కాజల్: ఓహ్ అవునా
కాజల్ ” ఎటైనా వెళ్దాం అంటాడో ఏమో ”
శంకర్: హేయ్ ఏమైనా తింటావా?
కాజల్: ఇప్పుడా ఏంటి?
శంకర్: నీ ఇష్టం.
కాజల్: సరే పదా, ఉండు ఇంట్లో చెప్పోస్తాను.
కాజల్ ఇంట్లోకి వెళ్లి, ” అమ్మా నేను హిమ దగ్గరకి వెల్లోస్తాను” అని చెప్పి వచ్చింది.
కాజల్: త్వరగా పదా, మా నాన్న వచ్చేలోపు నేను ఇంట్లో ఉండాలి.
శంకర్: సరే ఎక్కు.
కాజల్ కి అర్ధం కాక అడిగింది,
కాజల్: ఏంటి?
శంకర్: హా సైకిల్ ఎక్కు.
అలా ముందు కూర్చోవాలని కాస్త ఆలోచించి పర్లేదు లే అనుకుని కూర్చుంది.
కాజల్: నువ్వు మా లాస్ట్ batch topper అంటా?
శంకర్: హా అవును. State top.
కాజల్: నీ hand writing కూడా చాలా బాగుంది.
శంకర్: థాంక్స్.
అలా కాజల్ ముందు rod మీద కూర్చోండి సైకిల్ మీద వెళ్తుంటే, కాజల్ కురులు గాలికి లేస్తూ, శంకర్మొహానికితగులుతున్నాయి.
అది తలచుకుని, కాజల్ సిగ్గు పడుతుంది.
ఒక bakery దగ్గర ఆగారు.
శంకర్: నీకు ఏం ఇష్టం?
కాజల్: నేను cake తింటాను, chocolate ది.
శంకర్ కాజల్ కి ఒక cake, తనకి ఐస్క్రీమ్ తెచ్చుకున్నాడు.
అది చూసి అడిగింది,
కాజల్: నైట్ కూడా ఐస్క్రీమ్ తింటావా?
శంకర్: నాకు తినాలి అనిపించింది అంతే.
కాజల్: హా ok.
తిన్నాక ఇద్దరూ, తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటే,
కాజల్: శంకర్ టీ తాగుదామా?
శంకర్ కి టీ ఇష్టం ఉండదు.
శంకర్: వద్దు నాకు ఇష్టం లేదు.
అన్నాడు. కాజల్ కి మాత్రం తాగాలి అని ఉంది, కానీ శంకర్ ని అడగాలా వద్దా అని చూస్తుంది. అంతలోపే,
శంకర్: నువ్వు కూడా తాగకు, చాయ్ వేడి తెల్సా. బ్రిటీషు వాళ్ళు వాళ్ళ trading కోసం మనకి టీ అలవాటు చేసి, ఇక్కడే టీ పండించి, మన టీ ని బయట దేశాలకు అమ్ముకుని, మొత్తం మన సంపద దోచుకున్నారు.
కాజల్: ఓహ్ అవునా నీకెలా తెలుసు.
శంకర్: 2nd year Indian history లో ఉంటుంది లే కాజల్.
కాజల్: నువ్వు భలే తెలివిగా చెప్పావు.
కాజల్ కి శంకర్ అలా తెలివిగా మాట్లాడడం నచ్చింది.
శంకర్: ఇవేంటి ఇంకా చాలా ఉన్నాయి మనం మళ్ళీ కలిసినప్పుడు చెప్తా లే. పదా.
ఇద్దరూ ఇంటికి వస్తున్నారు,
మధ్యలో కాజల్ కొన్ని డౌట్స్ అడిగితే శంకర్ explain చేసాడు.
ఇంటికి వచ్చాక,
కాజల్: మనం మళ్లీ ఎప్పుడు కలుద్దాం.
శంకర్: నీ ఇష్టం రేపు కలుద్దామా.
కాజల్: సరే మధ్యాహ్నం రా.
ఇక అలా 5 రోజులు గడిచాయి. ఇద్దరూ దగ్గరయ్యారు. ఒకరికొకరు తెలుసుకున్నారు.
ఒక రోజు సాయంత్రం అలాగే వెళ్తూ ఉంటే, గంగమ్మ కాజల్ ని చూసింది. కాజల్ కూడా చూసి, ” అయ్యో అత్త, చూసింది, ఇంట్లో చెప్తుంది కావచ్చు ” అనుకుంది.
శంకర్: ఏమైంది టెన్షన్ పడుతున్నావ్?
కాజల్: ఆమె మా అత్త. ఇంట్లో నీతో ఉన్నా అని చెప్తుంది కావచ్చు.
శంకర్: ఏం కాదులే చెప్పుద్దో లేదో, ముసల్ది కదా అసలు చీకట్లో నిన్ను సరిగ్గా చూసిందో లేదో లే.
కాజల్ కి శంకర్ అలా చులకన గా మాట్లాడడం అస్సలు నచ్చలేదు.
శంకర్: సరే ఇవాళ ఏం తిందాం?
కాజల్: noodles తిందామా?
శంకర్: no వద్దు, fast food మంచిది కాదు, ఎలా పడితే అలా చేస్తారు. మంగో జ్యూస్ తాగితే?
కాజల్: హా తాగుదామ్.
ఇద్దరూ మంగో జ్యూస్ తాగి, కాజల్ పై పెదవి మీద జ్యూస్ ఉంటే చూసి,
శంకర్: కాజల్ నీ లిప్స్ మీద జ్యూస్ ఉంది.
కాజల్ అప్పుడు పైకి పెదవిని కిందకు అనుకుని చప్పరించింది.
అది శంకర్ దీర్ఘంగా చూసాడు.
కాజల్ మొహం తిప్పుకుని మురిసిపోయింది.
ఇద్దరూ ఇంటికి వెళ్ళేదారిలో, కాజల్ ముందు కూర్చొని శంకర్ చెయ్యి మీద చెయ్యి వేసి కూర్చుంది.
ఒకరి స్పర్శ ఒకటికి, వెచ్చగా, ఎదో తెలియని అనుభూతి. ఇంతకు ముందు ఎప్పుడూ లేదు, ఈరోజే ఎందుకోకొత్తగాఅనిపించింది.
శంకర్ తల కాస్త ముందు వంచి, సైకిల్ మెల్లిగా వేగం తగ్గించి తొక్కుతూ, చెవిలో,
శంకర్: కాజల్ నీ లిప్స్ చాలా బాగుంటాయి, నీ స్మైల్ అయితే ఇక నాకు పదాలు రావట్లేదు.
కాజల్ శంకర్ చెప్పిన దానికి సిగ్గు పడింది. మౌనంగా ఉంది.
శంకర్: నీ కళ్ళు కూడా ఎంత బాగుంటాయో వాటిని అలా చూస్తూ ఉండాలి అనిపిస్తుంది.
కాజల్ ఒక్కసారిగా అప్పట్లో ఇలాగే శివ అన్న మాటలు గుర్తొచ్చాయి.
కానీ ఆ ఆలోచన పక్కన పెటి,
కాజల్: నేను బాగుంటానా?
శంకర్: చాలా చాలా. కాజల్ నేను నీకు నచ్చానా?
కాజల్: నచ్చకపోతే నీతో ఇలా బయటకి ఎందుకు వస్తాను.
ఇంతలో ఇంటికి వచ్చారు, శంకర్ కాజల్ ని దింపి వెళ్ళిపోయాడు, ఇంట్లో గంగమ్మ ఉంది. ఏం చెప్పలేదు. కాజల్హమ్మయ్య అనుకుని గదిలోకి వెళ్ళింది. గంగమ్మ కూడా కాజల్ గదిలోకి వెళ్ళి అడిగింది,
గంగమ్మ: పిల్లా ఎవరూ ఆ పొరగాడు, సైకిల్ మీద తిరుగుతున్నావు?
కాజల్: నా దోస్తు.
గంగమ్మ: ఈ కాలం పొరగాల్లు మంచిగ లేరు జాగ్రత్త.
కాజల్: అదేం లేదు మంచోడే.
2 రోజులు కలవలేదు,
తరువాత మళ్ళీ మంగో జ్యూస్ తాగాడని వెళ్ళారు.
కాజల్: శంకర్ పార్సెల్ తీస్కో ఇక్కడ వద్దు.
శంకర్ అలాగే చేసాడు.
ఇద్దరూ, నూనె మిల్ లోకి వెళ్ళి, కూర్చొని,
తాగుతూ ఉంటే,
కాజల్ కావాలనే పెదాలకు అంటుకునెలా చేసుకుంది.
శంకర్ దగ్గరకి జరిగాడు. వేలితో ఆ జ్యూస్ తుడువబోతే,
కాజల్: kiss చెయ్.
శంకర్ కి కాజల్ సరిగ్గానే అన్నాదా అని అర్దం కాలేదు.
కాజల్: అవును, నా లిప్స్ ఇష్టం అన్నావుగా కిస్ చేస్కో.
శంకర్ క్షణకాలం లో కాజల్ పెదాలను తన పెదాలతో అందుకున్నాడు.
జ్యూస్ ని నోట్లోకి తీసుకొని జుర్రాడు.
శంకర్ తల పట్టుకుని,
కాజల్: సరిగ్గా చెయ్యి.
ఇద్దరూ ఒకరి పెదాలు ఒకరు ముడి వేసుకున్నారు.
శంకర్ ఆతృతతో కాజల్ మీద ఒత్తిడి చేస్తూ, పక్కకి వంచాడు. నడుము పట్టుకున్నాడు.
ముద్దు విడిచి, కాజల్ కళ్ళలోకి చూస్తూ,
శంకర్: థాంక్స్.
కాజల్: ఎందుకూ?
శంకర్: చెప్పాలి అనిపించింది.
కాజల్: సరే పదా, పోదాం.
అని లేచింది.
శంకర్ చెయ్యి పట్టుకుని, ” ఎలా అనిపించింది ” అని అడిగాడు.