పొద్దున్నే అలారం మొగగానే లేచాను…. రూమ్ నుంచి బైటికి వచ్చి అమ్మ వాళ్ళ రూమ్ చూసాను… ప్రశాంతంగా నాన్న కౌగిలి లో గువ్వ పిట్టలా ఒదిగిపోయి నిద్రపోతుంది….
వాళ్ళ సంతోషం చూస్తుంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది నాకు అమ్మ లాంటి భార్య రావాలని.
షూస్ వేసుకుని జాగ్గింగ్ కి వెళ్ళాను గత రెండు సంవత్సరాలుగా సిక్స్ ప్యాక్ మేంటైన్ చేస్తున్నాను, ధ్రువ సినిమాలో రామ్ చరణ్ ని చూసాక బాగా ఇన్సపైర్ అయ్యాను….
ఇంటికి వచ్చి ఎక్సర్ సైజ్ చేసి కాలేజీ కి వెళ్ళడానికి రెడీ అయ్యాను….. అమ్మ లేచి టిఫిన్ చెయ్యడానికి కిచెన్ లోకి వెళ్ళింది, నాన్న మార్నింగ్ వాక్ కి వెళ్లే ఉంటాడు రోజు పొద్దున్నే వాకింగ్ కి వెళ్లి పేపర్ కొనుక్కుని రావడం అయన కున్న అలవాట్ల లో ఇది మొదటిది.
టీవీ ముందు కూర్చున్నాను అమ్మ టిఫిన్ తెచ్చి ఇచ్చింది, నవ్వుతూ తనని చూసి ప్లేట్ అందుకున్నాను నా తల నిమిరి లోపలికి వెళ్ళింది…
టిఫిన్ తినేసి అమ్మకి నుదిటి మీద ముద్దు ఇచ్చి, “కాలేజీ అయిపోగానే త్వరగా వచ్చేస్తాను” అన్నాను… నన్ను చూసి వేళ్ళతో “నా బంగారం” అని సైగ చేసింది….
మా ఇంట్లో అమ్మే నాకు నాన్నకి బాస్ తను ఎంత చెప్తే అంత, తన మాట కాదని మేము ఏ పని చెయ్యము.
అమ్మ తో మాట్లాడుతుండగానే ఫోన్ నోటిఫికేషన్స్ తెగ మొగుతున్నాయి చూస్తే మా ఫ్రెండ్స్ గ్రూప్ నుంచి వాట్సాప్ లో తెగ గోల చేస్తున్నారు…. వెంటనే బైక్ తీసాను సరస్వతి డిగ్రీ కాలేజీ కి….
ఇంటి దెగ్గర నుంచి కాలేజీ కి అరగంట దూరం…. ఈ లోగ మా ఫ్రెండ్స్ ని తలుచుకున్నాను ఒకల్లో ఇద్దరో అనుకునేరు మొత్తం ఇరవై రెండు మంది అవును వీళ్లంతా నా ఫ్యామిలీ అనే చెప్పాలి….