విక్రమ్ : మానసని చూసాను..
మానస : వస్తాడు ఆదిత్య, నీ లవ్ కచ్చితంగా సక్సెస్ అవుతుంది కానీ ఆ కొరియన్ వాళ్ళు ఎవరు, నాకు భయంగా ఉంది.
ఆదిత్య : అదే చెప్తున్నాను, చాలా రిస్క్ ప్రాణాలు పోయే అవకాశం కూడా లేకపోలేదు అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఆలోచించుకొని నాకు ఏ విషయం చెప్పండి.. గుర్తుపెట్టుకో ప్రాణాలకే ప్రమాదం.. కానీ నువ్వు నాకు చాలా అవసరం విక్రమ్.. నీకు లొకేషన్ పంపిస్తున్నా ఏ విషయం ఆలోచించుకుని ఫ్లైట్ ఎక్కు, నాకు మళ్ళీ ఫోన్ చెయ్.
ఫోన్ పెట్టేసి మానసని చూసాను.. మానస అయోమయంగా చూసింది..
విక్రమ్ : ఎం చెయ్యను.?
మానస : నాకు భయంగా ఉంది, తను అంత గట్టిగా చెప్తున్నాడు. నాకు వెళ్లాలని ఉంది.
విక్రమ్ : ఎలాగో ఇద్దరం ఉన్నాం, మేనేజ్ చెయ్యొచ్చు తన లవ్ కి హెల్ప్ చేస్తే అప్పుడైనా మందు మానేస్తాడేమో.. ఎవరో కూడా తెలియని అమ్మాయిల కోసం ఇంత రిస్క్ తీసుకుంటున్నాడు, అడగక పోతే అది వేరు కానీ ఇప్పుడు తను ప్రమాదంలో ఉన్నాడని తెలిసి కూడా ఇలా కూర్చోలేను.
మానస : జాగ్రత్త.. అంటూనే నా పెదాలు అందుకుంది.
విక్రమ్ : పదా వెళదాం.. అని లేచి హోటల్ దెగ్గరికి వచ్చేసాం
చందు భరత్ లని లేపి విషయం వివరించాను కానీ వాళ్ళకి ఇవేమి చెప్పలేదు. భరత్ ని తీసుకుని ఎయిర్పోర్ట్ కి బైలుదేరాను. మానస వైపు చూసాను, బాయ్ అని చెయ్యి ఊపింది. తల ఊపి బైటికి వచ్చేసి భరత్ బండి నడుపుతుంటే వెనక కూర్చున్నాను.
భరత్ : విక్రమ్ ఈ బండి ?
విక్రమ్ : పొద్దున్నే ఏ ట్రైన్ కి కుదిరితే ఆ ట్రైన్ కి బండి పార్సెల్ వేసి పంపించు అలాగే ఎందుకైనా మంచిది ఊర్లో మన వాళ్ళు ఎవరైనా ఉంటె నా బండి కూడా బెంగుళూర్ పార్సెల్ చెయ్యమను అవసరం పడొచ్చు నాకొక ప్లాన్ ఉంది.
భరత్ : అలాగే
బండి ఎయిర్పోర్ట్ ముందు ఆగింది దిగి లోపలి వెళుతూ వెనక్కి తిరిగి భరత్ ని పిలిచాను.
భరత్ : ఏంట్రా
విక్రమ్ : ఎక్కడో తేడా కొడుతుంది రా, ఆ మనుషులని అక్కడే వదిలేశాం మేము ఇద్దరం ఒకేలా ఉంటామని మానస వాళ్ళ నాన్నకి తెలుస్తుందేమో…. ఇంకోటి మా ఇద్దరి గురించి అందరికి తెలిసిపోయింది ఎప్పుడైనా ఏ ప్రాబ్లెమ్ అయినా రావొచ్చు ఒక వేళ వస్తే మాత్రం అమ్మా నాన్న సలీమాని నా దెగ్గరికి పంపించేయి మానస సంగతి తరవాత చూసుకోవచ్చు.. కొంచెం జాగ్రత్తగా ఉండండి.. పని అయిపోగానే వచ్చేస్తాను జాగ్రత్త.. హ్మ్మ్.. బై
లోపలికి వెళ్లి ఫ్లైట్ చూసుకుని ఎక్కి కూర్చున్నాను, మానసని వదిలి వెళ్లాలంటే ఎలాగో ఉంది కానీ అక్కడ వాడి పరిస్థితి కూడా అంతే కదా పాపం చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన మరదలు.. వస్తున్నా ఆదిత్య.
గంటలో బెంగుళూర్ రీచ్ అయ్యాను బైటికి వచ్చేసరికి ఎవరో ఒక పిల్లాడు నా దెగ్గరికి వచ్చి విక్రమ్ అన్నాడు, అవును అన్నాను.
“నా పేరు రాము, అన్న చెప్పినట్టు మీరు సేమ్ ఆదిత్య అన్న లెక్కనే ఉన్నారు”
విక్రమ్ : ఎక్కడున్నాడు.
రాము : పద అన్నా, అక్కడికే వెళుతున్నాం. అన్నా వదిన కలిసిపోయారు.. అమ్మాయిలు ఆకలి వేస్తుందనేసరికి అన్న డైరెక్టుగా వదినకె ఫోన్ చేసాడు.. వదిన అక్కడ అందరికి కిచిడీ వండుతుంది.
విక్రమ్ : అయితే కలిసిపోయారన్నమాట
రాము : అవునన్నా.. కానీ అన్న ఇంకా రాలే
విక్రమ్ : అదేంటి నాకు ఫోన్ చేసినప్పుడు ఇంకోగంటలో వెళ్ళిపోతా అన్నాడు.
రాము : నాతోని కూడా అదే అన్నాడు కానీ మధ్యలో సెక్యూరిటీ అధికారి చెకింగ్ ఉందట హైవే దిగి ఊర్లల్లో నుంచి వస్తున్నాడు… ఇదే అన్నా క్యాంపు.. అదిగో అక్కడ కట్టెలు పెట్టి మంట వెలిగిస్తుందే తనే అనురాధ.
బండి దిగి తన ముందుకి వెళ్ళాను నన్ను చూడగానే ఏడుస్తూ నా వైపు పరిగెడుతుంటే చెయ్యి ఎత్తి “నేను ఆదిత్యని కాను” అన్నాను. నన్ను చూసి ఆగిపోయి రాము వంక చూసింది.
రాము : అవును వదినా ఈ అన్న పేరు విక్రమ్ ఆచం అన్న లెక్కనే ఉన్నడు, తన ఫ్రెండ్ అట.
అనురాధ : కానీ…