జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 16 52

హాస్పిటల్ లో ఉదయం 5 గంటలకు తెలుగు , హిందీ మరియు ఇంగ్లీష్ డైలీ పేపర్స్ రాగా అన్ని పేపర్ హెడ్ పేపర్ హెడ్ లైన్స్ లో banks saviour , employee of the decade పేరుతో ఫైనాన్స్ మినిస్టర్ సన్మానిస్తున్న మరియు ఉపన్యాసం ఇస్తున్న ఇందు అమ్మ ఫోటోలు హాఫ్ పేజీ మొత్తం వుండి , కింద విక్రమ్ సర్ మరియు గోవా govt women మెడికల్ స్టూడెంట్స్ గ్రూప్ ఫోటోను వేసి అమ్మ చేసిన సేవలను ఆ పేపర్ మొత్తం ప్రింట్ చేసి ఉండగా , రాత్రి అమ్మను చూసిన డాక్టర్లు మరియు హాస్పిటల్ స్టాఫ్ ఆ పేపర్ ను చూసి షాక్ లోకి వెళ్ళిపోయి తేరుకొని అందరూ ICU వైపుకు పరిగెత్తసాగారు.

మొత్తం ఇండియా మొత్తం ఏ భాష డైలీ పేపర్ మరియు మ్యాగజైన్ చూసినా ఇదేవిధంగా ముగ్గురి గురించి హెడ్ లైన్స్ లో ప్రింట్ చేశారు. గది బయట చప్పుడికి ఇందు అమ్మకు మెలకువ రాగా బాగా రెస్ట్ తీసుకోవడం వల్ల ఏ మాత్రం నీరసంగా అనిపించక అక్కయ్య అని పైకి లేచి కళ్ళు తుడుచుకుని అమ్మ దగ్గరికి వెళ్లి ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్న అమ్మ బెడ్ పక్కన నిలబడి డాక్టర్ ఇప్పుడెలా ఉంది అని అడుగగా , she is perfectly alright అని చెబుతుండగా , హాస్పిటల్ management మరియు చీఫ్ డాక్టర్లు అంతా లోపలికి వచ్చి అక్కడ ఉన్న డాక్టర్ కు పేపర్ చూపిస్తూ , మేడం మీ లాంటి గొప్ప వాళ్లకు ట్రీట్ చేసినందుకు మా హాస్పిటల్ ఎంతో గర్వపడుతోంది అని తమ ఆనందాన్ని పంచుకుంటూ , చీఫ్ మహిళా డాక్టర్ లను పిలిపించి అమ్మ మరియు అందరి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని చెక్ చెయ్యసాగారు. వెనుక వచ్చిన వాళ్లంతా అమ్మను చూస్తూ ఆమె ఆ మెడమే అని చూసిన ఆనందంలో ఏమేమో గుసాగుసలాడుతున్నారు.

ఇందు అమ్మ అమ్మ మరియు అంటీ బెడ్ ల మధ్య కూర్చొని ఇద్దరిని జాగ్రత్తగా చేసుకొనసాగింది. విశ్వ సర్ ఎయిర్పోర్ట్ కు చేరుకొని విక్రమ్ సర్ ను తన జీప్ లో ఎక్కించుకొని సరాసరి హాస్పిటల్ కు చేరుకొని చీఫ్ డాక్టర్లు తో సహా ICU కు చేరుకొని లోపలికి వెళ్ళి ఇందు అమ్మకు ధైర్యం ఇస్తూ నాకు ఫోన్ చెయ్యగా స్విచ్ ఆఫ్ అని వస్తుండటంతో , విశ్వ సర్ కూడా నిన్నటి నుండి ఇదేవిధంగా వస్తోందని చెప్పగా , వెంటనే ఈ నా ఫోన్ సిగ్నల్ ఎక్కడి నుండి వస్తుందో కనుక్కోమని చెప్పగా , నైస్ ఐడియా రా అని వెంటనే స్టేషన్ కు కాల్ చేసి విషయం చెప్పి వెంటనే వెళ్ళమని ఆర్డర్ వేసాడు. విక్రమ్ సర్ డాక్టర్ ను సంప్రదించి మొత్తం పరిస్థితిని తెలుసుకొనసాగారు.

సమయం 9 గంటలు అవుతుండగా అమ్మ మరియు అంటీ కు మెలకువ రాగా నీరసంగా కళ్ళు తెరువగా డాక్టర్లు పరిశీలించి , ఏమి తినకపోవడం వల్ల శక్తి లేదు నర్సు తినడానికి ఏర్పాటు చెయ్యండి అని చెప్పగా , వెంటనే రెండు వీల్ ఛైర్స్ తెప్పించి నెమ్మదిగా కూర్చోబెట్టి ఇందు అమ్మ తన కొలీగ్ సహాయంతో బాత్రూం కు తీసుకొని వెళ్లి కాలకృత్యాలు తీర్పించి , తడి బట్టతో వొంటిని తుడిచి బెడ్ పై వెనక్కు కూర్చోబెట్టి , తెప్పించిన ఇడ్లీలను చిన్న పిల్లవాళ్లకు తినిపించినట్లుగా నిదానంగా తినిపిస్తూ , పక్కన అంటుకున్న దానిని చేతితో సున్నితంగా తుడుస్తూ తినిపించి నీళ్లు తాగించగా , కొద్దిసేపటి తరువాత శరీరానికి శక్తి లభించగా మాట్లాడటానికి పెదవులు కదలగా నెమ్మదిగా అమ్మ , అంటీ పూర్తిగా తేరుకొని బెడ్ పై సొంతంగా కూర్చోగా వెంటనే కాల్ చెయ్యడానికి మొబైల్స్ ను అడుగగా , అమ్మ తన మొబైల్ ఇవ్వగా అమ్మ మరియు అంటీ నాకు కృష్ణకు కాల్ చెయ్యగా స్విచ్ ఆఫ్ అని రాగా వెంటనే అంకుల్ కు కాల్ చేసి విషయం చెప్పి ఇప్పుడు ఇద్దరమూ బాగానే ఉన్నామని చెప్పి హాస్పిటల్ లో ఉన్నామని , అడ్రస్ చెప్పమని నర్సుకు ఇవ్వగా , హాస్పిటల్ పేరు మరియు అడ్రస్ చెప్పగా వెంటనే వచ్చేస్తున్నామని చెప్పి దివ్యక్కతో పాటు బైకులో కంగారుపడుతూ హాస్పిటల్ కు బయలుదేరారు.

అమ్మ నర్సు వైపు తిరిగి మమ్మల్ని తీసుకొచ్చిన , మా ప్రాణాలు కాపాడిన ఆ దేవత ఎక్కడ అని అడుగుతూ ఇందు అమ్మ వైపు తిరిగి మీరే ఇప్పుడు గుర్తుకు వచ్చింది అని రెండు చేతులతో నమస్కరిస్తూ కన్నీరు కారుస్తూ మమ్మల్ని కాపాడినందుకు చాలా చాలా థాంక్స్ మీ రుణం ఎప్పటికి తీర్చుకోలేము అని చెబుతుండగా , ఇందు అమ్మ కళ్ళల్లో ఒక్కసారిగా కన్నీళ్లు కారుస్తూ నమస్కరిస్తున్న చేతులను ఆపుతూ అక్క…….అని పలుకుతూ ఆగిపోయి మీరు చేసిన దాంతో నేను చేసినది సముద్రం లో కలిసే వాగు అంత, మీ కోసం నా ప్రాణాలైనా అర్పిస్తాను అని ఉద్వేగంతో చెబుతూ మనఃస్ఫూర్తిగా అమ్మ పాదాలను నమస్కరిస్తుండగా , డాక్టర్లు అందరూ బయటకు వెళ్లిపోగా, అమ్మ నోటిలోనుండి సడన్ గా చెల్లెమ్మ అన్న మాట వచ్చి తన కాళ్ళను వెనక్కు తీసుకొని ఇందు అమ్మను కౌగిలించుకోగా , ఇందు అమ్మ కళ్లల్లో ఆనంద భాస్పాలు ఆగటం లేదు.

1 Comment

Comments are closed.