జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 17 50

అమ్మకు ప్రేమగా మరొక ముద్దు పెట్టి పైకి లేచి పడుకున్న అంటీ కాళ్లదగ్గర కూర్చొని , కాళ్ళు పట్టుకొని కన్నీళ్లు కారుస్తూ బాధగా నన్ను క్షమించండి అంటీ ఇదంతా నావల్లే జరిగింది , నేను ఊరికి వెల్లకపోయి ఉండుంటే మీరు ఇక్కడే ఇంటిలోనే ఉండిపోయేవారు , ఇలా జరిగి ఉండేది కాదు అని పశ్చాఅత్తాపం పడుతుండగా , నా కన్నీరు అంటీ కాళ్లపై పడటం వలన మెలకువ రాగా నా మాటలు విని వెంటనే లేచి కూర్చొని నా తల పైకి ఎత్తి చేతితో కన్నీళ్లను తుడుస్తూ , నాకు కృష్ణ ఎలాగో నువ్వు కూడా అంతే ఇప్పుడు ఏమయ్యింది , మేము బానే ఉన్నాము నువ్వు దాని గురించే ఆలోచిస్తూ భాధపడితే అందరూ బాధపడతారు అని నా నుదుటి పై ముద్దు పెట్టి చెప్పగా , ఇదంతా రూమ్ తలుపు దగ్గర నుండి చూస్తున్న దివ్యక్క మరియు కృష్ణ వచ్చి నన్ను వెనుక నుండి హత్తుకొని నా తల నిమురుతూ ఓదార్చసాగారు. ఇంతలో అమ్మకు మెలకువ రాగా లేచి కూర్చొని మమ్మల్నే చూస్తూ అందరూ నాపై చూపిస్తున్న ప్రేమకు పరవశించి పోతూ ఆనంద భాస్ఫాలు కారుస్తూ నిశ్శబ్దన్గా ఆ అందమైన దృశ్యాన్ని చూస్తూ బెడ్ పై కూర్చొని ఉండిపోయింది.

చాలా సేపటి వరకు అలాగే అందరూ ఉండిపోగా అమ్మ దగ్గినట్లు చప్పుడు చెయ్యగా అందరూ తేరుకొని తమ కళ్ళను తుడుచుకుంటూ వేరవ్వగా , నా కొడుకుపై ఇంత ప్రేమ చూపిస్తే వాడికి దిష్టి తగులుతుందేమో అని సంతోషిస్తూ నవ్వుతూ చెప్పగా అందరూ నవ్వుకోసాగాము. దివ్యక్క వెళ్లి అమ్మ భుజం పై తల వాల్చి చూడండి అంటీ అన్నయ్య వల్లే మీకు ఇదంతా జరిగిందని చాలా బాధపడుతున్నాడు అని చెప్పగా , అమ్మ నన్ను రమ్మన్నట్లుగా చెయ్యి చాచి పిలువగా లేచి అమ్మ పక్కన కూర్చొని ఒడిలో తల పెట్టి పడుకొని అమ్మ నా వల్లే……అని మాట్లాడబోగా ,అమ్మ నా మూతిపై వేలు అడ్డం పెట్టి ఆపుతూ నుదుటిపై ముద్దుపెట్టి ఒక చేతితో వెచ్చగా తలపై ప్రేమగా నిమరగా నిన్నటి నుండి నిద్ర లేనందువల్ల అమ్మ ఒడిలో వెంటనే నిద్ర పట్టేసింది.తరువాత మెలకువ వచ్చి చూడగా సమయం 7 గంటలు అవుతుండగా అమ్మ కదలకుండా నన్ను నిద్రపుచ్చుతూ అలాగే కూర్చుండిపోయింది. వెంటనే పైకి లేచి అమ్మను గట్టిగా కౌగిలించుకొని నుదుటిపై గట్టిగా ముద్దు పెట్టి అమ్మ కళ్ళల్లోకే అమితమైన ప్రేమతో చూస్తూ ఉండిపోగా , కాసేపటికి ఎవరో రూమ్ లోకి వస్తున్న చప్పుడు వినిపించి అమ్మకు ఫ్రెష్ అవ్వమని చెప్పి నేను బయట ఉన్న బాత్రూం వైపు వెళ్లగా అంటీ సోఫా లో కూర్చొని నవ్వుతూ టీవీ చూస్తుండగా సంతోషం వెయ్యగా , ఇందుమతి గారు అమ్మకు సహాయం చేయడానికి రూమ్ లోకి వెళ్లారు.

ఫ్రెష్ అయ్యి లోపలికి రాగా అంకుల్ నుండి కాల్ రాగా ఫోన్ ఎత్తగా ఇందుమతి గారి ఇంటి దగ్గరికి రమ్మని చెప్పగా , కృష్ణతో పాటు వెళ్లగా ఇంటి ముందు ఒక లగేజీ వాహనం ఉండగా అంకుల్ వచ్చి మొత్తం ఇంటికి అవసరమైనవన్ని కొనేసాను నువ్వు ఎక్కడ పెట్టెయ్యమని చెబితే వీళ్ళు అక్కడ దించేస్తారు అని పిలుచుకొని వచ్చిన పని వాళ్ళను చూపించగా , లోపలికి వెళ్ళగా నా మాటలు విని సౌమ్య అన్నయ్య అన్నయ్య అని ఆత్రంగా చేతులు చాచి నా వైపు వస్తుండగా పరిగెత్తుతూ వెళ్లి చేతులు పట్టుకొని చెల్లెమ్మ అని ఆప్యాయంగా పిలువగా , పరవశించిపోయి అన్నయ్య అమ్మకు ఎలా ఉంది , దెబ్బ మానిపోయింది కదా అని అడుగగా , అవును చెల్లి ఇప్పుడు అంతా బాగుంది రేపు అమ్మను ఇక్కడికి పిలుచుకొని వస్తాను అని చెప్పగా , పులకించిపోతూ రెపటికోసం ఎదురు చూస్తూ ఉంటాను అన్నయ్య అని చెప్పగా చాలా చాలా ఆనందం వేసింది .

అంతలో పని వాళ్ళు ఫ్రిడ్జ్ ను లోపలికి తీసుకుని రాగా సౌమ్య కొద్దిసేపు ఇక్కడ కూర్చో ఇప్పుడే వచ్చేస్తాను అని రాముని పిలిచి అక్క దగ్గరే ఉండమని చెప్పి ఫ్రిడ్జ్ ను వంట గదిలో పెట్టించి , పని వాళ్ళు లోపలికి తీసుకు వచ్చినవన్నీ అర గంటలో సరైన ప్లేస్ లలో పెట్టించి సౌమ్య దగ్గరికి వెళ్లి రెండు నిమిషాలు మాట్లాడి ఇందు అక్కను పంపిస్తాను అని చెప్పగా అంతలో పని వాళ్ళు led టీవీ ఫిక్స్ చేసి రిమోట్ నా చేతికి ఇవ్వగా రాము ను పిలిచి రిమోట్ ఇచ్చి on చెయ్యమనగా 50 inches టీవీ లో మూవీ రాగా హాల్ లో చూస్తున్న ఫీలింగ్ రాగా , థాంక్స్ అన్నయ్య అని రాము నన్ను గట్టిగా కౌగిలించుకోగా , సంతోషిస్తూ రేపు నిన్ను స్కూల్ లో జాయిన్ చేద్దామా అని అడుగగా అలాగే అన్నయ్య నువ్వు ఏమి చెప్పినా అలాగే చేస్తాను అని నన్ను గట్టిగా అతుక్కుపోయాడు .బయటకు రాగా అంకుల్ మిగిలిన డబ్బులను నా జేబులో పెట్టగా ముగ్గురం ఇంటికి వెల్లసాగాము.

1 Comment

Comments are closed.