నేను వెంటనే ఎస్పీ గారి వైపు చూసాను అవును అని తల వూపాడు, నేను వెంటనే సారీ సర్ అని హోం మినిస్టర్ గారికి చెప్పాను, ఇట్స్ ఓకే మధు ఇప్పుడు మనం అవేశపడుతే వాళ్ళని దక్కించు కొలేము, రాక్షసులు లా వున్నారు, అతి క్రూరంగా గా చంపారు, మన వాళ్ళని కాపాడాలి, తర్వాత వాళ్ళని భూమి మీద లేకుండా చెయ్యాలి, అని నా బుజం మీద చెయ్యి వేసి అన్నారు, అసలు వీళ్ళని చంపవలసిన అవసరం వాళ్ళకి ఏమీ వుంది సార్, మీ అబ్బాయి ఎలాంటి వాడు అసలు అని నేను అడిగాను, మా వాడి పేరు రాహుల్, వాడు చిన్నప్పటి నుండి బాగా తెలివిగల వాడు, మా గారాబం కూడా ఎక్కువే కానీ ఎప్పుడు కూడా ఏ విషయం లో కూడా మమ్మలని ఇబ్బంది పెట్టే వాడు కాదు, బాగా చదువుతాడు ఫ్రెండ్స్ అంటే ప్రాణం, మేము అంటే ప్రేమ, మా మాటకి ఎదురు చెప్పే వాడు కాదు, అందుకే నాకు వాడి గురుంచి కటినంగా వుండాల్సిన అవసరం కూడా రాలేదు, వాడు ఎది అడిగిన కూడా నేను వెంటనే వాడి కళ్ళ ముందు వుండేలా చేసే వాడిని తండ్రి నీ కదా, వాళ్ల అమ్మకి వాడే లోకం వాడి గురుంచి కూడా వల్ల అమ్మకి తెలియదు ఫ్రెండ్స్ అందరూ ట్రిప్ కి వెళ్ళారు అని చెప్పాను, బయటకి దైర్యం గా వున్నాను కానీ ఒక తండ్రిలా కన్నీరు లోపల వరదయి పొంగుతుంది అని చాలా బాధ లో చెప్పారు, ఆయన చెప్తున్నప్పుడు ఆయన కళ్ళలో కొడుకు అంటే ఎంత ప్రేమో సృష్టం గా కనిపిస్తుంది, ఆయన కళ్ళు చెమ్మగిచ్చాయి, నాకు వల్ల మీద కోపం తారా స్థాయికి చేరింది, కావ్య గురుంచి ఆలోచిస్తేనే గుండె అదురుతోంది, ఒక్క అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను
ఇంతలో ఎస్పీ గారికి ఫోన్ వచ్చింది కొత్త నంబర్ నుండి ఆయన మా అందర్నీ కామ్ గా వుండమని చేతితో సైగ చేసి ఫోన్ లిఫ్ట్ చేశారు, ఎస్పీ గారు హలో అని నాలుగు సార్లు అన్నారు అటునుండి సమాధానం లేదు ఇంతలో ఎస్పీ గారు ఎవరు మాట్లాడేది అని అన్నారు, ఆప్పుడు అటువైపు నుండి గంభీరమైన కంటం తో ఎస్పీ బాగున్నావా నేను ఎవరో నికు తెలియదు కాదు నా పేరు విక్రమ్ నేను అనుకున్నది నిజమే అయితే ఇప్పుడు మీరు మా గురించే వెతుకుతున్నారు, హా హా హా నేను చెప్తే కానీ మీరు నన్ను కనుక్కో లేరు, ఒక పాప కష్టపడి నా దగ్గరకి వచ్చింది కానీ నా చేతి లో బలి అయిపోయింది, ఎస్పీ సైలెంట్ గా వింటున్నారు, వాడు అల అనగానే నాకు కోపం వచ్చి అరే ఎవడురా నువు ఏమీ తెలియని అమాయకుల ప్రాణం తియ్యటనికి నికు చేతులు.ఎలా వచ్చాయి రా అని కోపం గా అనగానే ఎస్పీ గారు హోం మినిస్టర్ గారు నా వైపు కోపం గా చూసి పక్కకి వెళ్ళమని చేతులు చూపించారు, ఇంతల్ ఎమ్మెల్యే గారు మధు డీల్ చేస్తాడు నాకు నమ్మకం వుంది అని వాళ్ళకి సైగ చేసి చెప్పారు, వాడు వెంటనే నువు ఎవడివి రా నా గురుంచి తెలియదు అనుకుంటా ఒకసారి నేను చంపిన వల్ల బాడీ లు చూసి మాట్లాడు అని అన్నాడు, నీ లాంటి వాడిని చాలా మందిని చూసాను రా నికు దమ్ము వుంటే నువు ఎక్కడ ఉన్నావో చెప్పు నేను ఒక్కడినే వస్తాను అప్పుడు చూపించు నీ క్రూరత్వం అని.అనగానే వాడు పెద్దగా నవ్వి బాగా ఉషారుగా వున్నావు నా చేతిలో మేక పిల్లలా బలి అవ్వటానికి , నేను ఎక్కడ వున్నాను తప్పకుండా చెప్తాను మీరు సంతోషం గా రండి ఇప్పుడు ఫోన్ ఎస్పీ గారికి ఇవ్వండి నేను ఆయనతో మాట్లాడాలి, నేను ఎస్పీ గారికి ఫోన్ ఇచ్చాను, చూడండి ఎస్పీ నాకు రాహుల్ కావాలి మీ టీమ్ నా చేతుల్లో వుంది, మీ ci అనుకుంటా ఒక దెబ్బకు సోయా లేకుండా పడుకుంది, నువు, హోం మినిస్టర్ , ఇందాక వాగడే వాడు మీరు రండి మీకు నేను అడ్రస్ మెసేజ్ చేస్తాను, మీరు వచ్చి ఆ రాహుల్ గాడు ఎక్కడ ఉన్నాడో దాని చేత చెప్పించలి లేకపోతే నా చేతిలో ఎన్ని ప్రాణాలు పోతాయో నాకు తెలీదు, మీకోసం ఎదురుచూస్తూ మీ విక్రమ్ అని ఫోన్ పెట్టేసాడు,
ఎస్పీ గారు ఎం చేద్దాం సార్ అని హోం మినిస్టర్ గారిని అడిగారు, నీ ఆలోచన ఎంటి అని ఆయన ఎస్పీ గారిని అడిగారు, ముందు మనం వెళదాం సార్ మనల్ని ట్రేస్ చేసుకొని మన వెనకాల టీమ్ వస్తారు అని ఎస్పీ గారు చెప్పారు, నేను కూడా అదే అనుకుంటున్నాను అని హోం మినిస్టర్ గారు అని నా వైపు చూశారు, సార్ వాడు మనల్నే రమ్మని చెప్పాడు మనం ఇల ఆలోచిస్తాం అని వాడు అనుకుంటాడు, అప్పుడు మనవల్లని ఏదో ఒకటి చేస్తారు, వాడి ప్లాన్ మిమ్మలని అడ్డు పెట్టుకొని మీ అబ్బాయిని పట్టు కోవటానికి, వాడు కూడా మనకి పూర్తిగా అడ్రస్ చెప్పలేదు అక్కడి కి వెళ్ళాక మనల్ని చెక్ చేసి మన దగ్గర ఏమీ లేకుండా వేరే చోటకి తీసుకు వెళ్తారు,
