“నా కారుని వెంబడించారు, నేను తప్పించుకుని ఇక్కడికి వచ్చేసాను, వస్తున్నారు సాయానికి మా ఫ్రెండ్స్ రావాలి కానీ రాలేదు ఫోన్ ఎత్తట్లేదు వాళ్ళకి ఏమైనా జరిగేందేమో…” అని ఏడుస్తుంది.
సుబ్బి : కార్ పెట్టుకుని మరి ఇంకా ఎందుకండీ టెన్షన్..
“ఎంత స్పీడ్ గా వెళ్లినా వచ్చేస్తున్నారండి..” అని మా బస్సు వైపు వస్తున్న మనుషులని చూసి దూరంగా పరిగెత్తింది.. నేనూ తన వెనకే వెళ్ళాను.
సుబ్బి : మిమ్మల్ని సేఫ్ గా బెంగుళూరులో డ్రాప్ చేస్తాను కానీ నా దెగ్గర డబ్బులు లేవు.. కొంచెం ఈ జాబ్ నాకు ఇచ్చారంటే చేసి పెడతాను.
“ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, పదండి అని నా చెయ్యి” పట్టుకుంది భయంగా
ఇక మనం ఆగుతామా, దొరక్క దొరక్క దొరికిన అమ్మాయి అది కూడా సాయం చెయ్యమని అడిగింది.. అంతే తన చెయ్యి పట్టుకుని తన కళ్ళలోకి చూసి.. మీ కారు ఎక్కడా అని అడిగాను.
“బైటే ఉంది కానీ వాళ్ల మనుషులు ఉన్నారు కదా”
సుబ్బి : రా చెప్తాను, అని అలానే తన చెయ్యి పట్టుకుని లాక్కేళుతూ బైటికి వచ్చాను… మీ కార్ ఎక్కడా
“అదిగో ఆ రెడ్ కలర్”
సుబ్బి : ఏంటి స్పోర్ట్స్ కార్ పెట్టుకుని భయపడుతున్నావా, ఇలాగైతే ఎలాగా రారా.. అని తీసుకెళ్లి కార్లో కూర్చోబెట్టి, ఎవ్వరు చూడకుండా అక్కడ ఆగి ఉన్న మిగతా సుమోల్లో గాలి తీసేసి గట్టిగా విజిల్ వేసాను.. వాళ్లు నన్ను ఆ అమ్మాయిని చూసి నా దెగ్గరికి వస్తుంటే బాయ్ అని చెయ్యి ఊపుతూ కార్ ఎక్కి స్టార్ట్ చేసాను..
ఆ అమ్మాయి నన్ను కొంచెం కోపంగా కొంచెం ఆశ్చర్యంగా చూసింది.. సీట్ బెల్ట్ పెట్టుకోండి.. భయపడకండి ఇలాంటి కార్, డీజిల్ కి డబ్బులు ఉన్నంత వరకు మనల్ని పట్టుకోడానికి ఈ దేశం అంతా ప్రయత్నించినా అది అవ్వని పని.. నన్ను నమ్మండి.. అని కారు స్టార్ట్ చేసి దంచి కొట్టాను..
ఇంతలో ఫోన్ వచ్చింది, ఆ అమ్మాయి ఎత్తి మాట్లాడుతూ “వస్తున్నాను నువ్వు జాగ్రత్త, అమ్మ వాళ్ళని భరత్ ఫ్లైట్ ఎక్కించాడు, చందు రాలేదు సలీమాని కూడా అమ్మ వాళ్ళతోనే పంపించాను వాళ్లు నాన్నకి దొరకరు.. హ్మ్.. అలాగే.. సరే” అని ఫోన్ పెట్టేసింది.
సుబ్బి : ఇంతకీ ప్రాబ్లెమ్ ఏంటండీ..?
“ఇప్పుడు నన్నేం అడగకండి, ప్లీజ్ త్వరగా పోనివ్వండి”
సుబ్బి : ఆవారా సినిమాలో తమన్నాది కూడా సేమ్ డైలాగ్, కొంపదీసి నేనే కార్తిక్ ఏమో.. వెంటనే బ్లుటూత్ కనెక్ట్ చేసి చిరు పాట పెట్టాను.
చిరు చిరు చినుకై కురిసావే.. మరు క్షణమున మారుగై పోయావే అని పాటతో పాటు పాడుతూ తనని చూసాను ఎవరైనా వెనక వస్తారేమో అని చూస్తుంది.. ఇంకా తన పేరు కూడా తెలుసుకోలేదు..
సుబ్బి : మీ పేరెంటండీ?
“మానస”
మానస ఎంత బాగుంది.. నా మనసంతా మానసతొ నిండిపోయింది.. సుభాష్ వెడ్స్ మానస.. ఎంత బాగుంది, ఎంత అందంగా ఉంది మనం ఎలాగో ఆవారానే కాబట్టి ఇద్దరికి సెట్ అవుతుందిలే.. అస్సలు మా ఇద్దరికి FLAMES రాస్తే ఏమొస్తుందో ఏమో.. మానసతొ మొదలయ్యే పాటలన్ని నా మెదడులోకి వచ్చేసాయి..
మనసా మళ్ళీ మళ్ళీ చూసా గిల్లి గిల్లి చూసాను జరిగింది నమ్మేశా..
మనసంతా నువ్వే, నా మానసంతా నువ్వే..
అరెరే మనసా, ఇదంతా నిజమా, ఇకపై మనమే, సగము సగమా….
దీని కంటే ఇది బెస్ట్.. తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో….
ఇంకోటి.. ఓ మనసా ఓ మనసా చెపితే వినవా నువ్వు.. అబ్బో ఇది సాడ్ సాంగ్ వద్దులే.. మనసా మన్నించమ్మా మార్గం మల్లించమ్మా.. ఛీ…
మనసంతా ముక్కలు చేసి పక్కకు వెళతావ్ ఎందుకు ఓ నేస్తం.. ఇది కూడా సాడ్ సాంగ్.. ఏంటి ఒక్కటి మంచిది రావట్లేదు..