పొద్దున్నే లేచాను ఇవ్వాళ అన్ని కొత్త కొత్తగా ఉన్నాయ్, బెడ్ మీద నుంచి లేచి ఇంటి ముందు గార్డెన్ లోకి వచ్చా, రోజు నేను చికాకుగా చూసే పక్షులు ఇవ్వాళ అందంగా కనపడుతున్నాయి.
త్వరగా స్నానం చేసి టైం చూసుకున్నాను కాలేజీ స్టార్ట్ అవ్వడానికి ఇంకా రెండు గంటల పైనే పడుతుంది, రోజు వేసుకునే టైట్ డ్రెస్సులు వేసుకోబుద్ది కాలేదు, నాకోసం అమ్మ పోయిన సారి బర్తడేకి గిఫ్ట్ ఇచ్చిన డ్రెస్ తీసాను అదొక ఫుల్ హాండ్స్ ఎల్లో టీ షర్ట్ అండ్ తిక్ బ్లు జీన్స్, వేసుకుని అద్దంలో చూసుకున్నాను చాలా బాగుంది, విక్రమ్ నన్ను చూస్తాడా? తనకి నచ్చుతుందా అని ఆలోచిస్తూ మంచం మీద కూర్చున్నాను.
అన్నిటికంటే ముందు అమ్మ ఈ డ్రెస్ లో నన్ను చూసి సంతోషపడితే బాగుండు అనిపించింది, అలా ఎందుకు అనిపించిందంటే అమ్మ నాతో మాట్లాడదు కాబట్టి.
నాకు ఈ ప్రపంచంలోనే ఇష్టమైన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి అమ్మ, అందరు నన్ను నా చిన్నప్పుడు అమ్మ కూచి అని పిలిచేవారు ఎప్పుడూ అమ్మ కొంగు పట్టుకుని అమ్మ ఎటు వెళ్తే అటు వెళ్లేదాన్ని..
కానీ నాకు రాను రాను డబ్బు పిచ్చి పిచ్చి కాదు అది మదం అని చెప్పుకోవచ్చు ఎక్కువైంది, అమ్మ పోలికలతో కొంచెం అందం కూడా వచ్చింది దానితో పాటే గర్వం కూడా..
నాకున్న ఫ్రెండ్స్ అందరు అటువంటి వాళ్లే నేను వాళ్ళలా ఉండకపోవడంతొ కొంచెం దూరం పెట్టారు అందుకే నేను వాళ్ళలా మారిపోయాను.
మొదట్లో అమ్మ చెప్పి చూసింది కానీ నా కష్టాలు తనకేం తెలుస్తాయి అని కొట్టి పారేసాను.
ఒక రోజు ఏదో చికాకులో ఉండగా మా ఇంట్లో పనిచేసే రమ కొడుకు నానీ నన్ను ఆటపట్టించాడు వాడు చిన్నపిల్లోడు కానీ కోపంలో వాడిని కాలితో తన్నాను.
అప్పటినుంచి అమ్మ నాతో మాట్లాడడం మానేసింది, అది కొంచెం బాధగా ఉండేది, అప్పటి నుంచే అందరి మీద కోపగించుకోడం చులకనగా చూడటం మొదలయ్యాయి.
కానీ విక్రమ్ ని చూసాకే నాలో ఉన్న నా చిన్ననాటి మానసని నాకు మళ్ళీ పరిచయం అయ్యింది.
ఇంతవరకు తనతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఒక వేళ తనకీ గర్ల్ ఫ్రెండ్ ఉండి ఉంటే అయినా పరవాలేదు దూరం నుంచి ప్రేమిస్తాను, నాకు దక్కకపోయినా పరవాలేదు నా ప్రేమని మాత్రం ఆపలేను అది నాకు తనని చూసిన మొదటి చూపులోనే అర్ధమైంది.
ఇక అమ్మకి కనిపించాలని కావాలనే తన రూమ్ ముందు అటు ఇటు పని ఉన్న దాని లాగ తిరిగాను కొంచెం సేపటికి అమ్మ బైటికి వచ్చింది.
అమ్మ నన్ను చూసేలాగ “రమా టిఫిన్ పెట్టు” అని అరిచాను, అమ్మ నన్ను చూసింది, కొంచెం షాకింగ్ గానే చూసింది మళ్ళీ ఏమైందో తిరిగి లోపలికి వెళ్ళిపోయింది.
వెనకాలే వెళ్లాను అమ్మ లోపలికి వెళ్లి గోడకి తగిలించి ఉన్న నా ఫోటోకి ముద్దు ఇచ్చింది, ఆ ఫోటో నా చిన్నప్పటిది అందులో లంగా ఓణి లో ఉన్నాను, వచ్చే వారం నా బర్తడే ఉంది అప్పుడు అమ్మకి ఆ డ్రెస్ లో కనిపించాలి అనుకున్నాను.
రమ ఆంటీ టిఫిన్ పెట్టుకొచ్చింది తినేసి కాలేజీకి బైలుదేరాను, ఇంకా విక్రమ్ రాలేదు నా ఫ్రెండ్స్ కూడా రాలేదు కానీ రమ్య వాళ్ళు కనిపించారు.
మానస : రమ్యా..
రమ్య : చెప్పు మానస..
పూజ : ఏముంది మళ్ళీ ప్రాంకో లేక ఏడిపించడానికో వచ్చి ఉంటుంది.
రమ్య : నువ్వు ఊరుకోవే.
మానస : అది మొన్న మీ ఫ్రెండ్ సలీమాని ఏడిపించిందని సోనియా మెడ పట్టుకున్నాడు కదా తనెవరు, సలీమా బాయ్ ఫ్రెండా?
రమ్య : ఛీ కాదు మానస విక్రమ్ కి సలీమా చెల్లి లాంటిది, మొన్న సలీమా వాళ్ళ అమ్మ పోయాక తన బాధ్యత విక్రమ్ వాళ్లే తీసుకున్నారు, విక్రమ్ వాళ్ళ అమ్మ కూడా సేమ్ విక్రమ్ లాగే చాలా మంచిది.
ఇంతలో విక్రమ్ బైక్ మీద వస్తుండడం చూసి, “సరే రమ్య నేను వెళ్తాను, నా తరపున సోనియా చేసిన పనికి సలీమాకి సారీ చెప్పు”అని అక్కడ నుంచి క్లాస్ లోకి వచ్చేసా ఎలాగో వస్తాడుగా అప్పుడు మళ్ళీ చూడొచ్చులే అని…
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈
Super story. Title chusi skip cheste super story.miss avutam. Pl continue and show your talent writer garu