విక్రమ్ : ముందు వంట సంగతి చూద్దాం.
అనురాధ : కట్టెలు మండడం లేదు..
విక్రమ్ : తప్పుకోండి నేను చూస్తాను అని పొయ్యి వెలిగించి డెక్షా పెట్టి అనురాదని చూసాను ఒక్కొక్కటి నాకు అందిస్తుంటే అన్ని వేసి ప్లేట్ పెట్టి కింద కర్రలు మధ్యలోకి పెట్టి మంట పెంచాను.
రాము : అన్నా వంట బాగా చేస్తున్నావ్
విక్రమ్ : మేముండేది పల్లెటూళ్ళో కదా అందరం కలిసి వండుకోవడం అలవాటు.
అనురాధ : మా బావ ఉన్నాడు, ఎంత తినమన్నా తింటాడు కానీ కాఫీ పెట్టడం కూడా రాదు.
అలా అన్ని మాట్లడుకుంటూ కూర్చున్నాం కిచిడి కూడా అయిపోయింది, టేస్ట్ చూస్తే బ్రహ్మాండంగా ఉంది. ఇంతలో ట్రక్ లోపలి వస్తున్న శబ్దం విని అటు వైపు చూసాము.
ట్రక్ ఆపి డోర్ తీసుకుని కిందకి దిగాడు ఆదిత్య, రాము పరిగెత్తి వెనకాల డోర్ తీసి అమ్మాయిలని కిందకి దించుతుంటే, అనురాధ వెళ్లి ఆదిత్యని కరుచుకుపోయింది.. వాళ్లు ఇద్దరు మాట్లాడుకుంటుంటే మనసుకి హాయిగా ఉంది, నేను మానసని బుజ్జగించినదానికంటే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు.. ఆ బాండింగ్ నాకు నచ్చింది.
నేనూక్కణ్ణే వాళ్లందరికీ భోజనాలు వడ్డించడం చూసి అను ఆదిత్య కూడా జాయిన్ అయ్యి వడ్డించారు, ఆ తరువాత అందరి గురించి తెలుసుకుని ఇంటికి పంపించేసరికి మధ్యాహ్నం రెండు అయ్యింది. కొంతమంది వెళ్లిపోయారు మరికొంతమందిని వదిలి పెట్టి రావాల్సి వచ్చింది.
నా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోతే పెట్టి పనిలో ఉండగా రింగ్ అయితే ఆదిత్య ఎత్తి స్పీకర్ లో పెట్టాడు..
మానస : విక్రమ్ ??
విక్రమ్ : ఆ వాయిస్ లో భయం వినిపించగానే ఫోన్ అందుకున్నాను… మానస చెప్పు
మానస : మా నాన్నకి మన విషయం తెలిసిపోయింది అమ్మ నా కార్ పంపించింది వాళ్లు రాకముందే ఇంట్లో ఉండమని డ్రైవర్ వచ్చాడు… అంతే కాదు తన ప్లాన్ చెడగొట్టింది కూడా నువ్వేనని ఆయనకి తెలిసిందట నిన్ను చంపించమని కాంట్రాక్టు కూడా ఇచ్చాడట.. నన్ను ఇంటికి లాక్కెళ్ళడానికి కూడా మనుషులు వచ్చారు ఇప్పుడు ఎలా?
విక్రమ్ : ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావ్?
మానస : బెంగుళూర్ హైవే మీద, నీ దెగ్గరికి వస్తున్నాను..
విక్రమ్ : ఇంటికి రమ్మని మీ అమ్మ చెప్పింది కదా
మానస : ఏమో నాకు భయం వేసింది, మళ్ళీ నన్ను ఎక్కడైనా దాచిపెడితే.. నీకు దూరంగా అస్సలు ఉండలేను..
విక్రమ్ : ఒక్కదానివేనా కార్ లోనా
మానస : లేదు ఒక అబ్బాయి హెల్ప్ చేస్తున్నాడు.. తనే నడుపుతున్నాడు డ్రైవర్ అని చెప్పాడు.
విక్రమ్ : మరి భరత్ వాళ్ళు?
మానస : భరత్ మీ అమ్మ వాళ్ళని ఊర్లో వాళ్లతొ మాట్లాడి అలాగే ఇక్కడ సలీమాని బెంగుళూరు ఫ్లైట్ ఎక్కిస్తున్నాడు, చందు మిగతా పూజ వాళ్ళని తీసుకుని ఊరికి వెళ్ళిపోయాడు.
విక్రమ్ : సరే నేను మళ్ళీ చేస్తాను.. అని భరత్ కి ఫోన్ చేసి మాట్లాడి ఆ వెంటనే చందుకి కూడా ఫోన్ చేసాను.. నాన్న కూడా నన్ను ఏమనలేదు వచ్చాక మాట్లాడదాం అన్నాడు అంతే.. ఫోన్ పెట్టేసి తల పట్టుకుని కూర్చున్నాను. భుజం మీద చెయ్యి పడేసరికి తల తిప్పి చూసాను ఆదిత్య.
ఆదిత్య : ఏం కాదు చూసుకుందాం.
విక్రమ్ : నా విషయం పక్కన పెట్టు అస్సలు ఈ కొరియన్ వాళ్లు ఎవరు, నీ వెనక ఎందుకు పడ్డారు..?
అనురాధ : బావ, ఏం జరిగింది.. అస్సలు ఇన్ని రోజులు ఏమైపోయావు నన్ను ఎందుకు దూరం పెట్టావు.. చదువు మధ్యలో ఆపేసావని తెలుసు కానీ రాము వాళ్ల అన్నయకి ట్రీట్మెంట్ చేసింది నువ్వే.. నువ్వేసిన కుట్ల పద్ధతి కొరియ వాళ్ళది, వాళ్లు ఇప్పుడు నిన్ను చంపడానికి వస్తున్నారంటున్నావ్.. ఏంటిదంతా?
అందరూ ఆదిత్య వైపు చూసారు…
విక్రమ్ ఒక సాదా సీదా కుర్రోడు, ప్రాణంగా చూసుకునే అమ్మ బెస్ట్ ఫ్రెండ్ లాంటి నాన్న పెంపకంలో చాలా ఆనందంగా ఉండే జీవితం తనది, వాళ్ళ నాన్న జనరల్ ట్రాన్స్ఫర్స్ మీద ఊర్లు తిరుగుతూ తిరుగుతూ పల్లెటూరు చేరాడు, అక్కడే తనకి పరిచయం అయిన తన స్నేహితులు అక్కడి వాతావరణం, అక్కడి బంధాలకి అలవాటు పడి ఊర్లోనే స్థిర పడిపోయారు.