జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 16 52

అమ్మ చుట్టూ చూస్తూ నమ్మలేనట్లుగా తన రెండు చేతులతో ఆనంద భాస్పాలు తుడుచుకుంటూ నోటిపై మూసి పెట్టుకొని , బేబీ ఇదంతా నీకే చెందాలని దేవుడిని కోరుకుంటూ ఆనంఫ్యామితో పరవశించిపోతుండగా చైర్మన్ మైకులో అందరూ శాంతించి అమ్మ మాటలను నిశ్శబ్దన్గా వినవలసిందిగా కోరగా , అమ్మ స్పీచ్ వినడానికి ఉవ్విళ్లూరుతున్నట్లుగా వెంటనే నిశ్శబ్దన్గా అయిపోయి వారి వారి సీట్లలో కూర్చొన్నారు. నేను చెప్పిన వారి సహాయం లేకుంటే నేను ఇప్పుడు మీ ముందు నిలబడేదానినే కాదు కావున నాకు మీరిస్తున్న గౌరవం వారికి కూడా చెందాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మ 20 నిమిషాల పాటు బ్యాంకుల గొప్పతనం గురించి , చేస్తున్న సేవ గురించి స్పీచ్ ఇచ్చి చివరగా కొన్ని సమస్యల గురించి వివరించి , వచ్చిన అతిథులకు , అసోసియేషన్ సభ్యులకు మరియు సమావేశానికి వచ్చి ప్రతి సభ్యులకు , పాత్రికేయులు ధన్యవాదాలు తెలిపి ఉపన్యాసం ముగించి అందరికి రెండు చేతులతో నమస్కరించగా సభ మొత్తం చప్పట్లతో దద్దరిల్లిపోసాగింది.

అప్పటికే సమయం రాత్రి 9 గంటలు అవుతుండగా చైర్మన్ మైకు అందుకొని అమ్మను అతిథుల పక్కన గౌరవంగా కూర్చోమనగా , అమ్మ నిలబడే ఉండగా స్వయంగా ముందుకు వెళ్లి కూర్చోబెట్టగా , అమ్మ నిజాయితీని , ఉపన్యాసాన్ని ప్రసంషిస్తూ ముగింపు ఉపన్యాసం ఇచ్చి , నేను ఈ అసోసియేషన్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ఏ సంవత్సరము ఇంత సమయం వరకు సంతోషంగా ఉపన్యాసాలు వినింది ఎరుగలేదు , ఊహించనేలేదు. ఇది నా హయాం లో జరిగేలా చేసినందుకు అందరి తరుపున అమ్మకు కృతజ్ఞతలు తెలిపి అందరూ భోజనాలు చేసి జాగ్రత్తగా వారి వారి విడిదికి చేరాలని కోరుతూ సభను ముగించారు.అమ్మ దగ్గరికి చేరుకొని అమ్మను అతిథులతో పాటు భోజనానికి ప్రత్యేకంగా పిలువగా , సర్ నాతో పాటు వచ్చిన వాళ్ళతోనే మామూలుగానే భోజనం చేస్తాము అని వినయంగా చెప్పగా , అయితే వీళ్ళందరిని కూడా ఆహ్వానిద్దాము అని అందరికి చెప్పగా , స్వయంగా అతడే అమ్మ బ్యాంకు చైర్మన్ తో పాటు అందరిని పైన ఉన్న 5 స్టార్ హోటల్ కు పిలుచుకొని వెళ్లగా , త్వరగా తినేసి ఎంత లేట్ అయినా ఇప్పుడే నా బేబీ ని కలవాలని నిర్ణయించుకుంది.

అతిథులు అమ్మ కోసం వేచి చూస్తూ అమ్మతో పాటు కూర్చొని, ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడుతూ మీకు ప్రభుత్వం తరపున ఎలాంటి సహాయం కావాలన్నా తప్పకుండా జరిగేలా చూస్తామని చెప్పగా , ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ ,సమయం 10 అవుతుండగా త్వరగా తినేసి ఎంత లేట్ అయినా కనీసం నను ఒకసారి కళ్లారా చూడాల్సిందేనని నిర్ణయించుకొని ఆత్రంగా తినసాగింది. అంతలో అమ్మ బ్యాంక్ చైర్మన్ అమ్మ దగ్గరికి వచ్చి ఇందు విలేకరులు మిమ్మల్ని ఇంటర్వ్యూ చెయ్యాలని భోజనం కూడా చెయ్యకుండా చాలసేపటి నుండి వేచి చూస్తున్నారని చెప్పగా , అమ్మ ఇప్పుడెలా ఇప్పటికే సమయం అయ్యింది అని ఆలోచిస్తుండగా , తొందరగా ముగించేద్దాము అని చైర్మన్ చెప్పగా సరే అని ఒప్పుకొని భోజనం ముగించుకొని అతిథుల దగ్గర సెలవు తీసుకొని కింద హాల్ లోకి వెళ్లగా మొత్తం 100 కు పైగా విలేకరులు అమ్మ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా అమ్మను చూసి సంతోషం వ్యక్తం చేస్తూ వాళ్ళ ఎదురుగా కూర్చోగా దాదాపు 20 నిమిషాలు వాళ్ళ ప్రశ్నలకు సావధానంగా జవాబిస్తూ ముగించింది.

11 గంటల కల్లా అమ్మతో పాటు వచ్చిన వారందరినీ వారికి కేటాయించిన హోటల్ లో డ్రాప్ చేసి , కొద్దిగా పని ఉంది గంటలో వచ్చేస్తానని మహిళా ఉద్యోగితో చెప్పగా మేడం నాకు కూడా బోర్ గా ఉంది మీతోపాటు నేను వస్తాను అని చెప్పగా , డ్రైవర్ కు మొబైల్ లో అడ్రస్ చూపించి , నేను అర్జెంట్ గా అక్కడికి వెళ్లి రావాలి తీసుకుని వెళ్లగలవా అని అడుగగా , మేడం ఇప్పటివరకు మీరూ మాట్లాడినది మొత్తం youtube లో చూసాను మీరు చాలా గ్రేట్ మేడం ,మీ లాంటి వారికి సహాయం చేసే అదృష్టం నాకు లభించినందుకు నేను గర్వపడుతున్నాను మేడం , రిక్వెస్ట్ కాదు ఆర్డర్ వెయ్యండి ఎక్కడికైనా సేఫ్ గా తీసుకొని వెళ్తాను అని చెప్పగా, అమ్మ సంతోషిస్తూ థాంక్స్ చెప్పగా వ్యాన్ ను ముందుకు పోనిస్తాడు.

1 Comment

Comments are closed.