జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 16 50

వర్షం మొదలయ్యి రెండు గంటలు అవుతున్నా కూడా వర్షం ఏమాత్రం తగ్గకపోవడంతో చీకటి కూడా పడుతుండగా కంగారుగా భయ్యా మా నాన్న గారు వచ్చారంటారా అని అడుగగా , ఒక మూలన ఉన్న తాటి ఆకులతో చేసిన గొడుగు లాంటిది చేతిలో పట్టుకొని తడవకుండా బయటకు పరిగెత్తుకుంటూ వెళ్లి 15 నిమిషాల తరువాత వచ్చి ,మీ నాన్న గారితో పాటు అడవిలోకివెళ్లిన సుమారు 10 మంది వర్షం వల్ల అక్కడే ఆగిపోయి ఉంటారని వర్షం నిలబడ్డాక వస్తారని ఒక వేళ వర్షం ఇలాగే పడితే ఉదయం వస్తారని చలికి వణుకుతూ చెప్పగా , వాళ్లకు అడవిలో ఏదైనా అపాయం జరుగుతుందేమోనని భయపడగా , నన్ను చూసి మీరు ఏమి భయపడాల్సిన పని లేదు , అడవిలో వెళ్లిన ప్రతిచోటా ఆశ్రయాలు ఉంటాయని అందులో సురక్షితంగా ఉండొచ్చని చెప్పగా కొద్దిగా మనసు శాంతించింది. సమయం 7 గంటలు అవుతుండగా ఒక వ్యక్తి అరిటాకులలో మా ముగ్గురికి అడవిలో దొరికే వాటితో తయారుచేసిన భోజనం తీసుకుని రాగా తినేసి , మీరు పడుకోవాలనుకుంటే ఆ మూలన ఉతికిన దుప్పట్లు , రగ్గులు ఉన్నాయి , ప్రశాంతంగా పడుకోండి ఉదయం వాళ్ళు వచ్చాక మాట్లాడవచ్చు అని తలుపు ముందుకు వేసుకొని వర్షం లో వెళ్ళిపోయాడు.

ప్రయాణం లో అలసిపోవటం వలన కృష్ణ గాడు , నేను క్యాబ్ డ్రైవర్ పరుచుకొని పడుకోగా వెంటనే నిద్రపట్టేసింది.మహేష్ మొబైల్ సిగ్నల్ కోసం చూడగా హైద్రాబాద్ లో ఎక్కడా లేక కృష్ణ మొబైల్ సిగ్నల్ మాత్రం చివరగా ఉత్తర ప్రదేశ్ లో స్క్రీన్ పై కనిపించగా మహేష్ , కృష్ణ ఇంటిలో తెలియకుండా ఏదో పని మీద వెళ్లి ఉంటారని వాళ్ళ నెంబర్లు కంట్రోల్ రూమ్ లో ఇచ్చి ట్రై చేస్తూనే ఉండండి అని చెప్పి దొరికెంత వరకు అక్కడే ఉండిపోతారు. ఇక్కడ హాస్పిటల్ లో ఇందు అమ్మ మరియు దివ్యక్క ఇద్దరికి టైం to టైం మందులు ఇస్తూ , పళ్ళు మరియు ఆహారం తినిపిస్తూ , నవ్వుతూ మాట్లాడిస్తూ జాగ్రత్తగా చేసుకుంటుండగా రాత్రి ఒకసారి రౌండ్స్ కు వచ్చిన చీఫ్ డాక్టర్ చెక్ చెయ్యగా పూర్తిగా కొలుకుంటున్నారని రేపు మీరు ఎప్పుడైనా డిశ్చార్జ్ అవ్వొచ్చు అని ఇందు అమ్మ వైపు తిరిగి మేడం మీ వల్లే వీళ్ళిద్దరూ ఇంత త్వరగా కోలుకోవడం సాధ్యపడిందని అభినందించి వెళ్లిపోయారు.

అంకుల్ వెళ్లి హోటల్ నుండి అందరికి మంచి భోజనం తీసుకుని రాగా తినెయ్యగా , నాన్న మీకు హాస్పిటల్ వాతావరణం పడదు , నేను అంటీ చూసుకుంటాము మీరు ఇంటికి వెళ్ళండి అని దివ్యక్క చెప్పగా , సరే తల్లి జాగ్రత్తగా చూసుకోండి ఉదయం వస్తాను అని చెప్పి బైకులో ఇంటికి చేరుకోగా , అంకుల్ ఇంటిలో లైట్స్ వెలుగుకి రాము పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళ పెద్దక్కకు చెప్పగా, ఇందుమతి గారు అంకుల్ ఇంటికి ఆత్రంగా చేరుకొని ఉదయం ఎక్కడికో కంగారుగా వెళ్లారని రాము చెప్పాడు , ఏమి జరిగింది అన్నయ్య గారు అని అడుగగా జరిగింది మొత్తం చెప్పగా , కంగారుగా ఇప్పుడు ఎలా ఉంది అని కన్నీళ్లు కారుస్తూ బాధతో అడుగగా , ఒక దేవతా మూర్తి ఇద్దరిని కాపాడింది , ఇప్పుడు పూర్తిగా కొలుకున్నారు అని చెప్పగా , మంచి మనుషులకు దేవుడు కచ్చితంగా ఏదో ఒక రూపంలో సహాయం చేస్తారని చెబుతూ , వాళ్ళు చల్లగా ఉండాలని ప్రార్థిస్తూ , అన్నయ్య గారు ఏ ఆసుపత్రి అని అడుగగా , పేరు , అడ్రస్ చెప్పగా సరే అన్నయ్య గారు అని చెప్పి , ఇంటికి చేరుకొని నాకు పదే పదే కాల్ చేస్తుండగా ప్రతిసారి అందుబాటులో లేదు అని వస్తుండగా ఉదయం ఒకసారి వెళ్లి రావాలని నిర్ణయించుకుంది.

మా మొబైల్స్ ఇంకా స్విచ్ ఆఫ్ లోనే ఉండటంతో రాత్రి 10 గంటలకు విక్రమ్ సర్ మరియు విశ్వ సర్ చేరుకోగా , దివ్యక్క మరియు ఇందు అమ్మ మాత్రం ఇంకా మేల్కొని ఉండగా వాళ్ళను చూసి రూమ్ బయటకు రాగా , మహేష్ ఇప్పటికి ఇంకా అందుబాటులో లేడు , వాళ్లిద్దరూ ఇంట్లో చెప్పకుండా కాశీ కి వెళ్లినట్లు ఉన్నారు , ఇప్పుడు వెళ్లి ఇంకా ప్రయత్నిస్తాము , ఇక్కడ అంతా ok కదా , అందరూ భోజనం చేశారా అని అడుగగా , డాక్టర్ వచ్చి వెళ్లారు , రేపు డిశ్చార్జ్ అవ్వవచ్చు అని చెప్పారు , ఇక్కడ అంతా ok అని చెప్పగా , అయితే నేను ఉదయం వస్తాను ఏదైనా అవసరం అయితే కాల్ చెయ్యండి అని చెప్పి విశ్వ సర్ తో పాటు వెళ్లిపోయారు. ఇద్దరు బయట హోటల్ లో తినేసి కంట్రోల్ రూమ్ కు వెళుతూ సర్ తన భార్యకు కాల్ చేసి మొత్తం చెప్పి అందరూ సేఫ్ అని చెప్పి మీరు జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేసి కంట్రోల్ రూమ్ కు వెళ్లి మా కోసం సెర్చ్ చేస్తూ అక్కడే నిద్రపోయారు.

ఆశ్రమం లో ఎవరో తలుపు కొడుతుండగా నోద్ర లేచి తలుపు తెరువగా అడవిలోకి వెళ్లిన వారంతా వచ్చారు , మీ నాన్న గారిని కలవచ్చు అని చెప్పగా , ఎక్కడలేని సంతోషం రాగా సమయం చూడగా రాత్రి 9 గంటలు అవ్వగా వెంటనే కృష్ణ గాడిని నవ్వుతూ లేపి దుప్పట్లన్నీ మడిచి మూల పెట్టేసి ఇద్దరం అతడి వెంట పరిగెత్తుతూ వెళ్లగా , ఒక కుటీరం వైపు వేలు చూపిస్తూ లోపల మీ నాన్నగారు ఉన్నారు వెళ్లి కావచ్చు అని చెప్పగా లోపలికి ఆయాసపడుతూ పరిగెత్తాము.

1 Comment

Comments are closed.