లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – Part 2 95

“అవును” అని మాములుగా చెప్పింది.

“సరే నీ ఇష్టం స్వీటీ, నీకు ఇష్టం లేదంటే వెళ్ళిపోదాం, ఓకేనా ??”

ఈ లోపల థియేటర్ లో నేషనల్ అంతెం మొదలయింది. అందరం లేచి నిల్చున్నాం.

అది అయ్యాక “తను కూర్చుంది”

నేను కూడా కూర్చొని “వెళ్దామా ?? ఉందామా??”

తను “సినిమా స్టార్ట్ అయ్యింది గా, చూసేసి వెళ్దాము”

“నువ్వు ఏది డైరెక్ట్ గా చెప్పవ్ కదా స్వీటీ ??” అని నవ్వుతు అడిగాను.

తను నన్ను చేయి మీద కొట్టింది. తనలో ఒక దాగున్న చిరునవ్వు.

“అంత సిగ్గు పడక్కర్లేదులే” అన్నాను.

తను నవ్వేసింది “సంజు…. ఇక నా వైపు చూసింది చాలు….సినిమా అటు వైపు”

ఇక సినిమ మొదలయింది. మొదటి పది నిమిషాలు బాగానే గడిచాయి. ఇక హారర్ మొదలయింది. సడన్ ఒక భయంకరమైన సీన్ రావటంతో నా చేయి ప్రియ గట్టిగా పట్టుకుంది. సినిమా మొత్తం సీన్ వచ్చినప్పుడల్లా నా చేయిని బాగా గట్టిగ పట్టుకుంది.

ఇంటర్వెల్ వచ్చింది.

“స్వీటీ గారు, మీరు బాగా భయపడినట్లున్నారు”

“నేను చెప్పానుగా, నాకు చాలా భయం అని. ఈ రోజు రాత్రి కొన్ని మంత్రాలు చదువుకొని నిద్ర పోవాలి. మరి ఇలా ఉంటదనుకోలేదు సినిమ”

“అబ్బో…..విషయం చాలానే ఉంది”

“నువ్వు బాగా మాట్లాడుతావ్, నాకు ఈ సినిమా ఒక నెల దాకా అలాగే గుర్తుండి పోతుంది”

“మరి నీకు ఇంత భయం అనుకోలేదు నేను”

“చిన్నపటినుంచి అంతే”

“స్వీటీ ఇప్పుడు నిజం చెప్పు, నువ్వు సినిమాని ఎంజాయ్ చేశావా లేదా ??”

“పర్లేదు….సెకండ్ హాఫ్ చూసి చెప్తాను”

“నాకైతే సినిమా చాలా నచ్చింది. బాగా హారర్ ఉంది. కథ కొత్తగా ఉంది…ఎఫెక్ట్స్ బాగున్నాయి…మల్ల ఫ్రెండ్స్ తో వస్తాను”

“నీకు అంత నచ్చిందా ??”

“నాకు థ్రిల్లెర్స్ , హారర్ సినిమాలంటే ఇష్టం. అంటే ఏదో హారర్ కోసం సినిమా తీసాం అని కాకుండా, కథలో మంచి పట్టు ఉంటె, నాకు చాలా నచుతుంది. నీకెలాంటి సినిమాలంటే ఇష్టం ??”

“లవ్ స్టోరీస్, కామెడీ సినిమాలు బాగా ఇష్టం”

“యా నాకు కూడా కామెడీ మూవీస్ అంటే ఇష్టం. అఫ్ కోర్స్ అందరికి కామెడీ ఇష్టం అనుకో”

2 Comments

  1. Mawa story matram madhyalo apaku simply superb

  2. Mawa story matram madhyalo apaku simply superb Inka chala parts ga rayi mawa konchm opika techukoni thondaralo inko update ichela chudu konchm waiting ikkada

Comments are closed.