ప్రేమికుడు 477

“హలో.. మైక్ టెస్టింగ్ 123… కూ… చెక్ చెక్..”

జనులారా, మరికొద్దిసేపటిలో ఇక్కడ జరగబోయే నాటకానికి మీకందరికి ఆహ్వానం.. కానీ అది మొదలయ్యేలోగా మీకు కొన్ని సూక్తులని చెప్పాలని అనుకుంటున్నాను… టాపిక్ డబ్బులున్నోళ్లు.. వాళ్ల తప్పులు..

ఆ మాట వినగానే అందరూ ఒకసారి స్టేజి మీద ఉన్న స్వామీజీని చూసారు.. ఉన్నోళ్ల పిల్లల చేతిలో తన్నులు తిని కూర్చున్న పేద పిల్లల బ్యాచ్ ఒకటి కూడా ఇదేదో మ్యాటర్ అని వెళ్లి నిల్చున్నారు..

స్వామీజీ : అదిగదిగో చూడండి, ఆ ముసోలోన్ని చూసారా అనగానే దారిన పోయే వాళ్లు కూడా స్వామీజీని చూసి, స్వామీజీ చూపించిన వేలి వైపు చూసారు.. అక్కడున్నది రాజయ్య తన పక్కనే కొడుకు శరణ్య వాళ్ల నాన్న..

స్వామీజీ : చూసారా.. మూలన కూర్చోవాల్సిన వయసులో, ఆ పంచ.. చేతికి ఉంగరాలు.. కుర్రాడి లా తయారయ్యాడు, అందరినీ చూడండి ఎలా ఉన్నారో ఆయన్ని చూడండి ఎలా ఉన్నాడో.. దీనికి కారణం డబ్బు మహిమ ఇంత మైంటైన్ చేసినా ఒక్క రూపాయి కూడా జారరు, పిసినారులు.. ఇక ఆ పక్కనే ఉన్న వాడిని చూడండి డబ్బులు వడ్డీకి తిప్పి పేదల రక్తాన్ని వడ్డీ రూపంలో పీల్చుకుని తినెలా లేడు.. చూసారా నేను ఇంత చెప్తున్నా కనీసం నిమ్మకు నీరెత్తనట్టు పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు..

ఆ వెనకే ఇంకో ప్రబుద్ధుడు ఉన్నాడు చూడండి.. మిత్ర ద్రోహి.. పక్కనే అమ్మాయిని తెగ గోకుతున్నాడు… (ఈ మాటలు వినగానే శరణ్య పక్కనుంచి పది అడుగుల దూరంగా పారిపోయాడు అరవింద్) … నమ్మొద్దు మిత్రులారా నిలువునా ముంచుతారు.. ఇక ఆ అమ్మాయిని చూడండి ఎంతలా కులుకుతుందో.. వీళ్ళ పాపాలు చూడలేకున్నాను.. హత్తవిది.. అంటుండగానే ఎవరో మన సుబ్బిగాడి గడ్డం పట్టుకుని లాగారు.. చూస్తే హారిక.. గుర్తుపట్టేసింది.. అక్కడున్న అందరూ సుబ్బిగాడిని చూసారు.. వెంటనే శరణ్య వాళ్ల నాన్న కర్ర అందుకున్నాడు.

అందరితో తన్నులు తిన్న తరువాత పదిహేను నెలలకి మళ్ళీ ఇంకో దెబ్బ పడింది, ఆ దెబ్బకి సుబ్బిగాడికి ఇటు ఊర్లో అటు సిటీలో మొహం చెల్లక ఎక్కడ ఉండాలో తెలీక బస్సు స్టేషన్ లో నిలబడ్డాడు. ఎదురుగా బెంగుళూరు బస్సు రెడీగా స్టార్ట్ అయ్యి ఉంది.

గంట కూర్చున్నాను జరిగినవన్ని గుర్తొచ్చాయి.. చిన్నప్పటి నుంచి అంతే అమ్మా నాన్న పోయారు, తాతయ్యకి నేనంటే ఇష్టం ఉన్నా ఏ కారణం చేతనో నన్ను దెగ్గరికి తీయలేక హాస్టల్లో వేసాడు. ఎంత మందిని ప్రేమించినా ఎంత మంది వెంట పడ్డా ఎవ్వరు నాకు దెగ్గర కాలేక పోయారు.

నేనేమి మదమెక్కి అమ్మాయిల వెంటపడను నాకంటూ ఎవరైనా తోడు దొరుకుతారేమో అన్న ఆశ అంతే అందులో కొంత మంది అమ్మాయిలు అస్సలు మనకి సెట్ అవ్వరు అనుకున్న వాళ్ళని నేను దూరం పెడితే మిగతా వాళ్ళు నన్ను దూరం పెట్టారు.

నాకంటూ ఇక్కడ ఉన్నది ఒక్క అరవింద్ గాడే, కానీ వాడు చాలా బలిసినోడు మనకి తిండికే దిక్కు లేదు, వాడు మాత్రం నన్ను ఎన్ని రోజులు భరిస్తాడు అందుకే ఇక్కడ నుంచి దూరంగా వెళ్లి బతుకుదామని నిర్ణయించుకున్నాను. కొత్తగా నాకంటూ ఒక గుర్తింపు వచ్చేదాక ఇక ఇక్కడ అడుగు పెట్టకూడదని గట్టిగా అనుకున్నాను.

కొంచెం చదువుంది ట్యూషన్స్ చెప్పుకునేందుకు అది సరిపోతుంది, అదీ కాకపోతే టాక్సీ నడుపుతాను, దానికంటే అంబులెన్సు ఇంకా ఈజీ ఎందుకంటే అరవింద్ కొనే కొత్త కొత్త కార్లలో వాడ్ని తిప్పేది నేనే.. నేను డ్రిఫ్ట్ చేస్తుంటే వాడికి పక్కన కూర్చుని ఎంజాయ్ చెయ్యడం ఇష్టం.. అంత బాగా నడుపుతాను కార్ ని.

కానీ ఇప్పుడు ఎక్కడికి వెళదామన్నా డబ్బులు సరిపోవు ఎలా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఒకమ్మాయి చుడిధార్ లో భుజానికి చిన్న బ్యాగ్ తొ టెన్షన్ గా ఫోన్ మాట్లాడుతూ నేరుగా బస్సు ముందుకు వచ్చి నిలబడి దిక్కులు చూస్తుంది.. ఎవరికోసమో ఏమో అని చూసాను కానీ పది నిమిషాలైనా ఎవ్వరు రాలేదు ఆ అమ్మాయి మోహంలో చెమటలు.. ఏదో టెన్షన్ లో ఉంది ఇంతలో ఒక జీప్ వచ్చింది అందులో నుంచి నలుగురు కత్తులతో దిగారు ఒక్కో బస్సు వెతుకుతుంటే ఆ అమ్మాయి అది చూసి బస్సు ఎక్కుతుంటే ఇంత అందమైన అమ్మాయికి ఎంత పెద్ద కష్టం అని తన దెగ్గరికి వెళ్ళాను.

సుభాష్ : ఏవండీ ఏమైనా ఇబ్బందా, ఇందాకటి నుంచి చూస్తున్నా టెన్షన్ పడుతున్నారు.

“అవునండి నేను బెంగుళూరు వెళ్ళాలి చాలా అర్జెంటు”

సుబ్బి : మరి మీ వెనక వాళ్లు ఎందుకు పడుతున్నారు..?