శ్రీపాధ గారు: చగ్గగా ఉంది అమ్మ, నీ కళ్ళ లాగా, అందం, ధైర్యం, దృడ విశ్వాసం అని అర్దం వస్తుంది.
పార్వతి సరేనా అన్నట్టు తల్లితండ్రుల వైపు చూసింది.
ఇక పేరు మారింది.
పార్వతి ఇప్పుడు కాజల్.
కాజల్ డిగ్రీ హిస్టరీ లో జాయిన్ అయ్యింది, సాయి, దీపా చదువుతున్న కాలేజ్ లోనే.
మొదటి రోజు, కాజల్ అలా కాలేజ్ ప్రాంగణం లోకి వస్తుంది.
కాజల్ తెల్ల చుడీదార్ వేసుకొని, కురులు నున్నగా దువ్వుకుని, బాగ్ వేసుకొని, పెదలాలో చిన్న సిగ్గు, కళ్ళలోపొగరు, చురుకుతనం, తేజస్సు గల మొహం. అందగత్తెను అన్న బలుపుతో నడక, చదువుల సరస్వతిఅన్ననమ్మకం కలిగిన మాట. ఎవరితో అసలు పని లేదు, వచ్చామా చదివామ వెళ్ళమా అన్నట్టు ఉండాలి అనిfix అయ్యింది.
కృష్ణ అలా అటూ ఇటూగా చూస్తూ ఒక్కసారి చూపు స్తంభించింది, మనసులో ” ఎవరు ఇది, సినిమాహీరోయిన్ మాదిరి ఉంది, ” అనుకున్నాడు
కాజల్ ఎవ్వరినీ పట్టించుకోకుండా వెళ్తుంది.
దీపా కాజల్ ని చూసి, ” దీని జుట్టు ఎంటి అంత పొడవు, ఏం వాడుతుంది అసలు, చి నా జుట్టు దాన్లోసగంలేదు ” అని గులుక్కుంది.
అలాగే బిగుసుకుపోయి, చూస్తుంది. సాయి అటు వైపు ఉన్నాడు. కాజల్ సాయి కి వెనక వైపు ఉంది.
దీపా అలా బిగుసుకుపోవడం చూసి, దీపా ని కుదుపుతూ,
సాయి: ఓయ్ ఏమైంది?
దీపా: ఏం లేదు ఆ అమ్మాయి.
సాయి: ఆ అమ్మాయి ఎవరూ?
అనుకుంటూ వెనక్కి తిరిగాడు,
అప్పుడు సాయి కాజల్ ని వెనక నుంచి చూస్తూ, ” ఆ అమ్మాయి ఎన్టీ? ” అని అడిగాడు.
దీపా: ఎం లేదు లే. జడ పొడుగ్గా ఉంది.
సాయి: సరే పద క్లాస్ కి టైం అవ్తుంది.
సాయి కి ఎందుకో మరోసారి ఆ అమ్మాయిని చూడాలి అనిపించింది. చూసాడు.
సాయి ” ఏంటి ఈ అమ్మాయి, ” అనుకున్నాడు.
కృష్ణ కాజల్ వెనకే కుక్కలాగా క్లాస్ కి వెళ్ళాడు. ఇద్దరూ ఒకే క్లాస్. కృష్ణ తన వెనక రావడం కాజల్ గమనించింది.
ఇక ఆ రోజు గడిచింది, కృష మాత్రం రోజంతా కాజల్ ని చూస్తూ ఉండిపోయాడు. వాడే కాదు ఆ రోజు ఆ క్లాస్లోమగాళ్ల పరిస్తిన అంతా వేరే లోకంలో ఉంది.
1 year గడిచింది.
కాజల్ డిగ్రీ first year పూర్తయ్యాక, సమ్మర్ హాలిడేస్ లో ,
ఆరోజు అలా హిమజ ని కలవడానికి వెళ్తూ ఉంటే, ఒక కుర్రాడు, 6 అడుగుల పొడుగు, ఉన్నాడు, cycle మీదవస్తుకాజల్ ని చూసాడు. కాజల్ కూడా అతన్ని చూసింది,
కాజల్ ని చూడగానే చిన్నగా స్మైల్ ఇచ్చాడు, కాజల్ వైపే వస్తు.
కాజల్ తల కిందకు వేసుకొని నడుచుకుంటూ వెళ్ళింది.
అతను కాజల్ వెంటే వచ్చాడు,
హిమజ అతను కాజల్ వెనక రావడం చూసి, నవ్వుకుంది.
కాజల్ వచ్చి,
కాజల్: హెయ్ లోపలికి పదా.
లోపలికి వెళ్ళాక,
హిమజ: ఎవరే అతను నీ వెనకే వచ్చాడు.
కాజల్: ఏమో నే ఇందాక వస్తుంటే చూసాను, నన్ను చూసాడు, ఇక్కడి దాకా వచ్చాడు.
హిమజ: లైన్ వేస్తున్నాడు నీకు.
కాజల్: అంతే అంటావా? బాగున్నాడు కదా.
హిమజ: హెయ్ ఎంటే, చూడగానే నచ్చేసాడ?
కాజల్: అలా కాదు బాగున్నాడు.
హిమజ: అలా అని నమ్మకు పోకిరి గాడు అయితే, ఎందుకైనా సరే వాడిని పట్టించుకోక, వేరే పనెంలేదుఅనుకుంటా ఇలా వచ్చాడు.
కాజల్: హా వీడు కూడా ఆ శివ గాడి లాగే అయ్యుండచ్చు లే.
హిమజ: ఎవరు ఇంటర్ లో వెంట పడ్డాడు వాడా?
కాజల్: వాడు కాదు, కాలేజ్, waste fellow.
హిమజ కి అది ఆశ్చర్యంగా అనిపించింది.
హిమజ: ఇంకా గుర్తున్నాడా వాడు నీకు.
కాజల్: హా…. కల్లోకొస్తాడు waste గాడు.
హిమజ మళ్ళీ షాక్,
హిమజ: కల రావడం ఏంటి, నిజమా?
కాజల్: హ్మ్మ్, సరే వదిలేయ్.
ఇక హిమజ తో మాట్లాడి ఇంటికి వెళ్ళే దారిలో ఆ అబ్బాయి కాజల్ వెనకే వస్తున్నాడు.
కాజల్ ఇక ఆగి అడిగేసింది,
కాజల్: హెయ్ ఎవరు నువ్వు?
అతను: హై I’m Shankar. నేను మీ college ఏ, చాలా సార్లు చూసాను. నీ పేరు?
కాజల్: అవునా, నా పేరు కాజల్.
శంకర్: నేను కూడా హిస్టరీ నే, నేను 2nd year.
కాజల్: ఓహ్ సీనియర్ ఆ. అవును మీ దగ్గర నోట్స్ ఉన్నాయా, అంటే నాకు మెటీరియల్ చదవడం అంటేఇష్టంఉండదు.
శంకర్: ఉన్నాయి, కావాలా?
కాజల్: if you don’t mind. నేను మళ్ళీ సెకండ్ year అయ్యాక ఇచ్చేస్తాను.
శంకర్ కి కాజల్ అలా త్వరగానే మాట్లాడడం నచ్చింది.
శంకర్: తప్పకుండా ఇస్తాను.
కాజల్: రేపు ఇక్కడే కలుద్దాం. Ok.
శంకర్: ok no problem.
కాజల్ ఇక ఇంటికి బయల్దేరింది, శంకర్ వెనక నుంచి చూస్తూ, ” ఇంత బాగుంది, నాతో మాట్లాడింది, ఇవ్వకఅదృష్టం బాగుంది, తన తో ఫ్రెండ్షిప్ చెయ్యాలి ” అనుకున్నాడు.
కాజల్ ఇంటికి వెళ్ళాక, ” మంచొడిలా ఉన్నాడు, బాగా చదువుతాడు అనుకుంటా, రేపు నోట్స్ ఇస్తే అన్నీరాసుకొనిమళ్ళీ ఇచ్చెయ్యలి “.
తరువాతి రోజు, అక్కడే నూనె మిల్లు దగ్గర కలిసారు, సాయంత్రం 6:30 కావస్తుంది.
శంకర్: హై కాజల్.
కాజల్: హై…. నోట్స్ తీసుకొచ్చారా అండి?
శంకర్: హెయ్ నువ్వు నన్ను casual గా పిలువు, ఈ అండి ఏంటి, నేనేం అంత పెద్ద సీనియర్ కాదు నేకు.
కాజల్: హ్మ్మ్ సరే.
శంకర్: ఇదిగో బుక్స్.
నవ్వుతూ,
కాజల్: థాంక్స్ శంకర్.
అని చెప్పింది.
శంకర్: నీ స్మైల్ బాగుంది.
కాజల్ సిగ్గుతో మళ్ళీ థాంక్స్ చెప్పింది.
ఇటు తిరిగి ఇంటికి వెళ్తుంది. శంకర్ కూడా వెనకే వస్తున్నాడు.
కాజల్: నువ్వు రావాల్సిన అవసరం లేదు.
శంకర్: ఆ అలా కాదు చీకటి పడుతుంది, మీ ఇంటిదాకా వస్తాను.
కాజల్ ఏం మాట్లాడకుండా నడిచింది.
కాజల్ మనసులో ” ఇంటి address కనుకుందాం అనుకుంటున్నాడు ”
ఇంటికి వచ్చాక,
శంకర్: బై కాజల్.
కాజల్: హా బై.
ఒక నాలుగు రోజుల తరువాత, సాయంత్రం ,కాజల్ ఇంటి ఎదురుగా నిలబడి చూస్తున్నాడు. కాజల్ శంకర్నిచూసింది. బయటకి వచ్చింది,
కాజల్: నువ్వేంటి ఇక్కడేం చేస్తున్నావ్?
శంకర్: ఏం లేదు ఇంట్లో బోర్ కొడ్తుంది, నాకు లోకల్ లో ఫ్రెండ్స్ ఎవరూ లేరు, కాసేపు నీతో మాట్లాడదాంఅనివచ్చాను.