జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 17 50

కానీ నిన్ను చూసిన మరుక్షణమే బేబీ నిన్ను ప్రేమగా కౌగిలించుకోకపోతే నా అణువణువు తట్టుకోలేక విరహంతో హృదయం ఆగిపొయ్యినా పోవచ్చు , నా ప్రాణాలు పోతాయని నాకు భయం లేదు కానీ నా శ్వాశ ఆగిపోయేలోపు కొన్నిరోజులయినా నిన్ను ప్రేమగా , సంతోషంగా చేసుకోవాలన్న నా ఏకైక కోరిక , ఆశ తీరకుండా నా మనసు శాంతించదు.

అందుకే పక్కనే వుండి దూరంగా ఉండటానికి బదులు దూరంగా ఉండి నా బేబీ కోసం ఎన్ని రోజులయినా , నెలలయినా , సంవత్సరాలయినా చివరికి యుగాలయినా సంతోషంగా వేచి చూస్తూ నీ మధుర జ్ఞాపకాలతో ఉండిపోతాను , లవ్ యు బేబీ , అమ్మను జాగ్రత్తగా చూసుకో నేను మళ్ళీ కాల్ చేస్తాను .” ఆ మెసేజ్ చూసి మొబైల్ ను గండేకు హత్తుకొని లవ్ యు అమ్మ అని తలుచుకుంటూ మోకాళ్లపై కూలబడిపోయి అమ్మలిద్దరికి ఒకరి గురించి మరొకరికి చెప్పకుండా చాలా పెద్ద తప్పు చేశానని గుండె తరుక్కుపోతుండగా నన్ను నేను తిట్టుకోసాగాను.

రోడ్ పక్కన మోకాళ్లపై కూర్చొని భాధపడుతుండగా కృష్ణ మరియు విక్రమ్ సర్ పరిగెత్తుకుంటూ వచ్చి నా కన్నీటిని చూసి చలించిపోతూ మామా ఏమయ్యిందిరా అని నన్ను పీకి లేపి కౌగిలించుకొని ఓదారుస్తూ హాస్పిటల్ కు పిలుచుకొని వెళ్లగా , లోపలికి వెళుతూ కన్నీళ్లు తుడుచుకుని అమ్మ దగ్గరికి వెళ్లగా అప్పటికే అంకుల్ వచ్చి అంటే పక్కనే ఉండగా , డాక్టర్లు అమ్మ వాళ్ళను పరిశీలిస్తూ ఉండగా లోపల ఒక పక్కగా నిలబడగా , పూర్తిగా పరిశీలించి ఇప్పుడు పూర్తి ఆరోగ్యన్గా ఉన్నారు డిశ్చార్జ్ చేస్తున్నట్లుగా సంతకం పెట్టెయ్యగా నేను అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్లగా , మామా క్యాబ్ ను పిలుచుకొని వస్తాను అని చెప్పి కృష్ణ వెళ్లగా అమ్మ పక్కనే కూర్చుని సున్నితంగా అమ్మ చెయ్యి అందుకొని మరొక చేతిలో ఇందు అమ్మ ఉన్న పేపర్ ను పట్టుకొని బాధతో చూస్తూ ఉండిపోయాను.

15 నిమిషాలలో రెండు క్యాబ్ లను పిలుచుకొని రాగా దివ్యక్క అన్నయ్య అమ్మను కూడా మా ఇంటికే పిలుచుకొని వెళదాము అని చెప్పగా , ఇప్పటికి అదే సరైనది అని , అమ్మను , అంటీని నెమ్మదిగా వీల్ కుర్చీలలో కూర్చోబెట్టుకొని క్యాబ్ వరకు వెళ్లి జాగ్రత్తగా పిలుచుకొని వెళ్లి క్యాబ్ వెనుకామ్మను అంటీని దివ్యక్క మరియు ఇందుమతి గారి సహాయంతో జాగ్రత్తగా కూర్చోబెట్టగా అమ్మపై ఇందుమతి గారు చూపిస్తున్న కేర్ కు చాలా సంతోషం వెయ్యగా అమ్మ పక్కనే కూర్చోమని చెప్పగా , అమ్మ పక్కనే కూర్చుని గాయపడిన చేతిని జాగ్రత్తగాఎక్కడ తగిలించకుండా పట్టుకోగా దివ్యక్క ముందు సీట్ లో కూర్చోగా , నేను మరియు కృష్ణ మరో క్యాబ్ లో , కిషోర్ బావ ఫామిలీ అంతా వాళ్ళ కారులో , విక్రమ్ సర్ మరియు విశ్వ సర్ లు వెనుక జీప్ లో ఇంటి వరకు రాసాగారు.

20 నిమిషాలలో ఇంటికి చేరుకోగా దివ్యక్క అమ్మ వాళ్ళను ఉండమమని చెప్పి నన్ను , కృష్ణ ను ఇంటిలోపలికి పిలుచుకొని వెళ్లి బెడ్ రూమ్ లో మరొక బెడ్ ను వేసి అమ్మను మరియు అంటీ ను ఇందుమతి గారి సహాయంతో లోపలికి నెమ్మదిగా నడిపించుకుంటు పిలుచుకొని వచ్చి బెడ్ పై కూర్చోబెట్టగా , దివ్యక్క అమ్మతో స్నానానికి వేడి నీళ్లు పెడతానని అని బాత్రూం లోకి వెళ్లగా , అమ్మ ముందు మోకాళ్లపై కూర్చొని నా తలను అమ్మ ఒడిలో పెట్టి ఉద్వేగంగా అమ్మ ఇక నుండి నిన్ను వదిలి ఎక్కడికి వెళ్లను అని నేను వెళ్లడం వల్లే ఇదంతా జరిగిందని బాధపడుతూ చెప్పగా , అమ్మ నా తలపై ఒక చేతితో ప్రేమగా నిమురుతూ కన్నయ్య నాకేమి కాలేదు చూడు అని తల ఎత్తి అమ్మ కళ్ళల్లోకి చూడమని నువ్వేమి బాధపడకు , రెండు రోజుల్లో అంతా నయమవుతుంది అని నా కన్నీళ్లను తుడిచి వొంగి నా తలపై ప్రేమగా ముద్దుపెట్టింది.

కొద్దిసేపటి తరువాత దివ్యక్క వచ్చి ఇఫ్దరిని చూసి నా పక్కనే మోకాళ్లపై కూర్చొని నా వీపుపై ప్రేమగా నిమురుతూ అంటీ కు ఏమి కాదు అన్నయ్య మనమంతా ఉన్నాము కదా అని కొద్దిసేపు ఓదార్చి పైకి లేపి ఇందుమతి గారి సహాయంతో అమ్మను స్నానానికి బాత్రూం కు పిలుచుకొని వెళ్తుండగా , దివ్యక్క అమ్మ , అంటీ జాగ్రత్త అని చెప్పి అమ్మ వైపు తిరిగి ఇంటి వరకు వెళ్లి వస్తాను అని చెప్పి కృష్ణ గాడిని పిలుచుకొని విశ్వ సర్ జీప్ లో ఇంటికి వెల్తూ ఉండగా , విక్రమ్ సర్ మహేష్ ఇందు మేడం కనిపించలేదే అని అడుగగా , ఒక్కసారిగా బాధ వెయ్యగా బలవంతంగా ఆపుకొని , ఏదో అర్జంట్ పని ఉందని మెసేజ్ పెట్టి మేడం గోవా వెళ్లిపోయారు అని కష్టంగా చెప్పగా , ఎప్పుడు అని అడుగగా , మొబైల్ తీసి మెసేజ్ వచ్చిన సమయం చూసి చెప్పగా , అయితే ఇప్పటికే ఫ్లైట్ లో సగం దూరం వెళ్లి ఉంటారు అని వెంటనే సర్ తన మొబైల్ తీసి ఎవరికో కాల్ చేసి మేడం వెంటనే ఎయిర్పోర్ట్ కు వెళ్లి ఇందు మేడం వైజాగ్ నుండి ఫ్లైట్ లో వస్తున్నారు , పికప్ చేసుకొని నేను గోవా వచ్చేవరకు మేడం ఇంటి దగ్గర సెక్యూరిటీని పెంచి ఇద్దరు మహిళ కానిస్టేబుల్ లను మేడం దగ్గరే ఉంచామని థాంక్స్ చెప్పి కాల్ కట్ చెయ్యగా , విక్రమ్ సర్ కు థాంక్స్ చెప్పగా , ఆపుతూ మహేష్ నేనీ స్థితిలో ఉన్నానంటే అది మేడం మరియు నీ వల్లే , మీ కోసం ఎంతటి రిస్క్ అయినా తీసుకుంటాను అని చెప్పగా సంతోషం వేసి ,ఇందు అమ్మకు కాల్ చెయ్యగా తగలకపోవడంతో అమ్మ జాగ్రత్త నేను మళ్ళీ కాల్ చేస్తాను అని మెసేజ్ పెడుతుండగా కృష్ణ గాడు మా వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు.

1 Comment

Comments are closed.