నేను మీకు సహాయం చేస్తాను! Part 8 1

ఒకరోజు ఏదో ఫంక్షన్ వుంటే నన్ను తీసుకొని ఫంక్షన్ కి వెళ్తాను అన్నారు, వచ్చే టప్పటికి లేట్ అవుడ్డి అని రేపు అన్నయ్యలు కాలేజ్.కి వెళ్ళాలి అని వాళ్ళని వద్దు అన్నారు, మా ముగ్గురికీ అమ్మ తినిపించి, నన్ను రెఢీ చేసి అమ్మ రెఢీ అవ్వటానికి వెళ్ళింది, ఈలోపు నాన్న రెఢీ అయ్యి నా దగ్గరికి వచ్చారు ఇద్దరం అమ్మ కోసం ఎదురుచూస్తున్నాం, మా అమ్మ చీర కట్టుకొని పై నుంచి వస్తుంటే నేను నాన్న అలాగే చూస్తున్నాం, అమ్మ చాలా అందం గా వుంది, ఎందుకో అమ్మని అలానే చూడాలి అని వుంది కిందకీ రాగానే అమ్మ అని వాటేసుకొని మీద ఎక్కాను, అమ్మ కూడా బంగారం అని నన్ను ముద్దు పెట్టుకుంది, అంతే అది చూసి అన్నయ్యలు ఇద్దరు ఇంట్లో సామాన్లు అన్ని విసిరి కొడుతున్నారు, ఏమీ అయిందో మాకు అర్దం కాలేదు, నాన్న అమ్మ చెప్పిన వినకుండా అన్ని విసిరి కొడుతున్నారు లాభం లేదు అని నన్ను పక్కన పెట్టీ ఇద్దరు చేరి ఒకరిని కౌగిలిలోకి తీసుకున్నారు, వాళ్ళు అలా తీసుకోగానే ఇద్దరి వెక్కి విక్కి ఏడుస్తున్నారు, ఏమీ అయింది చెప్పండి నాన్న అని ప్రేమగా అడిగారు ఇద్దరు, విక్కి చెప్పటం మొదలు పెట్టాడు నాన్న మాకు చెల్లి పుడుతుంది అని తెలిసినప్పుడు మేము ఎంత ఆనందంగా ఎదురు చుసమూ మీకు తెలుసుగా, ఎప్పుడు ఎప్పుడు చెల్లి వచ్చిద్ద మేము చెల్లితో ఆడుకొవలి అని వుండేది, చెల్లిని ఎత్తుకొని తిరగాలి అని వుండేది, కానీ అది పుట్టకా మీరు మమ్మలని అసలు పట్టించుకోవటం మానేశారు, మీకు అది ఒక్కటే కూతురు అని దాన్నే చూస్తున్నారు, అసలు మా బాధ మీకు తెలీదు నాన్న, ఎప్పుడు దాన్నే బయటకి తీసుకు వెళ్తారు, మేము కూడా మీ కొడుకుల మే నాన్న, అమ్మ నన్ను వొళ్ళో పడుకోపెట్టుకుని ఎన్నాళ్ళ అయిందో, మాకు అది వద్దు నాన్న దాన్ని ఎక్కడికైనా పంపించండి అని విక్కి ఏడుస్తూ చెప్తున్నాడు, దానికి అమ్మ నాన్న కూడ చెమ్మగిల్లిన కాళ్ళతో నాన్న అది చిన్న పిల్ల అంతకన్నా ఆడ పిల్ల మన ఇంటి మహా లక్ష్మి, మా కన్నా ఎక్కువ బాధ్యత మీకే వుంటుంది రా తన మీద, మన ఇంటి గరాల పట్టి రా అది, దాని మీద ఎందుకు రా మీకు కోపం దాన్ని ఇంట్లో నుండి పంపిస్తే మనం ఉండగలమా, చూడు అది ఎలా ఏడుస్తుంది, అడ పిల్లని అలా ఎడుపించ కూడదు నాన్న ముఖ్యం గా అన్నల స్థానం లో వున్న మీరు, ఇంకా ఎప్పుడు అల అనము అని నాకు మాట ఇవ్వండి అని నాన్న అన్నారు, విక్కి చక్రి కూడా ఇద్దరు కోపం గా వల్ల రూం లోకి వెళ్ళిపోయారు, అమ్మ నాన్న ఇద్దరు కూడా 9కర్ని ఒకరు చూసుకొని బాధ గా నా దగ్గరికి వచ్చి ఇద్దరి కౌగిలిలో తీసుకున్నారు, రేపు చిన్నగా మళ్ళీ చెబ్దము లెండి అని అమ్మ అంది ఫంక్షన్ కి వెళ్లకపోతే మీ వాళ్ళు ఫీల్ అవుతారు అని వెళ్దాం పదండి అని అమ్మ అంది, నాన్న అమ్మ ఒకసారి రూమ్లోకి వెళ్లి వాళ్ళని చూసి వచ్చి వెళ్దాం పద అని నన్ను ఎత్తుకున్నారు, నేను రాను అని చెప్పను, అమ్మ కొప్పటింది నేను మొండిగా వున్నా రాను అని సర్లే అని నన్ను మమ్మీ డాడీ రూం లో పడుకోపెట్టి వాళ్ళు వెళ్ళారు, అన్నలు నన్ను తీసుకు వెళ్తుంటే బాధ పడ్డారు అని వెళ్ళాను అన్నాను కానీ, ఎప్పుడు అమ్మని విడిచి పెట్టే ఉండలేదు, రూం లో ఒక్కదానికే బయం వేస్తుంది, చిన్నగా ఏడ్చుకుంటూ అన్నల రూం లోకి వెళ్ళాను వాళ్ళు ఏడుస్తూనే పడుకుండి పోయాడు, నేను వెళ్లి ఒక మూల కింద పడుకున్నాను అన్నల రూం లో నాకు చాలా దైర్యం గా వుంది, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *