హోటల్ లోకి వెళ్లి! రహీంకాకా…. గుడ్ మార్నింగ్… అన్నాడు శంకర్. గుడ్ మార్నింగ్ శంకర్ బేటా. నీకోసమే చుస్తున్నా, ఏంటి ఇంత పొద్దున్నే షాప్ ఓపెన్ చెయ్యమన్నావ్ అన్నాడు రహీంకాకా. చెప్తాగాని మన జిప్ రెడీగా ఉందిగా అన్నాడు శంకర్. ఉమ్ రెడీగా ఉంది, వెనకాల పార్క్ చేశాను అన్నాడు రహీంకాకా. శంకర్ ఆ పాకలోంచి వెనక్కి వెళ్లి చూసాడు అక్కడ చెట్లమధ్యలో కనపడకుండా పార్క్ చేసి ఉంది అల్ట్రేషన్ చేసిన మహీంద్రా జీప్. ఓకే అనుకోని మల్లి హోటల్ లోకి వచ్చాడు శంకర్. బేటా టి గాని కాఫీ గాని కలపమంటావా అన్నాడు రహీంకాకా. వద్దులే కాకా పాలు వేడి వేడిగ ఉన్నైగ, అవే ఇవ్వు అంటూ పక్కనే ఉన్న పెద్ద గ్లాస్ తీసుకొచ్చి ఇచ్చాడు శంకర్. ఆ గ్లాస్ చూసి…. హహహ అని నవ్వుతు… ఇదెందుకురా ఆపక్కన పెద్ద చెంబు ఉంది అది తీసుకురా అన్నాడు కాకా.
అబ్బా ఎందుకలా దిష్టిపెడతావ్ చిన్నపిల్లోడికి… ఒక చెంబుడు పాలు తాగితే నీ సొమ్మేంపోదులే అంటూ లోపలికి వచ్చింది సలీమా. లోపలికొచ్చిన సలీమాని చూసి… పెద్దమ్మా ఏంటి ఇంత పొద్దున్నే నువ్వుకూడా వచ్చావ్ అన్నాడు శంకర్. ఏమోరా నువ్వు ఫోన్ చేసి పొద్దున్నే రమ్మన్నావ్ అని చెప్పి నన్నుకూడా లేపుకొచ్చాడు మీకాక అంటూ దగ్గరకొచ్చి శంకర్ చేతిలో గ్లాస్ తీసి అవతల పడేసి పక్కనే ఉన్న చెంబు తీసుకోని… పొయ్యండి… అంటూ రహీమ్ కాకా ముందు పెట్టింది సలీమా. గ్లాసు పక్కన పడేసిన విసురు చూసి హుమ్… అందరు గారాబం చేసి పందెపుకొడిని మేపినట్టు మెపండి… ఇప్పటికే బాగా బలిసిన దున్నపోతుల తయారయ్యాడు అంటూ పాలు చెంబులో పోసి ఇంకో గిన్నెలోకి తిరగబోస్తూ చల్లారుస్తున్నాడు కాకా. అరే… బిడ్డ ఇంతపొద్దున్నే బయల్దేరి వచ్చాడంటే, కాళీ కడుపుతో ఏమి తినకుండా వచ్చాడని అర్థంకావటంలేదా… అంటూ విసురుగా రహీమ్ చేతిలో చెంబు లాక్కొని… రారా అక్కడ కూర్చుందాం అంటూ హోటల్ బయట ఉన్న చిన్న బెంచి దగ్గరకి వెళ్ళింది సలీమా.
శంకర్ నవ్వుతు… ఏం కాకా… పెద్దమ్మ దెబ్బకి సౌండ్ లేదు హా? అంటూ సలీమా వెనకాలే వెళ్ళాడు. రహీమ్ కాకా చిన్నగా నవ్వుకుంటూ అక్కడున్న సామానులు సర్దుతున్నాడు. సలీమా చెంబులో ఒక వేలు ముంచి పాల చుక్కని తన ముంచేతిమీద వేసుకొని చెక్ చేసింది. ఉమ్ శంకరా… గోరువెచ్చగా ఉన్నాయ్… చెంబు దించకుండా మొత్తం తాగెయ్యాల అంటూ పాల చెంబు శంకర్ కి ఇచ్చింది. శంకర్ రెండు చేతులతో చెంబు పైకెత్తి నోరు పెద్దగా తెరిచి చెంబులోంచి ధారగా పడుతున్న పాలని గుటకలు వేస్తూ… చెంబు కిందకి దించకుండా మొత్తం తాగేసి… చెంబు సలీమా చేతిలో పెట్టి ఊఊఊహ్…. అంటూ ఒక్కసారి ఊపిరి తీసుకొని వదలటంతో శంకర్ చాతి ఫైవ్ సెంటీమీటర్స్ పైకిలేచి దిగింది. ఊఁ హ్మ్… అంటూ ఒక్కసారి వళ్ళు విరుకున్నాడు శంకర్. సలీమా బెంచ్ మీదనుంచి లేచి కాళీ చెంబుతో శంకర్ చుట్టూ మూడుసార్లు తిప్పి దిష్టితీసి పక్కన పెట్టి శంకర్ పక్కన కూర్చుంది.
అంతలో రహీమ్ కాకా ఒక చిన్న స్టూల్ తెచ్చుకొని శంకర్ ఎదురుగా కూర్చొని… చెప్పు బేటా ఏంటి సంగతి అన్నాడు. సలీమా చీర కొంగు తీసుకొని మూతి తుడుచుకుంటూ… ఏంలేదు కాకా కిషోర్ బాబు వస్తున్నాడు ఊరినుంచి రిసీవ్ చేసుకోటానికి వెళ్తున్న… ఎందుకైనా మంచిది మనవాళ్ళని ఒక నలుగుర్ని హోటల్ లో కూర్చుపెట్టు ఏదన్న అవసరమైతే ఫోన్ చేస్తా అప్పుడు ఆ జీప్ తీసుకొని రమ్మని చెప్పు అన్నాడు శంకర్. ఓహ్ అవునా…, అయినా ఇంకా శత్రుశేషం ఉందంటావా? చాలా కాలంనుంచి గొడవలు ఏమీలేకుండా అంత మంచిగానే ఉంది కదా అన్నాడు కాకా. అవుననుకో అయినా మన జాగర్తలో మనం ఉండాలి కదా, అవతలివాళ్ళ ఆలోచనలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు అన్నాడు శంకర్.
ఉమ్ అది నిజమే అన్నాడు రహీమ్ కాకా. శంకర్ జేబులోంచి వందరూపాయల కట్ట తీసి సలీమా కి ఇచ్చి… పెద్దమ్మా ఇదిగో ఇదిచ్చి రహీమ్ కాకా కి బోణి కొట్టు, పొద్దున్నే చెంబుడు పాలు తాగాం కదా అన్నాడు. రేయ్… పదివేలా…! ఎందుకురా ఇంత డబ్బు అంది సలీమా ఆశ్చర్యపోతూ… రిహానా ని కానుపుకి తీసుకురావాలని చెప్పావ్ కదా! ఖర్చులకి నీదగ్గర ఈ డబ్బు ఉంచు అంటూ… రహీమ్ కాక వైపు చూసి… డబ్బులకి కక్కుర్తిపడి దాన్ని బుస్సులో తీసుకురాకు, మన జీప్ తీసుకెళ్ళు, ఒక వేళ జిప్ కాళిగా లేకపోతే బాడిక్కి ఏదన్నా కారు మాట్లాడుకొని తీసుకురా అన్నాడు శంకర్. ఉమ్… నాదేముందిరా… అంతా మీ పెద్దమ్మ పెత్తనమేగా… అన్నాడు రహీంకాక. సలీమా వైపు తిరిగి పెద్దమ్మా …
ఉమ్… నీకు చెప్పేదేముందిలే, నీఎక్సపీరియన్సులో ఎంతమందికి పురుళ్ళుపోసావ్, మా అమ్మకి పురుడుపోసి నన్ను బయటకి తీసింది కూడా నువ్వేగా హహ… జాగర్తగా చూసుకో అన్నాడు శంకర్. ఒక్కసారిగా పాతరోజులు గుర్తుకు రావటంతో కళ్ళల్లో నీళ్లుతిరిగాయ్ సలీమాకి. శంకర్ సలీమా వైపు చూసి… హోల్ హోల్ హోల్డెయ్… హోల్డెయ్… ఆపేయ్ ఆపేయ్… అంటూ సలీమా బుజం చుట్టూ చెయ్యివేసి దగ్గరకి హత్తుకున్నాడు శంకర్. సలీమా శంకర్ బుజం మీద తలపెట్టి తన చేత్తో శంకర్ వీపుమీద నిమిరింది. ఉమ్… పెద్దమ్మా… పొద్దుగాల పొద్దుగాల ఏడుపు మొదలెట్టకు… ఏం.ఎల్.ఏ గారు వస్తున్నారు, ఆయనతో మాట్లాడి టౌన్ కి వెళ్తాను మీరు లోపలికెళ్ళండి అన్నాడు శంకర్. సలీమా కొంగుతో కళ్ళు తుడుచుకొని… సరే జాగర్త… పెళ్లి పనులు మొదలవ్వగానే కబురుచెయ్ అని శంకర్ తలనిమిరి లోపలికెళ్లింది. సరే బేటా మనవాళ్ళకి ఫోన్ చేస్తాను, తెల్లారగానే ఇక్కడికి రమ్మని చెప్తా అని లోపలికెళ్ళాడు కాకా.
