జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 17 50

తెల్లవారుజాము కావడం వల్ల రోడ్లన్నీ దాదాపుగా నిర్మానుశ్యంగా ఉండటం వలన మేము క్యాబ్ డ్రైవర్ వేగంగా పోనిస్తూ ఉండగా , మేము తిరిగిన ప్రదేశాలు కొన్నింటిని అమ్మకు చూపిస్తుండగా గంటలో అమ్మ ఇంటికి చేరుకున్నాము.

ఇల్లు వేలితో చూపగా క్యాబ్ ఇంటి ముందు ఆగగా క్యాబ్ దిగి వెనుక ఉన్న లగేజీ దింపుకొని డబ్బు ఇచ్చేసి పంపి ఇంటిలోకి వెళ్ళడానికి గేట్ వద్దకు వెళుతుండగా పక్కనే 6 అడుగులు ఉన్న వ్యక్తి వైర్ లెస్ ఫోన్ లో మాట్లాడుతూ వెంటనే రమ్మని చెప్పి మా దగ్గరికి వచ్చి ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు ?అని కొద్దిగా కటువుగా ప్రశ్నించగా , కచ్చితంగా పోలీస్ అని నిర్ధారించుకొని , ఇందు మేడం కోసం వచ్చాము అని చెప్పగా మారు నిమిషమే ఇంటి తలుపు తెరుచుకోగా ఇద్దరు మహిళలు బయటకు వచ్చి ఒకరు తలుపు దగ్గరే నిలబడగా మరొకరు సర్ ఎవరు వీరు అని మా దగ్గరికి రాగా , మేము చెప్పినదే చెప్పగా మేడం ఇప్పుడు ఎవ్వరిని కలిసే పరిస్థితులలో లేదు , వైజాగ్ వెళ్లి వచ్చినప్పటి నుండి అక్కడ ఎవరికో మేడం బందులకనుకొంటా ఆరోగ్యం బాగాలేదని మేడం ఆమెనే ప్రతి క్షణం తలుస్తూ మంచి నీళ్ళు కూడా ముట్టకుండా దేవుడిని ప్రార్థిస్తూనే తినకపోవడం వలన శక్తి లేనట్లు బెడ్ పైనే ఉండిపోగా మొన్న విపరీతమైన జ్వరం రాగా మాకు భయమేసి విక్రమ్ సర్ ను పిలిపించగా సర్ డాక్టర్ ను పిలుచుకొని వచ్చి , వైజాగ్ లో వాళ్లకు ఇప్పుడు ఏ ప్రమాదం లేదని , డిశ్చార్జ్ కూడా అయ్యారని చెప్పి గ్లూకోస్ ఎక్కించుకోవడానికి ఒప్పించి దగ్గరుండి చూసుకోగా నిన్న ఉదయానికల్లా మేడం కొలుకున్నారు.

నిన్న ఉదయం నుండి కొద్దికొద్దిగా ఆహారం తీసుకుంటూ వాళ్లనే తలుచుకుంటూ ఇందు మేడం రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఇంకా నిద్రపోతున్నారు , ఇప్పుడైతే మీరు మేడం ను కలవడానికి వీలు లేదు అని వివరించగా , అమ్మ కళ్లల్లో బాధతో కన్నీళ్లు రాగా , ఇందు అమ్మను వెంటనే చూడాలని గేట్ తెరవడానికి ప్రయత్నించగా , పోలీస్ నన్ను పట్టుకోగా అంతలో పోలీస్ జీప్ రాగా అందులో నుండి దిగిన పోలీస్ నన్ను గుర్తుపట్టి సామ్రాట్ ఆ సర్ ను వదిలేయ్ అని గట్టిగా చెబుతూ పరిగెత్తుకుంటూ వచ్చి , sorry మహేష్ మీరెవరో తెలియక అతడు అలా ప్రవర్తించారు కానీ ఆయన చాలా సిన్సియర్ , అతడి పనికి ఎవ్వరు అడ్డు వచ్చినా చూడడు తన పని తాను కచ్చితంగా చేస్తాడు అని , మేడం వైజాగ్ లో స్పీచ్ ఇచ్చిన తరువాత మేడం ను అభినందించడానికి పెద్ద ఎత్తున జనాలు వస్తున్నందున అందరిని అనుమానించాల్సి వస్తోంది అని వివరించగా, అలాంటిదేమి లేదు సర్ మేడం కోసం ఇంత శ్రమ పెడుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది అని అతడిని సెల్యూట్ చెయ్యగా , అంతలో జీప్ లో వచ్చిన పోలీస్ విక్రమ్ సర్ కు కాల్ చేసి సర్ మహేష్ వచ్చారు అని చెప్పగా , మహేష్ కు ఇవ్వమనగా నాకు ఇవ్వగా , sorry మహేష్ మేడం గురించి మొత్తం మా కానిస్టేబుల్ చెప్పే ఉంటారు , ఇప్పుడేమి పర్లేదు , నేను నీకు కాల్ చేసి చెబుదామంటే మేడం చెప్ప వద్దని నువ్వు బాధపడతావని మాట తీసుకుంది అని చెప్పగా , Thank you sooo much సర్ మేడం కోసం మీరు ఇంత సెక్యురిటి , శ్రమ తీసుకున్నందుకు అని కళ్లను తుడుచుకుంటూ చెప్పగా , you are everything to me మహేష్ , మీకోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాను అని చెబుతూ 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను అని చెప్పగా , ఇప్పుడొద్దు సర్ కొద్దిగా మేడం తో పని ఉంది తరువాత నేనే స్వయంగా వచ్చి కలుస్తాను అని బదులివ్వగా , అలాగే మహేష్ take your own time అని స్పీకర్ on చెయ్యమనగా , సామ్రాట్ మీరు మరియు కానిస్టేబుల్స్ అక్కడ నుండి వచ్చెయ్యండి అని ఆర్డర్ వెయ్యగా , సర్ మరి మేడం సెక్యురిటి అని అడుగగా , మేడం కు మహేష్ ఒక కమెండో మీరు నిర్భయంగా వచ్చెయ్యండి అని భరోసా ఇవ్వగా , Sorry అని చెప్పి గేట్ తెరువగా మీరు పడుతున్న శ్రమకు నేనే మీకు థాంక్స్ చెప్పాలి అని కౌగిలించుకొని అభినందిస్తూ లోపలికి వెళ్ళాము.

అతడు సంతోషిస్తూ కానిస్టేబుల్స్ ను పిలిచి అదే జీప్ లో వెళ్లిపోయారు. అమ్మ నానో కారు బయట ఉండగా , కాంపౌండ్ లోపల పెద్ద వెహికల్ కవర్ కప్పబడి ఒక పక్కగా పార్క్ చేయబడి ఉంది, అమ్మను తలుపు దగ్గరికి పిలుచుకొని వెల్లేంతవరకు అమ్మ కళ్ళల్లో నుండి కన్నీళ్లు ఆగకుండా కారుతూనే ఉండగా , చెప్పాను కాదమ్మా నువ్వంటే ఇందు అమ్మకు ఎంత ప్రేమో చెప్పలేనని అని నాకు కూడా ఉద్వేగంతో మాటలు కూడా సరిగ్గా రాకపోవడంతో , అమ్మ తన కన్నీళ్లను తుడుచుకుంటూ మనం భాధపడితే నా చెల్లి ఇంకా ఎక్కువ బాధపడుతుంది అని తలుపు తీసుకుని నాకంటే ఆత్రంగా లోపలికి వెళ్ళి బెడ్ రూమ్ ఎక్కడ అని అడుగగా , వేలితో రూమ్ చూపించి బ్యాగులు పక్కన పెట్టేసి పక్కనే చూడగా , హాల్ సగం మొత్తం గిఫ్ట్ లతో నిండిపోయి ఒక్కటి కూడా ఓపెన్ చేసినట్లుగా లేదు, చప్పుడు చెయ్యకుండా నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ డోర్ దగ్గరికి వెళ్లి , నిదానంగా తెరిచి భుజం వరకు రగ్గు కప్పుకొని పడుకొని ఉన్న ఇందు అమ్మ పక్కనే కూర్చుని చూడగా ఇందు అమ్మ ముఖం లో మా గురించే ఆలోచిస్తున్న ఆందోళన కనిపిస్తుండగా , అమ్మ లేచి డోర్ దగ్గర భావోద్వేగంతో అమ్మలిద్దరిని చూస్తున్న నా దగ్గరికి వచ్చి , కన్నయ్య చెల్లికి ఇప్పుడు కావాల్సినది నీ ప్రేమే , నేను వెళ్లి వంట చేస్తాను ఎంతసేపయినా పర్లేదు ఈ రూమ్ నుండి బయటకు వచ్చేప్పుడు నా చెల్లి కళ్లల్లో సంతోషాన్ని చూడాలి , దానికోసం నేను ఎంత సమయం అయినా వేచి చూస్తాను , నేను వచ్చిన విషయం కూడా చెప్పకు అని నా నుదుటిపై తీవ్రమైన ఉద్వేగంతో కళ్లల్లో చెమ్మతో ముద్దు పెట్టి తలుపు వేసుకుని వెళ్ళిపోయింది.

చాలా రోజుల తరువాత అమ్మను చూడబోతున్నానన్న ఆనందం ఒక వైపు , ఇన్ని రోజులు అమ్మకు దూరంగా ఉన్నందుకు , అమ్మ బాధకు కారణమైనందుకు నా మీద నాకే కోపంగాను బాధపడుతూ పడుకున్న అమ్మను ఆరాధనగా చూస్తూ పక్కనే వెళ్లి కూర్చొని అమ్మ చెంపపై సున్నితంగా తాకగా , వెంటనే అమ్మ బేబీ అని కలవరిస్తూ , తన చెంపను తాకుతున్న చెయ్యి పట్టుకొని పక్కకు తిరికి నా అరచేతిపై చెంపను వాల్చి చేతులతో గట్టిగా పట్టుకోగా , అమ్మ స్పర్శకు , వెచ్చదనానికి నా శరీరం మొత్తం చిన్నగా కంపించి , అణువణువు హాయిగా అనిపిస్తూ కళ్లల్లో ఆనంద భాస్పాలు కారుతూ , పెదవులపై చిరునవ్వు కదలాడింది.

చేతి వేళ్ళతో అమ్మ చెంపపై సున్నితంగా నిమురుతూ పెదాలపై నవ్వుతూ అమ్మ చెవి వరకు వొంగి sorry అమ్మ అని చిన్నగా చెబుతూ నుదుటిపై పక్కన ముద్దు పెట్టగా , నా వెచ్చటి ఆప్యాయమైన ముద్దుకు అమ్మ కదిలి తన చేతులతో నా చేతిపై మోచేతి వరకు గట్టిగా తాకుతూ నా బేబీ నే అని కళ్ళు తెరిచి చూడగా , చిరునవ్వుతో నేను కనిపించగా నమ్మలేనట్లు తన రెండు కళ్ళను , రెండు చేతులతో తిక్కుకొని చూడగా , చూసిన మరుక్షణమే కళ్లల్లో నుండి కన్నీళ్లు కారుస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ వస్తున్న విరహ దుఃక్కాన్ని ఆపుకుంటూ , బేబీ అని బెడ్ పై లేచి నన్ను గట్టిగా కౌగిలించుకొని నా ముఖం పై ముద్దుల వర్షం కురిపించి ఆనంద బాస్పాలతో నా గుండెలపై వాలిపోయింది.

1 Comment

Comments are closed.