కిషోర్, శ్రీధర్ లు కిందవరకూ వెళ్లి సుజి కి థాంక్స్ చెప్పారు. ఎహ్ చుప్ బె నాకు థాంక్స్ చెప్తార్రా అంది ఇద్దర్ని. వెంటనే సుజి వెళ్ళిపోయింది. కిషోర్ వెనకాలే శ్రీధర్ పైకి వెళ్ళబోతూ అరేయ్ ఒక్క నిమిషియం అంటూ తన బైక్ దగ్గరకి వెళ్లి, కవర్ లో ఉన్న ఫైల్స్ తీసుకొని, పక్కన ఉన్న ఇంకో కవర్ తీసుకొని వచ్చాడు. ఇందాక హడావిడిగా పైకివెళ్ళాం ర నేను సుజి ఇవి ఇక్కడే మర్చిపోయాను అని చెప్పాడు. ఇందాక నేను లోపలికివచ్చేటప్పటికీ సుజి కార్ పార్క్ చేసి రావటం చూసి ఆగాను, తాను వచ్చి చెప్పింది అప్పటివరకు నాకు తెలియదు ఈ విషయం అన్నాడు శ్రీధర్. అదేంటి నువ్వు పెందలాడే వచ్చావ్ కదా ఇంటికి అన్నాడు కిషోర్. అవునురా నేను వచ్చినప్పుడు అలేఖ్య నిద్ర పోతుంది. పూర్ణ ని అడిగితే ఫీవర్ అని చెప్పింది. సరే పడుకొనిలే అనుకున్న, దగ్గరకి వెళ్లి చూడలేదు. తరువాత నువ్వు ఫోన్ చెయ్యటం తో బయటకి వచ్చాను అన్నాడు శ్రీధర్. ఇద్దరు ఫ్లాట్ లో కి వెళ్లరు కిషోర్ తన ఫాల్ట్ లోకి వెళ్లి స్రవంతిని ఎత్తుకొని బెడ్ రూమ్ లో పడుకో పెట్టాడు. బాత్ రూమ్ కి వెళ్లి స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకొని శ్రీధర్ వాళ్ళ ఫ్లాట్ కి వెళ్లి అలేఖ్య ని చూసాడు. పూర్ణ కూడా అలేఖ్య పక్కన ఉంది… నిద్ర పోతుంది… అని సైగ చేసి చెప్పింది. సరే మేము హాల్ లోని ఉంటాం అని చెప్పి డోర్ క్లోజ్ చేసి వచ్చాడు. వచ్చేటప్పటికి శ్రీధర్ రెండు గ్లాసుల్లో విస్కీ పోసుకొని తెచ్చి ఇచ్చాడు. ఇద్దరు బాల్కనీ లోకి వెళ్లారు చేతిలో గ్లాసులు పట్టుకొని.
