ప్రేమికుడు – Part 2 144

కారు వేగంగా వెళుతుంది వెనక ఫాలో అవుతున్న వాళ్ళని నా వేగంతో తొక్కేసాను, ఇక ఇలా కాదని హైవే మీద నుంచి ఊర్లోకి పోనించి నల్ల పంపు దెగ్గర ఆపాను.

మానస : ఏమైంది?

సుబ్బు : ఏంలేదు కారుని గుర్తు పట్టేస్తున్నారు అందుకే స్పెషల్ డిజైన్ చేద్దామని.

మానస : ఎం చేస్తావ్?

సుబ్బు : నువ్వు ఆవారా సినిమా చూడలేదా?

మానస : చూసాను.

సుబ్బు : అదే చేస్తున్న అని నీళ్లు మొత్తం కింద పోసి ఆ బురద కారు మీద చల్లాను.. ఎర్రటి కారుని బురద రంగులోకి మార్చి.. మానసని చూసాను.

మానస : నా కారు..

సుబ్బు : కారు కావాలా ప్రాణం కావాలా

మానస : నాకు నా విక్రమ్ కావాలి.

సుబ్బు : వాడెవడు?

మానస : ఓయి రెస్పెక్ట్.. నా లవర్.

సుబ్బు : లవరా… అంటే నీది లవ్ ప్రోబ్లమా?

మానస : అవును.. ఓయి ఏమైంది?

సుబ్బు : కళ్ళు తిరుగుతున్నాయి.. కొంచెం ఆ నీళ్లు ఇలా మొహం మీద పొయ్యి.

మానస కొన్ని నీళ్లు తీసుకుని సుబ్బిగాడి మొహం మీద కొట్టింది.. సుబ్బు లేచి నిరాశగా మానసని చూసాడు.

మానస : ఏమైంది?

సుబ్బు : ఎం లేదు అని కార్ ఎక్కి స్టార్ట్ చేసాడు..

మానస పక్కన కూర్చుంది కానీ, ఏదో అయ్యింది అని అనిపించింది సుబ్బిగాడి వైపు చూసి అడిగింది.

మానస : ఏమైంది ఇప్పటిదాకా బానే ఉన్నావ్, బాగా మాటలు చెప్పావ్ ఇప్పుడేమో సైలెంట్ గా ఉన్నావ్

సుబ్బు : నీకు లవర్ ఉన్నాడని ముందు చెప్పుంటే అస్సలు వచ్చేవాడిని కాదు నేను..

మానస : నవ్వి ఎందుకలాగా, కొంపదీసి నన్ను లవ్ కానీ చెయ్యట్లేదు కదా

సుబ్బు : ఇందాకటి వరకు చేసాను కానీ ఇక డ్రాప్, నిన్ను వదిలేసి ఇంకో అమ్మాయిని చూసుకుంటాను.

మానస : ఏంటి ఇంతలోపే నన్ను ఇష్టపడ్డావ్ మళ్ళీ అంతలోపే ఇంకో అమ్మాయిని వెతుక్కుంటా అంటున్నావు.. ఎలాగో చాలా దూరం వెళ్ళాలి నీ గురించి చెప్పు.

సుబ్బు : తల పైకి ఎత్తు……. Doooooooooomdeeeeeeeeeeemdaaaaaaaaamdamaaaaaal dishkiyaaam dozendozen dhoom3 dhruvaips……………… అయిపోయింది కథ తల దించు.. అది జరిగింది.

మానస : హహ… హహ.. భలే ఉన్నావే విచిత్రంగా.. అయితే మీ తాతయ్య వాళ్ల చేతిలో తన్నులు తిని ఇక అక్కడ ఉండకూడదని డిసైడ్ అయ్యావ్ అన్న మాట..

సుబ్బు : కాదు, అస్సలు కథ దాని తరువాతే మొదలయ్యింది.. ఒక అమ్మాయి నన్ను దారుణంగా మోసం చేసింది, నేను పుట్టినప్పటి నుంచి ఎప్పుడు ఏడ్చానొ నాకే గుర్తులేదు అలాంటిది నా కంట్లో నుంచి నీళ్లు తెప్పించింది.

మానస : ఎవరు?

సుబ్బు : శరణ్య.. నా మరదలు.

మానస : ఏమైంది?

సుబ్బు : ముందు ఎక్కడైనా తిందాం, నాకు ఆకలేస్తుంది.

మానస : సరే ఎక్కడైనా ఆపు.

కారు రోడ్ మీద ధాబా దెగ్గర ఆపి ఇద్దరం వెళ్లి లోపల కూర్చున్నాం, మానస బిర్యానీ ఆర్డర్ చేసింది ఇద్దరం తింటుంటే అడిగాను ఏంటి మేటర్ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదా