జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 17 50

అప్పటికే 8 గంటలు అవుతుండగా అమ్మ పిల్లలకు వంట చెయ్యాలి తరువాత వస్తాను అని చెప్పి బయటకు రాగా అదే విషయం నాకు చెప్పి ఇంటికి వెళ్లి చూడగా ఇల్లు మొత్తం ఉన్న వస్తువులన్నీ చూసి ఆశ్చర్యపోతుండగా రాము దగ్గరికి వెళ్లి అక్క మహేష్ అన్నయ్య ఇవన్నీ ఇప్పుడే పెట్టించి వెళ్ళాడు చూడు పెద్ద టీవీ , ఫ్రిడ్జ్ , వాషింగ్ మెషీన్ , పెద్ద గ్యాస్ స్టవ్ , బీరువా…………..అని అన్నింటినీ స్వయంగా చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్లి చూపించసాగాడు. వెంటనే పరిగెత్తుకుంటూ ఇంటి దగ్గరికి రాగా ఆమె కచ్చితంగా వస్తుందని తెలిసి గేట్ దగ్గరే వేచి చూస్తుండగా నా ముందు ఆయాసపడుతూ నిలబడి కన్నీళ్లు కారుస్తూ నన్నే ఆరాధనగా చూస్తుండగా , అన్ని ఉన్నాయా లేక ఇంకా ఏమైనా అవసరమా అని నవ్వుతూ అడుగగా వెంటనే అక్కడికక్కడే గట్టిగా కౌగిలించుకొని ఇప్పటికే కాదు ఈ జన్మకు ఇది చాలు అని ఆనంద భాస్పాలు కారుస్తూ గుక్కు గుక్కు మాట్లాడుతూ చెప్పగా , ఆనందం వేసి రెండు చేతులతో ఆమె చెంపలపై వేసి తల ఎత్తి నుదుటి పై ముద్దు పెట్టి అవ్వ మరియు పిల్లలకు ఆకలిగా ఉందేమో వెళ్లి వంట చెయ్యి నేను ఎక్కడికి వేళ్ళను మళ్ళీ వస్తాను అని చెప్పి కన్నీళ్లను తుడిచి నవ్వమని చెప్పి నవ్వితూ పంపించి లోపలికి రాగా ,అమ్మ , అంటీ తో పాటు అందరూ టీవీ లో వస్తున్న కామెడీ చూసి గట్టిగా నవ్వుతూ ఉండగా చాలా సంతోషం వేసి మురిసిపోతుండగా, అరేయ్ మామా రారా సూపర్ కామెడీ అని పిలువగా అమ్మ పక్కనే సోఫా లో కూర్చొని అందరితో పాటు ఎంజాయ్ చెయ్యసాగాను.

సమయం 9 గంటలు అవుతుండగా దివ్యక్క వంట రెడి అని వరుసగా అన్నింటినీ తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టి అందరిని పిలువగా వెళ్లి చుట్టూ కూర్చోగా దివ్యక్క చక చకా వడ్డించగా అమ్మ కు నేను అంటీ కు దివ్యక్క తినిపిస్తూ మేము కూడా తినేసి కొద్దిసేపు టీవీ చూసి అమ్మ , అంటీ మరియు దివ్యక్క రూమ్ లో పడుకోగా , మేమంతా హాల్ లో పడుకున్నాము. అర్ధరాత్రి అవుతుండగా ఇందు అమ్మ గుర్తుకు వస్తుండగా అమ్మకు ఎలా చెప్పాలి అన్న ఆలోచనలే వస్తుండగా మెలకువ రాగా ఎంత ప్రయత్నించినా నిద్ర రాకపోయేసరికి లేచి రూమ్ లోకి వెళ్లి అమ్మ పక్కనే బెడ్ పక్కన కింద కూర్చుని అమ్మ అరచేతిలో తల వాల్చగా అమ్మ వెచ్చని స్పర్శకు వెంటనే హాయిగా నిద్రపట్టీసింది.

వెచ్చని స్పర్శ నా తల పైన కింద తగులుతుండగా మెలకువ రాగా కళ్ళు తెరువగా అమ్మ నవ్వుతూ నా తలను ప్రేమగా నిమురుతూ గుడ్ మార్నింగ్ కన్నయ్య అని విష్ చెయ్యగా , నవ్వుతూ అమ్మ అరచేతిపై ముద్దులు పెడుతూ లవ్ యు అమ్మ అని చెప్పి చుట్టూ చూడగా అప్పటికే తెల్లవారి అందరూ లేచి వెళ్లిపోయిఉండగా సమయం చూడగా 7 గంటలు అవుతుండగా అమ్మ నన్ను చేతులతో బెడ్ పై కూర్చోబెట్టుకొని నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టగా అమ్మను సంతోషంగా కౌగిలించుకోగా కన్నయ్య నాకు అంతా బాగయ్యింది మన ఇంటికి వెళదాము అని చెప్పగా , అమ్మ చేతిని సున్నితంగా అందుకొని చూసి సరే అమ్మ అని అమ్మ నుదుటిపై ఘాడంగా ముద్దు పెట్టి రెడి అవ్వడానికి బయటకు రాగా కృష్ణ టవల్ అందివ్వగా స్నానం చేయడానికి వెళ్లగా ,తెల్లవారుఘామునే వచ్చి వంటగదిలో దివ్యక్కకు సహాయం చేస్తున్న ఇందుమతి గారు అమ్మ ఉన్న రూమ్ లోకి వెళ్ళింది.

అర గంటలో ఫ్రెష్ అయ్యి రాగా దివ్యక్క tiffen రెడి అని తెచ్చి డైనింగ్ టేబుల్ పై పెడుతూ అందరిని పిలువగా , అమ్మతో పాటు అందరూ కూర్చొనగా దివ్యక్క వడ్డించి అంటీ కు తినిపిస్తుండగా , అమ్మకు తినిపిస్తూ నేను తినేసి , అమ్మ ముందే చెప్పి ఉండటం వలన అందరికి వెళ్ళొస్తామని చెప్పగా , దివ్యక్క అన్నయ్య కొద్దిసేపు ఉండండి భోజనం కూడా ప్రిపేర్ చేస్తున్నాను మధ్యాహ్నానికి తీసుకుని వెల్దురు , రాత్రికి కృష్ణ తో పంపిస్తాను అని చెప్పగా , అంతవరకు అమ్మ ఇందుమతి గారి ఇంటికి వెళ్లివద్దామా అని చెప్పగా, సరే కన్నయ్య అని అనగా ఇందుమతి గారి ముఖం సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ వాళ్ళ ఇంటికి ఆత్రంగా వెల్లసాగింది.కారును గేట్ వరకు వెనుకకు తీసుకుని రాగా దివ్యక్క అమ్మను పిలుచుకునిరాగా నా పక్కనే ఎక్కి కూర్చోండి.

కారులో ఇందుమతి గారికి జరిగిన కష్టాలను వివరించి , ఇంటెలి ఉన్న వాళ్ళ గురించి మొత్తం చెప్పి కారును అక్కడికి తీసుకునివేళ్ళాను. కారు శబ్దం విన్న ఇందుమతి గారు హాల్ ని శుభ్రపరచి సోఫాను నీటి గా సర్ది ఆత్రంగా బయటకు వచ్చి అమ్మను సాదరంగా లోపలికి పిలుచుకునివెళ్లింది.

1 Comment

Comments are closed.