సార్: సరే సరే, ఇంకోసారి repeat అవ్తే బాగోదు చెప్తున్న. శివ answer చెప్పు.
” Mass of electron = 9.109387 x 10 to the power of ? , చెప్పు ”
శివ చెప్పకుండా సైలెంట్ గా ఉన్నాడు.
సార్: తెలీదు, కానీ topper, బట్టి పట్టి చదువు తే ఇలాగే ఉంటుంది అన్ని అర్థం చేసుకోవాలి.
సార్ అలా అంటే అందరూ నవ్వారు.
వంశీ అది చూసి కార్తిక్ తో,
వంశీ: వాడికి తెలేదేమో, వీడు top ఎలా వచ్చాడో? (అని నవ్వుతున్నాడు)
ఇలా వంశీ కార్తిక్ తో మాట్లాడడం చూసి సార్ వంశీ ని అడిగాడు.
సార్: ఎంటి నవ్వుతున్నావ్, నీకు తెల్సా మరి చెప్పు.
వంశీ కూడా మౌనంగా నిలబడ్డాడు.
సార్: నీకు కూడా తెలీదు మరి ఎందుకు నవ్వుతున్నావ్, ఇడియట్. సరే ఎవరికైనా తెలిస్తే చెప్పండి?
శ్వేత (blue dress) వెనక శివ ని చూసి, నవ్వుతూ, నిలబడి,
శ్వేత: సార్ అది 10 to the power 31 సార్.
సాయి: ఇదెంట్రా నన్ను చూసి నవ్వుతుంది (అని మనీష్ తో అన్నాడు)
మనీష్: నిన్ను కాదు శివ ని.
సార్: లేదు wrong చెప్పావు.
శ్వేత తప్పు చెప్పడం సాయి కి నవ్విచ్చి నవ్వాడు.
సార్: ఇంకా ఎవరైనా ఉన్నారా?
సాయి: నేను చెప్తా సార్.
సార్: చెప్పు.
సాయి: mass of electron = 9.1097387 x 10 to the power of minus 31 సార్.
సార్: good correct చెప్పావు. శివ 10th class ఎవడైనా pass అవ్తాడు, inter లో ఎక్కువ marks తెచ్చుకుంటేనేfuture బాగుంటది, ఇలా class లో నిద్ర పోకు.
శివ ని అలా అంటే శ్వేత వంశీ నవ్వారు.
సార్: సాయి sit.
సాయి: చి శివ పరువు పోయింది నీది.
శివ: ఆ తొక్కలే class విను.
సాయంత్రం, శివ సాయి ఉరు వెళ్ళడానికి బస్ stop లో ఉండగా, శ్వేత ని వాళ్ళ నాన్న వచ్చి bike మీదతీసుకెళ్తూఉంటే, వెనక కూర్చోని శివ నే చూస్తూ వెళ్తుంది.
శివ అది చూసి పట్టించుకోకుండా bus కోసం అటు వైపు చూసాడు.
సాయి శివ మనీష్ వీళ్ళు ముగ్గురు మంచి స్నేహితులు అయ్యారు. Class అల్లరి చెయ్యాలన్న, వీళ్ళే బాగాచదవాలిఅన్నా వీళ్ళే.
అలా first year లో, class ఎలాగో అనుకున్నట్టే శివ top వచ్చాడు, ఆ శ్వేత second వచ్చింది, తర్వాతసాయి, మనీష్.
ఇక్కడ విచిత్రం ఏంటి అంటే అసలు class లో, జోకులు వేస్తూ సాయి, అమ్మాయిలతో మాట్లాడుతూ మనీష్, ఎవర్నిపట్టించుకోకుండా ఎదో పరధ్యానం లో ఉండే శివ. వీళ్ళ వల్ల class అంతా disturb అయ్యేది, కానీ వీళ్ళేబాగాచదివేవారు.
ప్రతీ రోజు ఎదో ఒకటి చేసి class మొత్తం వీళ్ళ గురించి మాట్లాడుకునేలా చేస్తారు.
ఇది వంశీ, కార్తిక్, దీపక్ లకి అస్సలు నచ్చక పోయేది.
శివ, సాయి, మనీష్ ఒక gang, వంశీ, కార్తిక్, దీపక్ ఒక gang లా మిగతా వాళ్ళు చూసేవారు.
2nd year కి వచ్చారు.
యధా విదిగా కాలం గడుస్తుంది.
శ్వేత శివ ని చూడడం, మనీష్ శ్వేతని చూడడం. సాయి చదువుకోవడం మామూలే.
ఒక రోజు, దీపక్ cigarettes డబ్బాలు lunch time లో శివ bag లో పెట్టాడు.
మధ్యాహ్నం class లో,
దీపక్: మేడం cigarette వాసన వస్తుంది, ఎవరో class లోకి cigarette తెచ్చుకున్నారు.
దీపక్ కి తోడుగా కార్తిక్, ” అవును మేడం ఇక్కడ వాసన వస్తుంది “.
టీచర్ కిటికీ బయటకు చూసింది ఎవరూ లేరు మరి వాసన ఎక్కడినుంచి వస్తుంది అని చూస్తే,
శివ కాలి దగ్గర సగం కాల్చి, ఆర్పీ పడేసిన ముక్క కనిపించింది.
ఒక్కసారిగా శివ భయపడ్డాడు.
శివ: లేదు మేడం నాకేం తెలీదు.
టీచర్: అందరూ మీ bags bench మీద పెట్టండి నేను check చేస్తాను.
అందరి bags check చేస్తూ ఉంది, అంతే శివ bag లో దొరికేసాయి.
శివ: నాకేం తెలీదు, ఇవి ఎలా వచ్చాయో నాకు తెలీదు…
టీచర్: ఇక్కడ కాదు principal కి చెప్తువు రా నువ్వు ముందు.
Principal రూం కీ వెళ్ళాక,
టీచర్: సార్ ఈ శివ class లో cigarette తాగి, పడేసి ఇంకా ఏమీ తెలీదు, అని భుకాయిస్తున్నాడు.
Principal: ఏంటి శివ ఇది, నువ్వు చదువుకుంటావు అనుకున్న కానీ, ఇలా చెడు అలవాటుకు ఏంటి ఇది?
శివ: సార్ నిజంగా నాకు ఏం తెలీదు, నాకు అలవాటు లేదు. Please మేడం నిజంగా నాకు తెలీదు.
Principal కోపగించుకొని,
Principal: get out, నువ్వు రేపు మీ parents ని తీసుకొని రా లేదంటే college కి రాకు.
శివ ఏం మాట్లాడకుండా సరే అని చెప్పి class కి వెళ్లి,
శివ: సాయి, నేను వెళ్తున్న, సంతు అన్న దగ్గర ఉంటా వచ్చాక అక్కడికి రా.
సాయి: టీచర్ వాడికి ఆ అలవాటు లేదు. ఎవరో కావాలనే ఇలా చేశారు.
శివ వెళ్ళిపోయాడు.
టీచర్: సాయి వాడిని వెనకేసుకు రాకు, నాకు ఇప్పుడు నీ మీద కూడా అనుమానం వస్తుంది.
శివ ఇంటికి, వెళ్లి జరిగింది ఇంట్లో చెప్పాడు.
వెంకన్న: నిజమా?
శివ: ఏంటి నాన్న నువ్వు కూడా, నేను అలా ఎందుకు చేస్తాను, ఎక్కడో ఎదో తప్పు జరిగింది.
ఇక వెంకన్న principal తో మాట్లాడి ఎలాగోలా సర్ది చెప్పాడు.
3 రోజుల తరువాత,
సాయి college కి రాలేదు, శివ సాయంత్రం bus stop వైపు వెళ్తున్నాడు.
దీపక్, వంశీ ఇద్దరూ శివ కి అడ్డం పడి,
శివ ని కొట్టారు,
శివ: అరే ఎందుకు కొడ్తున్నారు నన్ను, ఆ…
కానీ వాళ్ళు శివ ని ఎడాపెడా కొట్టి, వెళ్ళిపోయారు.
శివ దవడ కి దెబ్బ గట్టిగా తాకి రక్తం వస్తుంది.
అప్పుడే అటు నుంచి శ్వేత వెళ్తూ, వాళ్ళ నాన్నని ఆగమని చెప్పింది,
శ్వేత: నాన ఆగు, అతను మా class ఏ ఎవరో కొట్టి పోతున్నారు అయ్యో.
శ్వేత నాన్న: వెదవలు, చదువు సంధ్యా లేదు, గొడవలు.
శ్వేత: అయ్యో నాన్న తను శివ బాగా చదువుతాడు నికు తెలీదు.
శ్వేత శివ దగ్గరకి వచ్చి,
శ్వేత: అయ్యో శివ ఏమైంది, వాడు దీపక్ కదా నిన్ను ఎందుకు కొట్టాడు.
శివ: ఆ ఏమో నాకు తెలీదు.
శ్వేత: పద మా ఇంటికి వెళ్దాం నీకు first aid చేస్తాను, మా అమ్మ doctor.
శివ: వద్దు శ్వేత ఇదేం కాదులే నేను మెల్లిగా ఇంటికి వెళ్తాను.
శ్వేత: ఏంటీ రక్తం వస్తుంది నికు.
అలా శ్వేత శివ ని పట్టుకుంటే, అప్పుడే శివ ఎదో ఫీడ్స్ వచ్చినట్టు, గట్టిగా ఊపిరి పీలుస్తూ, గిలగిలకొట్టుకుంటున్నాడు.
శ్వేత ఇంకా వాళ్ళ నాన్న, ఇద్దరు బయపడి పోయారు.
శ్వేత నాన్న: అయ్యో అయ్యో బాబు, ఏమైంది..
శివ తల బాగా నొప్పి పెడుతుంది,
శివ: ఆ uncle కొన్ని water mm.
ఇక శివ ని bike ఎక్కించుకుని వాళ్ళ ఇంటి తీసుకెళ్లారు.
శివ కి first aid చేసింది శ్వేత వాళ్ళ అమ్మ.
శివ: థాంక్స్ ఆంటీ.
శివ శ్వేత, శ్వేత రూం లో ఉన్నారు.
Aunty బయటకి వెళ్ళాక,
శివ: శ్వేత నువ్వు please ఈ విషయం ఎవరికీ చెప్పకు.
శ్వేత: ఎందుకు శివ, ఆ దీపక్ మీద complaint చేద్దాం, అసలు నువ్వు ఏం చేసావు అని ఇలా కొట్టారు నిన్ను.
శివ శ్వేత చెయ్యి పట్టుకుని,
శివ: please వద్దు అయ్యిందేదో అయిపోయింది.
శ్వేత కి శివ అంటే ఇష్టం అని తెలిసిందే, వయసు ఉన్న ఆడపిల్ల శివ అలా తన చెయ్యి పట్టుకోగానే, ఎదోతెలియనిభావం.