మానస అమ్మ : ఏంటి మా అమ్మాయికి బట్టలు గిఫ్ట్ గా ఇచ్చావంట ఏంటి సంగతి?
విక్రమ్ : అది..
మానస అమ్మ : ఏంటి ప్రేమిస్తున్నావా? అని కోపంగా చూసింది..
నాకు అర్ధమైంది మానస వాళ్ల అమ్మ నన్ను ఆటపట్టిస్తుంది అని.
విక్రమ్ : లేదండి కాలేజీలో మీ అమ్మాయి వేసుకునే చిన్న చిన్న బట్టలు చూసి మీ దెగ్గర డబ్బులు లేవనుకుని కొనిచ్చాను కానీ ఇక్కడికి వచ్చాకే తెలిసింది అది ఫాషన్ అని.
మానస వాళ్ల అమ్మ నన్ను ఒకసారి తీక్షణంగా చూసి ఫక్కుమని నవ్వింది.
మానస అమ్మ : అది ఈ మధ్యే అలా తాయారయ్యింది..డబ్బు, వాళ్ల నాన్న పవర్ అన్నిటికి మించి సావాసాల వల్ల అలా ఉంది కానీ చాలా మంచిది, అంత రఫ్ గా ఉండే నా కూతురుని ఒక్క చూపులో మార్చేశావంట?
విక్రమ్ : మానస చెప్పిందా?
మానస అమ్మ : హ్మ్ అవును తనే చెప్పింది. కానీ నా కూతురుకి కొంచెం పొగరు ఎక్కువే….
విక్రమ్ : అది మీ అమ్మాయి అందానికి ఒక అలంకరణ లాంటిది లెండి.
మానస అమ్మ : ఏం జరిగినా నిన్ను వదులుకోదట ఇది కూడా మానసే చెప్పింది..
సంతోషంగా “అవునా?” అన్నాను.
మానస అమ్మ : అంత ఆనందపడకు నువ్వు నా అల్లుడిగా రావడానికి నేనింకా ఒప్పుకోలేదు.
విక్రమ్ : అవన్నీ నాకు తెలీదు, నేను మీకు నచ్చాను అని మాత్రం నాకు తెలుసు, ఇక మానసతొ ఇంతవరకు ఏమి తెల్చుకోలేదు ఒక్కసారి తను నాతో మాట్లాడని.. ఇక మమ్మల్ని విడదీయడానికి దేవుళ్ళు దిగి వచ్చినా వాళ్ళ వల్ల కాదు..
మానస అమ్మ : నీ ధైర్యం చూస్తుంటే నాకు ఆనందంగా ఉంది కానీ నా భర్తని చూస్తుంటే భయంగానూ ఉంది.
విక్రమ్ : అవన్నీ నేను చూసుకుంటాను నన్ను ఆశీర్వాదించండి అమ్మా…
మానస అమ్మ : ఎమన్నావ్?
విక్రమ్ : అమ్మా అన్నాను.. నాకు మిమ్మల్ని అలానే పిలవాలనిపించింది.
…………………………………………………………..
అక్కడనుంచి జారుకున్న మానస రమ ఇద్దరు పార్టీ ఏరియాకి వెళ్లారు.. మానస సలీమా వాళ్లు కూర్చున్న దెగ్గరికి వెళ్ళింది.
మానస : హాయ్ రమ్య, సలీమా పూజ… హాయ్ అని చందు భరత్ ని చూసి పలకరించింది.
సలీమా : మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ అఫ్ ద డే మానస..
అందరూ విషెస్ చేశారు చివరికి విక్రమ్ అమ్మ కూడా విష్ చేసింది… కావ్య ఏదో సైగ చెయ్యటం సలీమా దానికి తిరిగి సైగ చేసి మానస వైపు చూసి..
సలీమా : మానస ఈ సారీ నీకు బాగా సూట్ అయ్యింది అని చెప్తుంది.
మానస : థాంక్స్ ఆంటీ…. సలీమా తను..?
సలీమా : తను కావ్య… విక్రమ్ వాళ్ల అమ్మగారు…
ఆ మాట వినగానే మానస ఆశీర్వదించమని కాళ్ళ మీద పడిపోయింది, కావ్య వెంటనే లేపి మానసని కౌగిలించుకుంది.
అటు విక్రమ్ మానస వాళ్ల అమ్మతొ మాట్లాడుతూ మానస గురించి తెలుసుకుంటుంటే ఇటు మానస విక్రమ్ వాళ్ల అమ్మతొ మాట్లాడుతూ విక్రమ్ గురించి తెలుసుకుంటుంది.