిజం తెలుసుకోవటానికి ప్రియ నీ చెప్పు ప్రియ నువు ఎందుకు ఇలా వున్నావు మంచిగా చదువు కుంటు వాళ్ళు ఎందుకు యాదవులు లా అయ్యారు అన్నాను, ఇంక ప్రియ కి ఓపిక నశించి అన్నయ్య ప్లీజ్ మా అన్నయ్య ల గురుంచి ఇంక మాట్లాడకండి అని అటువైపు తిరిగి ఏడుస్తుంది, చూడు ప్రియ మీ అన్నయ్యలు అలాంటి వారు కాదు అని నాకు అర్థమయ్యింది కానీ నీ చేత చెప్పించటానికే అలా అన్నాను, నన్ను కూడా మీ అన్నయల అనుకుంటే నాకు మీ గురుంచి చెప్పు లేకపోతే వద్దు అని అన్నాను. ప్రియ వెంటనే నన్ను గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తుంది.

మాది చాలా అందమైన కుటుంబం అన్నయ్య, అమ్మ నాన్న ఫస్ట్ నుండి బాగా డబ్బు వున్న వాళ్ళు, నేను పుట్టాకా ఆడపిల్లని అని బాగా గారాబం చేశారు, అన్నయ్య వాళ్ళకి నచ్చేది కాదు, నాకు ఊహ తెలియక ముందు ఎం జరిగిందో తెలీదు కానీ తెలిశాక అన్నయ్యలు ఇద్దరు నన్ను బాగా కోపం గా చూసే వారు అస్సలు దగ్గరికి తీసుకునే వాళ్ళు కాదు, నాకు ఏడుపు వచ్చిన అమ్మ నాన్న ప్రేమ ముందు అది చాలా చిన్న బాధ అనిపించింది, ఇద్దరు కూడా నాకే ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళు, నేను చిన్న పిల్లను పైగా ఆడపిల్లను అని నన్ను అల చూస్తున్నారు అని మా అన్నయ్యలు అనుకోలేదు, నన్ను శత్రువు నీ చూసినట్లు చూసే వాళ్ళు, నన్ను కొట్టే వాళ్ళు కూడా నేను ఎప్పుడు అన్నయ్య ల మీద చెప్పే దానిని కాదు, బయటకి కూడా ఎప్పుడు నన్నే తీసుకొని వెళ్ళే వాళ్ళు, నేను కూడా అమ్మని నాన్నని అస్సలు వదిలి వుండే దానిని కాదు, నాన్నగారు చాలా మంచి వారు అండ కోసం ఇంటికి వచ్చిన ప్రతి వారికి కాదనకుండా సహాయం చేసే వారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *