ప్రేమ కాటులు Part 2 67

తను శివ అరచేతిని తన రెండు అరచేతులతో పట్టుకుని, శివ కళ్ళలోకి ఇష్టంగా చూస్తుంది,

శివ కి ఆ భావం అర్థం అయ్యింది. సైలెంట్ గా ఉన్నాడు.

శ్వేత వాళ్ల అమ్మ ఇంకా ఇటు రావట్లేదు, నాన్న పని మీద బయటకు వెళ్లాడు, అని డోర్ వేసి వచ్చి శివపక్కనకూర్చుంది,

మళ్ళీ శివ చేతులు పట్టుకుంది,

శ్వేత: శివ నువ్వంటే నాకు ఇష్టం రా.

శివ: లేదు శ్వేత, నువ్వు నా మీద ఇలాంటివి పెట్టుకోకు.

శ్వేత శివ గదవ పట్టుకుని, చూస్తూ, దగ్గరికి జరుగుతూ,

శ్వేత: శివ…. నేను నిన్ను ఆ రోజు సార్ question అడిగిన రోజునుంచి చూస్తున్న. నువ్వు బాగుంటావు…

అని శివ కి ముద్దు పెట్టబోతు ఉంటే శివ ఇద్దరి పెదాల మధ్య వెలు పెట్టి ఆపాడు,

శివ ఇక లేచి నిల్చొని, శివ: శ్వేత చుడు నీకు నేను నచ్చాను ఏమో కానీ నాకు ఆ ఉద్దేశం లేదు.

శ్వేత: శివ please

శివ చెయ్యి తీసుకొని తన నడుము మీద వేసుకొని,

శ్వేత: నీకు నేను ఇష్టమే కదా, class లో నన్నే చూస్తావు నువ్వు నాకు తెలుసు.

శివ శ్వేత ని వదిలించుకుని bye చెప్పి వెళ్ళిపోయాడు.

2 రోజుల తర్వాత,

దీపా: ఎంటీ ముద్దు పెట్టడానికి చూసావా?

శ్వేత: అవునే కానీ ఆపేసాడు. అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు.

దీపా: అవును ఎవరు కొట్టారే శివని?

శ్వేత: ఏమో నే నాకు చెప్పలేదు. (శివ కి మాటిచ్చింది కదా చెప్పను అని)

దీపా: శివ మంచొడే, అందుకే ఇలాంటివి నచ్చవేమో.

శ్వేత: హెయ్ వాడికి దగ్గరవాలి అంటే ఏం చెయ్యాలి ఏదైనా idea చెప్పవా?

దీపా: next week నీ birthday ఉంది కదా మీ ఇంటికి రమ్మనూ.

శ్వేత: హా next?

దీపా: చెప్పవే తనకు నువ్వేం అనుకుంటున్నావు అని.

శ్వేత: మొన్న కూడా అదే గా చేసింది?

దీపా: పిచ్చిదాన మొన్న అసలు ఆ time లో ఎవరైనా అలా చేస్తారా, birthday కి పిలిచి మళ్ళీ ప్రశాంతంగాచెప్పు.

వీళ్ళిద్దరూ మాట్లాడుకునేది సాయి విని,

సాయి: శ్వేత నువ్వు శివ ని మర్చిపో, శివ నిన్ను ఎప్పటికీ ఇష్ట పడడు.

శ్వేత: ఎందుకు?

సాయి: ఎందుకు అంటే…… అలా ఇష్టపడడు అంతే.

దీపా: ఏయ్ సాయి, అసలు నీకెందుకు, చాటుగా మా మాటలు వింటున్నావు.

సాయి: నేనేం వినట్లేదు, మీరే నాకు వినిపించేలా మాట్లాడుతున్నారు.

దీపా: ముందు శివ అసలు వీడితో ఉంటే చేడిపోయెలా ఉన్నాడు.

సాయి: సరే మీ ఇష్టం. నేను చెప్పాల్సింది చెప్పాను.

అని వెళ్ళిపోయాక,

దీపా: శివ ని పిలిస్తే వీడు కూడా వస్తాడు, వీడు వస్తే ఆ మనీష్.

శ్వేత: తెల్సు ఒకపని చేద్దాం మనం కూడా వీళ్ళ gang లో చేరిపోధాం.

దీపా: ఆ సాయి గాడు ఉంటే నేను ఉండను.

శ్వేత: ఎందుకు?

దీపా: వాడు నన్ను అదోలా చూస్తాడు.

శ్వేత: ఏం కాదు రావే పోయి వాళ్ళని కలుద్దాం.

అని ఇద్దరు శివ వాళ్ళ దగ్గరకి వెళ్లారు.

శ్వేత: శివ మమ్మల్ని కూడా మీతో చేర్చుకొరా?

సాయి: అంటే?

శ్వేత: అదే మనం friends గా ఉందాం.

సాయి దీపాని చూస్తూ,

సాయి: ok తప్పకుండా.

దీపా కోపంగా చూస్తు వెళ్ళిపోతుంది,

శ్వేత: ఆగవే

దీపా: వాడుంటే నాకు నచ్చదే.

శివ: ఏయ్ ఎంది ఇక్కడేమైన movie shooting ఐటుందా, పొండి gang అట వాడు ఉంటే ఇది ఉండదట. శ్వేతనువ్వెందుకు వచావో నాకు తెల్సు, పెద్దమనిషి కథలు పడకు. చదువుకో పో.

శ్వేత అంటే ఇష్టం ఉన్నా మనీష్,

మనీష్: అరే ఉండని రా. అందరం కలిసి మాట్లాడుకోవచ్చు.

సాయి దీపాకి మద్దతు ఇస్తున్నాడు, మనీష్ శ్వేత కి, అది గమనించి,

శివ: మీ ఇష్టం రా. కానీ నన్ను disturb చేస్తే అందర్నీ వదిలేస్త మీరెవరో నేనెవరో.

అని వెళ్ళిపోయాడు.

శ్వేత: సాయి next week Saturday నా birthday మీరు ముగ్గురు రావాలి, (అని చెప్పి శివ వెంట వెళ్తుంది)

మనీష్ అది చూసి jealous feel అయ్యాడు.

సాయి: దీపా నేను చెప్పిన వినలేదు. వాడు రాడు ఇలాంటి వాటికి.

దీపా: కానీ పిలిచింది కదా అని నువ్వు మాత్రం రాకు. (అని చిరాకుగా చూస్తుంది)

సాయి: ఏయ్ ఒకసారి బావ అనవే…

దీపా: no way. నువ్వంటే అస్సలు ఇష్టం లేదు నాకు.

సాయి: సరే కానీ ఒకసారి పిలువు please.

దీపా: ఏహే శ్వేత ఆగవే…. (అని వెళ్ళిపొనది).

శ్వేత birthday night,

ఆ రోజు శ్వేత cake cut చేసాక, అందరూ వాళ్ళింట్లో భోజనం చేసారు.

శివ: అరె శ్వేత వాళ్ళ parents చాలా better రా, ఈ కాలంలో అబ్బాయిలు అమ్మాయిల తో మాట్లాడితేనేతిడతారుparents కానీ వీళ్ళు మనం ముగ్గుర్నీ ఇలా party కి కూడా పిలిచారు.

మనీష్: అవును రా నిజమే.

కాసేపటికి,

దీపా: సరే నేను వెళ్తాను.

సాయి: నేను ఇంటి దాకా వస్తా పదా.

శివ: ఆగురా నేను వస్తున్న.

సాయి: నువ్ పోయి bus stand లో ఆగు, నేను దీపా ని ఇంటిదాకా పోయి వస్తా

మనీష్: సరే శ్వేత bye (అని ముగ్గురు వెళ్లారు)