జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 17 50

కొద్దిసేపటి తరువాత ఇంటికి చేరుకొనగా ఇద్దరు కానిస్టేబుల్ లు వచ్చి గేట్ తెరిచి సర్ కు సెల్యూట్ చెయ్యగా , మొదటి నుండి జరిగినదంతా మళ్ళీ అడిగి తెలుసుకుని లోపలికి వెళుతుండగా ముందుగా సెక్యురిటి లక్ష్మన్న ను వెనుక తలకు కొట్టి గేట్ పక్కన కట్టి పడేసారని తెలియగా మొదట ఆయన ఇంటికి వెళ్లి పలకరించి రావాలని ఆనుకొని లోపలికి వెళ్లగా , ఇంటి తలుపును అమ్మను రక్షించేందుకు గూడెం ప్రజలు పగలగొట్టారని తెలియగా, అలాగే ఒక చిన్న పాప రాత్రి ఐటి వెల్తూ చూసి అందరిని పిలుచుకొని రావడం జరిగిందని చెప్పగా , అదే పాప అయ్యి ఉంటుందని పాపను మనసారా గర్వంగా తలుచుకొని లోపలికి వెళ్లగా , గడ్డకట్టిన రక్తపు మరకలు చూసి ఒక్కసారిగా కాళ్ళల్లో చెమ్మ చేరి గుండె తరుక్కుపోసాగింది. దొంగతనం చేసిన ఖరీదైన వస్తువులన్నీ హాల్ లో పది ఉండగా వాటిని కృష్ణ నేను ఎక్కడున్నవి అక్కడ పెట్టి , బెడ్ రూమ్ లోకి వెళ్లి చూడగా డబ్బు , నగల కోసం చెల్లాచెదురుగా చేసి ఉండగా సేఫ్టీ లాకర్ ఉండటం వల్ల దానిని తెరవడానికి ప్రయత్నించి విఫలం చెంది పగలగొట్టదానికి ప్రయత్నించి నట్లుగా లాకర్ చుట్టూ అక్కడక్కడ అనిగిపోయి ఉంది. లాకర్ తెరిచి చూడగా అన్ని బాధారంగా ఉన్నాయి.

అలాగే దేవుని రూమ్ వైపు వెళ్లి విగ్రహాల వెనుక పెట్టిన బాక్స్ ని కూడా టచ్ చేసినట్లుగా లేకపోవడంతో , ఆ పాప తెలివితో ఎంత త్వరగా రియాక్ట్ అయ్యిందో అర్థమయ్యింది. గది బయటకు వచ్చి ఆ రూమ్ కు తాళం వేసాను.అమ్మ పూర్తిగా కోలుకున్న తరువాత గూడెం ప్రజలకు కృతజ్ఞతలు తెలపాలని నిర్ణయించుకొని కిందపడిఉన్న యధాస్థానం లో పెట్టి అరేయ్ కృష్ణ ఇల్లు మొత్తం శుభ్రం చేయడానికి మరియు తలుపును బిగించడానికి మనుషులను చూడమని చెప్పగా , తనకు తెలిసిన పని వాళ్లకు కాల్ చేయసాగాడు.

రక్తపు మరకలు పడిన దగ్గర కింద కూర్చుని బాధతో తాకుతుండగా విశ్వ సర్ వచ్చి ఆ నా దొంగలను కుమ్మాలని ఉందా మహేష్ అని అడుగగా , కుమ్మేయ్యడం కాదు సర్ ఇలా చేసిన వాళ్ళు ఇప్పుడు నాకు కనిపిస్తే ఇప్పుడు వస్తున్న కోపానికి చంపేసినా చంపేస్తాను , కానీ మాకు జరిగింది మరొకరికి జరగకుండా ఉండాలంటే ఆ నా కొడుకులు ఇంకా ఎంత మంది ఉన్నారో తెలుసుకోవడానికైనా ప్రాణాలతో ఉంచి , టార్చర్ పెట్టైనా సరే తెలుసుకొని అందర్నీ పట్టుకొంటే అప్పుడు నన్ను పిలవండి సర్ అందర్నీ కసితీరా కుమ్మేద్దాము అని చెప్పగా , చాలా మంచి సలహా ఇచ్చావు మహేష్ ఈ క్షణం నుండి మొత్తం ఫోర్స్ నంతా ఆ పని మీదనే ఉండేట్లుగా చూసి మొత్తం గాలించేలా చూస్తాను అని చెప్పాడు.

విక్రమ్ సర్ వచ్చి సరే మహేష్ నేను కూడా మధ్యాహ్నం గోవా కు బయలుదేరుతాను , వెళ్లిన వెంటనే ఒకసారి మేడం ను కలిసి నీకు కాల్ చేస్తాను అని చెప్పగా , పైకి లేచి సర్ ను ఒకసారి కౌగిలించుకొని థాంక్స్ ఫర్ everything సర్ అని చెప్పగా , మహేష్ మన మధ్య థాంక్స్ ఎందుకు అని చెప్పి విశ్వ సర్ తో పాటు వెళ్లిపోయారు.

ఇంటిలో చెల్లాచెదురుగా పడినవన్నీ సరిగా పెట్టేసి కారు తాళాలు కృష్ణకు ఇచ్చి పనివాళ్లను పిలుచుకొని వచ్చి దగ్గరుండి ఇల్లంతా శుభ్రం చేయించమని చెప్పి పంపించి , దివ్యక్కకు కాల్ చెయ్యగా అమ్మ , అంటీ స్నానం చేసి హాయిగా పడుకున్నారని చెప్పగా , సరే అని చెప్పి కాల్ కట్ చేసి పాపను ఒకసారి కలుద్దామని పాప ఇంటికి వెళ్లగా ఇంటికి తాళం వేసి ఉండగా పక్కనే తర్కింగ్ లో ఇంటి ముందు నీడలో కూర్చుని ఉన్న ముసలవ్వను అడుగగా , పాపను మరియు చంటి బిడ్డను తీసుకొని పనికి పోయి ఉంటుంది అని ఇక వాళ్ళు రావడం రాత్రికే అని చెప్పగా , అవ్వ వాళ్లకు ఎవ్వరు లేరా అని అడుగగా , ఇప్పుడు లేరు నాయనా పాప వాళ్ళ నాన్న మా గూడెం ప్రజలందరి కోసం ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అణా చేదు వార్తను చెప్పగా , వాళ్ళ గురించి తెలుసుకోవాలన్న కుతూహలం తో అసలు ఏమి జరిగింది అవ్వ అని ఆత్రంగా అడుగగా , అవ్వకు కూడా ఏమి పని లేనందువల్ల ఇలా కూర్చో నాయనా అని అరుగు మీద కూర్చోమని చెప్పి అదో పెద్ద కథ నాయనా అని చెప్పడం మొదలుపెట్టింది.నాకు సరిగ్గా గుర్తులేదు కానీ సుమారు రెండు సంవత్సరాల క్రితం మేము ఈ ఊరికి దూరంగా ఉన్న అడవి కొండల్లో ఉన్న చెంచు తెగవాళ్ళము.

1 Comment

Comments are closed.