ఇంత లో తను నా పేరు ప్రియ అన్నయ్య, వీళ్ళు ఇద్దరు మా అన్నలు, రోజు కంచాలు కంచాలు తిని, చదువు కోకుండ, పని పాట లేకుండా ఇద్దరు గౌడు గేదల లాగా వురున పడి తిరుగుతారు, తను ఆ మాట అనగానే ఇద్దరు నిన్ను అని ప్రియా వెంట పడ్డారు, ప్రియ వాళ్ళకి దొరకకుండా పరిగెడుతుంది, అంతలో ప్రియ కాలు జారీ పడిపోయింది, ప్రియ దొరక కూడదు అని చిన్న గా పరెగుడుతున్న వీళ్ళు ప్రియ పడిపోగనే వేగంగా ప్రియ దగ్గరికి వెళ్లి, కంగారు గా ఇద్దరు తల్లి ఏమీ అయినా అయ్యిందా అని ఇద్దరు చెరో పక్క కూర్చొని పడ్డ చోట రుద్దుతూ కూర్చున్నారు, వల్ల ముగ్గురిని చూస్తే చాలా ఆనందంగా వుంది, నాకేం కాలేదు లేరా పదండి అన్నయ్య కి టిఫిన్ చేద్దాం పదండి అని నా దగ్గరకి వచ్చారు. అన్నయ్య ఇడ్లీ, దోశ, పూరి, చపాతీ, బజ్జీ, అన్ని హోటల్ మెను నికు ఏమో ఇష్టం చెప్పు చిటికెలో చేసేస్తాను అని గబ గబా చెప్పింది, తను చెప్తుంటే తను చెప్పే స్పీడ్ కి నేను నోరు తెరచి మరీ చూస్తున్న, విక్కి చెక్రి నా వైపు చూసి నవ్వుతున్నారు, చెప్పు అన్నయ్య త్వరగా అని అవేశపడుతు నా పక్కన కూర్చుంది, నికు ఎది తినాలని వుంటే అది చేయి అని నేను అన్నాను, సరే మీకు ఎం తినాలని వుంది చెప్పండి రా అని విక్కి నీ చక్రి నీ అడిగింది, నాకి దోశ అని విక్కి, పూరి అని చక్రి అన్నారు, సరే 50 గుంజిళ్ళు ఎవరు ఫస్ట్ తీస్తే వాళ్ళకి నచ్చింది చేస్తాను, వాళ్ళు అవేశం గా తీస్తున్నారు ప్రియ నా చెవిలో అన్నయ్య నాకు బజ్జీ తినాలని వుంది అదే చేస్తాను మరీ నికు ఓకె కథ అనగానే నాకు ఓకె అని నేను ప్రియ వంక చూసి మరీ వాళ్ళని ఎందుకు ఇలా అని అన్నాను, ప్రియ లైట్ లే అన్నయ్య మనకి వంట లో అంత సీన్ లేదు ఇప్పుడు కష్టపడ్డారు అంటే అవి సేల్ చేస్తారు అని నా వైపు చూసి నవ్వింది నేను కూడా నవ్వాను, ఇద్దరు పోటీ మరీ తీస్తున్నారు 40కి వచ్చాక ఇద్దరు స్లో అయ్యారు నేను అనుమానంగా చూసాను, ప్రియ మళ్లీ చెవిలో వాడి గెలవాలని వీడు, వీడు గెలవాలని వాడు అందుకే అలా తీస్తున్నారు అని చెప్పింది, సరే అన్నయ్య మీరు ఫ్రెష్ అవ్వండి నేను బజ్జీ వేస్తాను ఓకె నా అని ప్రియ అరే మీరు అయ్యాక ఎవరు గెలిచారు చెప్పండి అదే చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది,
సరే అన్నయ్య మీరు ఫ్రెష్ అవ్వండి నేను బజ్జీ వేస్తాను ఓకె నా అని ప్రియ అరే మీరు అయ్యాక ఎవరు గెలిచారు చెప్పండి అదే చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది,
నేను బ్రెష్ చేసి వచ్చాను విక్కి టవల్ తీసుకొని వచ్చి నాకు ఇచ్చాడు నేను థాంక్స్ విక్కి అని చెప్పను, ఇంతకీ ఎవరు గెలిచారు అని అడిగాను ఎవరు గెలిచినా లాభం ఎంటి లే అన్నయ్య దానికి ఇష్టం అయినవే అది చేస్తుంది, దాని ఇష్టమే మా ఇష్టం అన్నయ్య అని అక్కడకి వచ్చిన చక్రి కూడా అన్నాడు, మీ చెల్లెలు అంటే మీకు బాగా ఇష్టం అనుకుంటా అని నేను అన్నాను లేదు అన్నయ్య అది అంటే ప్రాణం దాని కోసమే బతుకుతున్నాం అని ఇద్దరు ఒకేసారి అన్నారు, మిమ్మలని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది అని ఇద్దరినీ దగ్గరకి తీసుకున్నాను, ప్రియ అది చూసి నేను నేను అనుకుంటూ వచ్చి మా మధ్య లో దూరింది అల్లరి పిల్ల అని నెత్తిమీద ఒకటి వేసాను ఆవ్ అనుకుంటూ రుద్దుకుంది, అయ్యిందా బజ్జీ తినేలా వేసవా లేక కొట్టుకునే లా వేశవా అన్నాను, పద అన్నయ్య బాగుంటే మనం తిందాం లేకపోతే వున్నాయి గా రెండు గేదెలు అవి తింటాయి మనిద్దరం పక్కనే బుజ్జెమ్మ అత్త హోటల్ వుంది అక్కడ తిందాం, సరే పద అని అందరం కూర్చున్నాం అందరికీ టిఫిన్ పెట్టె ప్రియ కూడా కూర్చుంది, టిఫిన్ నోట్లో పెట్టుకోగానే నిజం గా చాలా బాగుంది అదే ప్రియ కి చెప్పాను థాంక్స్ అన్నయ్య అని ప్రియ చెప్పింది, రోజు తినే దాని కన్న ఎక్కువగానే లాగించాను,
