శివ: శ్వేత bye. Uncle వెల్లోస్తాను.
శ్వేత: శివ నీకు ఒకటి చూపించాలి.
శివ: ఏంటి?
శ్వేత చెయ్యి పట్టుకొని శివని తన రూం కీ తీసుకెళ్ళి, డోర్ వేసింది.
శివ: ఏంటి ఏదైనా రహస్యమా?
శ్వేత శివ కి దగ్గరగా వచ్చి,
శ్వేత: నేను చెప్పిన దాని గూర్చి ఏం ఆలోచించావు?
శివ: ఆరోజే చెప్పాను కదా, ఇందుకే పిలిచావ నన్ను, జరుగు నేను పోతా.
శ్వేత: ఆగు శివ
శివ ఆగాడు,
శ్వేత: ఒకసారి ఆలోచించు.
శివ: చూడు నీకు నా మీద అట్రాక్షన్ అంతే, ఇంకా ఏం లేదు. పిచ్చి పిచ్చిగా చెయ్యకు, నాకు కోపం తెప్పించకు. అసలు నువ్ నన్ను ఇందుకే పిలిచావు అని నాకు తెల్సు. ఇంకోసారి చేస్తే మీ parents కి చెప్తా.
శ్వేత శివ కి దూరంగా జరిగింది.
శివ చిరాకు గా వెళ్ళిపోయాడు.
అక్కడ దీపా వాళ్ళ ఇంటి దగ్గర,
దీపా నాన్న, చంద్ర మోహన్ దీపా సాయి వచ్చింది చూసి,
చంద్రమోహన్: అరె సాయి, నువ్వు కూడా వచ్చావా, థాంక్స్ రా, అది చీకటి అయ్యింది ఇంటికి ఎలావస్తుందోఅనుకున్న.
సాయి: పర్లేదు మావయ్య, సరే నేను వెళ్తాను, మళ్ళీ బస్సులు ఉండవు.
సాయి వెళ్ళిపోయాడు.
చంద్రమోహన్ దీపా ని అడిగాడు,
చంద్రమోహన్: ఏంటి బావా నచ్చాడ?
దీపా: అదేం లేదు నాన్న, శ్వేత రమ్మంటే వచ్చాడు, నాతో ఇక్కడిదాకా వచ్చాడు. (అని సిగ్గుపడుతూచెప్పుకుంటూలోపలికి వెళ్ళింది).
పార్వతి ఇంటర్ 2nd year లో,
శివ (ఈ శివ వేరు), సోమేష్ మాట్లాడుకుంటూ ఉన్నారు.
పార్వతి అటు వైపు వస్తుంది చూసి, శివ కంగారు పడుతున్నాడు.
సోమేష్: రేయ్ చెప్పురా తనకి నీ లవ్ విషయం.
శివ: భయమేస్తుంది రా.
సోమేష్: అరేయ్ మరి తనకి ఎలా తెలుస్తుంది రా నువ్ లవ్ చేస్తున్నావ్ అని పో చెప్పు.
శివ: వద్దురా కొడుతుంది ఏమో రా? (భయంగా పార్వతి వైపు చూస్తున్నాడు)
పార్వతి శివ ని చూసి ” వీడెంటి నన్నే చూస్తున్నాడు ” అని శివ నే చూస్తుంది కానీ పట్టించుకోకుండా వెళ్తుంది.
శివ: పార్….. పార్వతి…. (అని పిలిచాడు)
పార్వతి పిలిచాడు గా అని దగ్గరకి వచ్చింది కానీ వయసులో ఉన్న ఆడపిల్ల, మగవాళ్ళతో మాట్లాడం కదాఇబ్బందిపడుతుంది.
శివ: నికు ఒకటి చెప్పాలి…
పార్వతి తల కిందకు చూస్తూ, కాస్త వినయంతో, ఏంటి అన్నట్టు చూస్తుంది.
శివ: i… I love you పార్వతి… (అని మనసులో మాట చెప్పాడు)
పార్వతి మనసులో ” ఇదేం సమస్యా నాకు, వాడే అనుకుంటే ఇప్పుడు వీడూ కూడా ” అనుకుంది.
చిరాకు పడింది.
పార్వతి: హెయ్ అసలు నువ్వు ఎవరు కూడా నాకు తెలీదు, మళ్ళీ నాకు ఇలాంటివి చెప్పి విసిగించకు.
శివ: కానీ…. (అని ఎదో చెప్పేలోపు పార్వతి వెళ్ళిపోయింది)
కానీ ఒకసారి ఆగి మళ్ళీ దగ్గరకి వచ్చింది,
పార్వతి: ఎందుకు నన్ను లవ్ చేస్తున్నావ్ ? (అని ఈసారి కాస్త ధైర్యంగా అడిగింది)
శివ: అదే నువ్ చాలా బాగుంటావు, ఇంకా మనం పెళ్లి చేసుకుంటే శివ పార్వతుల లా ఉంటం కదా.
పార్వతికి మండింది,
పార్వతి: హెయ్ పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు, చదువుకో, సరేనా. (అని తిట్టి వెళ్ళిపోయింది)
పార్వతి ఇంటికి వెళ్ళాక,
రాత్రి పడుకునే ముందు, ఇలా ఆలోచిస్తుంది, ” అసలు ఈ శివ గోల ఏంటి దేవుడా నా జీవితంలో, అప్పుడువాడుఇప్పుడు వీడు, అసలు మా parents నాకు పార్వతి అని పెరెందుకు పెట్టారో ఏమో. శివ శివ అనిముగ్గురు వెంటపడ్తునారు. ఆ ఎడ్డి శివ గాడేమో, చదువుకుంటూ అది చేస్తా ఏమో అన్నాడు. అసలు వాడునిజంగానే చదువుతాడా, 10th లో top వచ్చింది వాడేనా ” అని అనుకుంది.
ఇక నిద్రలోకి జారుకుంది.
—————————————————————————-
Intermediate అయిపోయింది.
శివ కి IIT లో సీట్ వచ్చింది.
శివ: నాన్న నేను Physics graduation చేద్దాం అనుకుంటున్నాను.
వెంకన్న: మనకు ఐఐటీలు వద్దు, నువ్వు ఇక్కడే చెయ్.
శివ: ఎందుకు?
వెంకన్న: ఎందుకు అవన్నీ వద్దు, ఇక్కడే చెయ్యి ఇంటర్ లో లాగే రోజు bus కి పోయి bus కు రా.
శివ: ఎందుకు నాన్న నేను ఇంత బాగా చదువుకున్న, ఐఐటీలో సీట్ వచ్చింది నాన్న నాకు, కానీ నువ్వుఇలాఅంటావు ఎంటి?
శివ ” ఏది ఏమైనా సరే, నేను మాత్రం నాన్న ఒప్పించాలి ” అని అనుకుంటూ వెంకన్న ని చూస్తున్నాడూ.
వెంకన్న: వద్దు శివ నువ్వు మా నుంచి దూరంగా ఉండడం మాకు ఇష్టం లేదు రా.
శివ ఏడవడం మొదలు పెట్టాడు,
శివ: నన్ను ఏ పని చెయ్యనివ్వరు, నాకు ఐఐటీలో చదువుకోవాలి అని ఉంది, please నాన్న, నేను ఒక సైంటిస్ట్నిఅవ్తాను.
వెంకన్న: చెప్పేది విను శివ, నువ్వు మాతోనే ఉండాలి. అంతే.
శివ: నాన్న ….. (అని గట్టిగా అరిచాడు)
వెంకన్న: ఏంట్రా ఆ…? (అని కోపంగా చూసాడు)
శివ: నాకు తెల్సు మీరు ఎందుకు వద్దంటున్నారు అని. నాకు ఇంకా తెలీదు అనుకోకండి. నాకు అన్ని తెల్సునాన్న, నేను ఇప్పుడు చిన్న పిల్లాడిని కాదు.
వెంకన్న: తెల్సు అయితే అలాగే ఉండు. నీ జీవితం ఇంటికే అంకితం తప్పదు. ఇంట్లో ఉండి మనవ్యాపారాలుచూస్కో.
శివ: నాకు ఏం కాదు నాన్న please.
వెంకన్న వినిపించుకోకుండా ఇంట్లో నుంచి బయటకి వెళ్ళిపోయాడు.
ఆ రోజంతా శివ తన గదిలో ఏడుస్తూ ఉన్నాడు.
లక్ష్మి భోజనం తీసుకొచ్చి,
లక్ష్మి: శివ తిను రా.
శివ: నాకు వద్దు, పో.
లక్ష్మి: నాన్న నా మాట వినురా, నీకేమైనా అయితే మేము ఏం కావాలి రా. మాకు నువ్వు నీకు మేముతప్పఎవరున్నారు రా.
శివ: కానీ అమ్మ నాకు ఇష్టమైనది నేను చెయ్యలేకపోతే ఇక ఎందుకమ్మా నేను ఇంత చదువుకొని.
లక్ష్మి: తిను రా, అన్నం చాల్లారుతుంది. (అని శివ మొహం పట్టుకుని అడిగింది)
శివ: ఊహు నేను తినను.
లక్ష్మి: సరే నేను తినిపిస్తా, ఆ ఆను (అని ముద్ద కలిపి పెట్టింది)
