ప్రేమికుడు – Part 2 159

సుబ్బు : సరే నేను అలా మెడికల్ షాప్ కి వెళ్ళొస్తా

అరవింద్ : దేనికిరా ??

సుబ్బు : మొన్న వెళ్ళినప్పుడు చూసాను షాప్ లో సౌమిత్రి అనే అమ్మాయి చేరింది, ఇందాకే పరిచయాలు అయ్యాయి వెళ్లి కొత్తగా రాసిన కవిత ఒకటి తనకి ఇచ్చి వస్తా, నువ్వు ఈ లోపు కారు పని చూడు.. అని సుబ్బిగాడు తన స్నేహితుడిని ఇంకో మాట మాట్లాడకుండా చేసేసి లేచి వెళ్ళిపోయాడు.

సోఫాలో కూర్చున్న అరవింద్ మాత్రం నోరేళ్ళబెట్టి అలానే వెనక్కి వాలి సుబ్బిగాడిని చూస్తూ కూర్చున్నాడు.

అలా టాక్సీ నడుపుతున్న నాకు ఒక రోజు మావయ్య ఫోన్ చేసాడు, అదీ శరణ్య కోసం.

జగన్ : హలో

సుబ్బు : ఆ మావయ్య

జగన్ : శరణ్య ips ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతుంది అక్కడ జాయిన్ చేద్దామనుకుంటున్నాను, హాస్టల్లో ఉండనంటుంది.. నీకు ఇబ్బంది లేకపోతే అక్కడ ఉంటుంది.

సుబ్బు : పర్లేదు మావయ్య, కానీ నేను టైంకి ఇంటికి రాలేను ఒక్కోరోజు అస్సలు ఇంటికే రాను, తను ఒక్కటే ఉండాల్సి వస్తుంది, పర్లేదు అనుకుంటే వచ్చేయమను.

జగన్ : సరే చెపుతాను, నువ్వు ఎలా ఉన్నావ్ ఎంత సంపాదిస్తున్నావ్?

సుబ్బు : పర్లేదు మావయ్య, బేరాలు బానే ఉన్నాయి చేసుకున్నంత పని ఉంది మన ఓపిక బట్టి..

జగన్ : అప్పుడప్పుడు వచ్చి వెళుతు ఉండు.

సుబ్బు : హా.. అలాగే.

జగన్ : సరే అయితే.

తాతయ్య పోయిన దెగ్గర నుంచి శరణ్యతొ ఒక్కసారి కూడా మాట్లాడలేదు, సరేలే రాని ఎలాగో తనకీ నాకు పడదు.. మనము ఉండము చూద్దాం అనుకున్నాను. పదిరోజులు గాడిచాయో లేదో మావయ్య వచ్చి శరణ్యని వదిలిపెట్టి నాకు ఫోన్ చేసి చెప్పాడు, రాత్రి రూంకి వెళ్లే వరకి శరణ్య పడుకుని ఉంది. లైట్ వేసాను. లేచి కూర్చుంది.

సుబ్బు : తిన్నావా ఏమైనా?

శరణ్య : హా తినేసా

సుబ్బు : బిర్యానీ తెచ్చా ఆకలిగా ఉంటే తిను అంటుండగానే లేచి ప్లేట్ తెచ్చుకుని కూర్చుంది.. దీనికి తిండి పిచ్చి ఇంకా పోలేదు అని నవ్వుకున్నాను, ఇద్దరం తినేసి పడుకున్నాం. నేను కింద చాప వేసుకున్నాను.

తెల్లారి లేచేసరికి మావయ్య ఇంకో మంచం కావాల్సిన సామాను, శరణ్యకి పుస్తకాలు పంపించాడు. తనకి చెప్పేసి బైట పడ్డాను.. రోజులు గడుస్తున్నాయి శరణ్య నాతో అంత ఎక్కువగా మాట్లాడేది కాదు నేనూ అంతే దూరంగానే ఉండేవాడిని కానీ తన అవసరాలు తెలుసుకోడానికైనా మాట్లాడాల్సి వచ్చేది.

శరణ్య : పది అవుతుంది నన్ను ఇన్స్టిట్యూట్ దెగ్గర డ్రాప్ చేసి వెళ్ళు.

సుబ్బు : ఇంకేమైనా కావాలా, ఇంట్లోకి నీకు?

శరణ్య : నా సంగతి చూసుకోడానికి మా నాన్న ఉన్నాడులే నువ్వంత ఫీల్ అవ్వకు.

దీనమ్మ బలుపు దీనికి, అయినా నాకెందుకు దాని గొడవేదో అది చూసుకుంటదిలే అనుకుని శరణ్యని డ్రాప్ చేసాను.

శరణ్య : ఇంటికి వెళ్ళేటప్పుడు వస్తావా

సుబ్బు : మీ అయ్యకి ఫోన్ చెయ్యి.

కోపంగా చూస్తూ వెళ్ళిపోయింది, మనమేమన్న తక్కువా నేను అంతే పొగరుగా వచ్చేసాను.. రాత్రికి ఇంటికి వచ్చి చూస్తే శరణ్య ఇంట్లో లేదు, ఫోన్ చేసాను ఎత్తలేదు మళ్ళీ చేసా కట్ చేసింది. సరేలే అని పడుకున్నాను. తొమ్మిదైనా ఇంటికి రాలేదు మావయ్యకి ఫోన్ చేసాను.

జగన్ : చెప్పరా

సుబ్బు : అదీ శరణ్య..

జగన్ : ఫ్రెండ్ ది బర్తడే అంటే వెళ్లిందట, దార్లో ఉన్నా అంది, నీకు చెప్పలేదా?

సుబ్బు : లేదు.

జగన్ : నేను దానితో మాట్లాడతాను లేరా

సుబ్బు : నేను వెళ్ళాలి.

జగన్ : సరే బై

ఫోన్ పెట్టేసి పడుకున్నాను, రాత్రి ఒంటి గంటకి ఎప్పుడో వచ్చింది నన్ను చూసి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. కోపం వచ్చింది కానీ తన కళ్ళు చూడగానే ఎందుకో ఏం మాట్లాడలేకపోయాను.. లైట్ ఆపేసి పడుకున్నాను. తెల్లారి లేచి ఇన్స్టిట్యూట్ దెగ్గర వదిలాను.. కార్ దిగి డోర్ వేసి వెళ్ళిపోతుండగా పిలిచాను.

సుబ్బు : శరణ్య

శరణ్య : హా ఏంటి?

సుబ్బు : ఇంటికి వెళ్ళేటప్పుడు ఫోన్ చెయ్యి పిక్ చేసుకుంటాను, ఎటైనా వెళ్ళాలన్నా కూడా నాకు చెప్పు నేను వస్తాను.

శరణ్య : (ఎగాదిగా చూసి) సరే

సుబ్బు : ఒకసారి తన కళ్ళు చూసి మొహం తిప్పుకుని అక్కడ నుంచి బైటికి వచ్చేసి పర్సు తీసి చూసాను.. నా మొహంలోకి మళ్ళీ నవ్వు వచ్చేసింది. ఇంతలో బేరం వచ్చిందని ఫోన్ వస్తే వెళ్లిపోయాను. మళ్ళీ సాయంత్రమే శరణ్య నుంచి ఫోన్ వచ్చింది.

శరణ్య : వస్తావా