ప్రేమికుడు – Part 2 174

నేనింకేం మాట్లాడలేదు దాని వేషాలు చూసి నవ్వాలో కొప్పడాలో తెలీక మెలకుండా సినిమా చూసి ఇంటికి వచ్చేసి పడుకున్నాం.. శరణ్య స్నానానికి వెళ్ళగానే గబగబా లేచి కత్తితొ దుప్పటికి చిన్న రంద్రం చేసి ముసుగు నిండా కప్పుకుని ఆ రంద్రం లోనుంచి చూస్తున్నా.. పది నిమిషాలకి శరణ్య వచ్చి తల తుడుచుకుంటూ నన్ను చూసి పడుకున్నాననుకుని టవల్ లూస్ చేసి షార్ట్ వేసుకుని బుక్స్ తీసి చదువుతూ కూర్చుంది.

శరణ్య : రేయి.. బొక్క లోనుంచి చూసావంటే బొక్కలు విరుగుతాయి పడుకో.

కళ్ళు మూసుకుని పడుకున్నాను, మళ్ళీ మెలుకువ వచ్చింది తెల్లారి ఐదు గంటలకే లేచి చూస్తే శరణ్య అప్పటికే లేచి చదువుతుంది, బ్రష్ చేసుకుంటూ బైటికి వెళ్లి పాల ప్యాకెట్ తెచ్చి కాఫీ చేసి తన పక్కన పెట్టాను.

శరణ్య : థాంక్స్

సుబ్బు : పర్లేదు చదవుకొ, నేను పడుకుంటున్నా లేచాక ఇంటికి వెళదాం.. అనేసి మళ్ళీ ముసుగు తన్నాను, ఈ సారి ఫోన్ కాల్ లేపింది టైం చూస్తే పదిన్నర.. పక్కన చూస్తే శరణ్య పడుకుని ఉంది.. ఫోన్ ఎత్తాను… హలో ఎవరు?

నేను ప్రసాద్ అండి, మీ ఫ్రెండ్ అరవింద్ గారి దెగ్గర కొత్తగా జాయిన్ అయినా పిఏ ని….) అలాగా వీడికి మళ్ళీ అసిస్టెంట్లు కూడానా, ఇంతకీ విషయం ఏంటో?

ప్రసాద్ : మా సార్ ఒక్కసారి రమ్మన్నారు.

శరణ్య పక్కన ఉన్న బుక్స్ పక్కకి సర్దుతూ అలాగా, సరే వస్తున్నానని చెప్పు అని ఫోన్ పెట్టేసి శరణ్యకి దుప్పటి కప్పి అరవింద్ ఇంటికి బైలుదేరాను.. గేట్ ముందు సెక్యూరిటీ నన్ను చూడగానే, ఏంటి సార్ ఇటు రావడమే మానేశారు అంటూ గేట్ తెరిచాడు లోపలికి వెళ్ళాను బైటే స్విమ్మింగ్ పూల్ దెగ్గర టవల్ కట్టుకుని పక్కన ఉన్న వాడితో ముచ్చట్లు పెడుతున్నాడు వెధవ.

సుబ్బు : ఏంట్రా రమన్నావంట, చెయ్యి దురదా ఫోన్ చెయ్యడానికి కూడా అసిస్టెంట్ ని పెట్టుకున్నావట.

అరవింద్ : రారా.. తనే ప్రసాద్, ప్రసాద్ నా బెస్ట్ ఫ్రెండ్ సుభాష్.. ఈ మధ్య కంపెనీ బాధ్యతలు ఆస్తులు నా పేరున రాసి నాకు ఇష్టం లేకపోయినా నన్ను ఇందులోకి నెట్టేసారులే, మనకా ఈ కష్టాలు పడడం పైకి ఎదగడం మనవల్ల కాని పని అందుకే ఇదంతా… ఉన్నవి పోగొట్టుకోకుండా ఉంటే అదే చాలు.. సరే నా సంగతి వదిలేయి, ఇంకా ఏంట్రా విశేషాలు అస్సలు కలవట్లేదు బతుకు జట్కా బండి దారిలో పడినట్టుంది.

సుబ్బు : ఏదో అలా గడిచిపోతుంది.

అరవింద్ : కొత్త అమ్మాయిని ఎవరినైనా పట్టావా, ఇంకా వెతుకుతూనే ఉన్నావా?

సుబ్బు : ఎక్కడరా, అమ్మాయిని చూసి చాలా రోజులవుతుంది.

అరవింద్ : నిజమేనా నేను విన్నది, కలలో ఉన్నానా

సుబ్బు : అదీ శరణ్య…

అరవింద్ : తనా, తనకీ నీకు అస్సలు పడదు కదరా

వెంటనే ఫోన్ తీసి శరణ్య ఫోటో చూపించాను, ఏంట్రా ఇది… ఒక్కసారి తన కళ్ళు చూడు.. ఆ చూసా… ఆగు అని పర్సు తీసి అందులో ఉన్న అమ్మ ఫోటో చూపించాను..

అరవింద్ : రేయి ఇద్దరి కళ్ళు ఒకేలా ఉన్నాయి.. నిజంగా

సుబ్బు : అవును అమ్మ పోలిక, ఇన్నాళ్లు తనని పట్టించుకోక అస్సలు నేను చూడలేదు.

అరవింద్ : ఇన్నేళ్ల నీ కృషికి నీ మనసుకి నచ్చిన అమ్మాయి దొరికిందన్నమాట.. చీపిరి సంకలో పెట్టుకుని ఇల్లంతా వెతికినట్టు.. ఇన్ని రోజులు మరదలిని ఇంట్లో పెట్టుకుని ఊరంతా వెతికావు.. ఇంతకీ తనకి చెప్పావా?

సుబ్బు : లేదు ips కోసం చాలా కష్టపడుతుంది అది అవ్వని అప్పుడు చెపుదాం.. సరే నేను వెళతాను అమ్మమ్మ దెగ్గరికి వెళుతున్నాం మళ్ళీ రాత్రి వరకు వచ్చేస్తా.

అరవింద్ : సరే బై.

సుబ్బుగాడు వెళ్ళిపోయాక ప్రసాద్ తన సందేహాన్ని వెలిబుచ్చాడు…) సార్ మీ బెస్ట్ ఫ్రెండ్, అన్ని కష్టాల్లో ఉన్నాడు ఈ జాబ్ ఏదో తనకే ఇవ్వకుండా నాకు ఎందుకు ఇచ్చినట్టు.

అరవింద్ : మరి నా ఫ్రెండ్ ని నా కింద పనోడిగా పెట్టుకోనా వాడితొ ఈ మాట అడిగితే చెప్పుతో కొడతాడు. అయినా వాడికన్ని కష్టాలు ఏం లేవు వాడికి నా కంపెనీలో జాబ్ చేసుకునేంత చదువు ఉంది.. కష్టపడి పైకి రాగల తెలివితేటలు ఉన్నాయి. ఒకసారి ఏమైందో తెలుసా మేము కాలేజీలో ఉన్నప్పుడు ప్రతీ ఆదివారం ఒకళ్ళు అందరినీ సినిమాకి తీసుకెళ్లాలని రూల్ పెట్టుకున్నాం ఆ తెల్లారి వాడి వంతు వస్తుందనంగా నా దెగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళాడు.. అస్సలే మెగాస్టార్ సినిమా దొరుకుతాయో లేదో అని భయపడుతుంటే వాడు ఎవ్వరికీ తెలీకుండా రిలీజ్ కి ముందే వెళ్లి నాలుగు టిక్కెట్లకి ఎనిమిది టిక్కెట్లు తీసుకుని తెల్లారి బ్లాక్ లో నాలుగు రెట్లు ఎక్కువ రేటుకి అమ్మాడు.. వాటితో మాకు స్నాక్స్ కొనిచ్చి వంద రూపాయిలు మిగిలితే అక్కడే ఉండి అడుక్కునే ముసలావిడకి దానం చేసాడు. వాడు మంచోడు తెలివికల్లోడు.

ప్రసాద్ : మరి ఎందుకు ఇలాగే ఉండిపోయాడు.

అరవింద్ : వాడికి డ్రైవింగ్ అంటే ఇష్టం.. వాడికి నచ్చింది చెయ్యని ఎక్కడైనా కింద పడ్డా వాడి చెయ్యి అందుకోడానికి నేనున్నాగా.. మనోడు ఒక్క అమ్మాయిల విషయంలోనే తొందర ఎక్కువ.. అని లేస్తూ ఇక పదా రెడీ అయ్యి ఆఫీస్ లో పడుకుందాం, లెట్స్ గొ టు ఏసీ కేబిన్.

±
±
±

ఇంటికి వచ్చేసరికి శరణ్య రెడీ అయ్యి కూర్చుని ఉంది, తన చేతికి టిఫిన్ కవర్ అందించాను.

సుబ్బు : అయిపోయిందా వెళదామా?

శరణ్య : ఆ కార్లో తింటాలే చలో..

సుబ్బు : తమరికి హిందీ కూడా వచ్చునేటి?

శరణ్య : కాబోయే ips ని, ఇవన్నీ నాకు చాలా మామూలు విషయాలు.. అని నవ్వుతూ కార్ డోర్ తీసి వెనక కూర్చుంది.

కారు రోడ్డు మీదకి ఎక్కగానే తినేసిన గంటకే పడుకుండిపోయింది తన నిద్ర చెడకుండా ఊరి వరకు తీసుకొచ్చాను కానీ ఊళ్ళోకి ఎంటర్ అయ్యేప్పుడు రోడ్డు బాగాలేక కుదుపులకి లేచింది.

శరణ్య : మంచి డ్రైవర్ వే.. బానే నడిపావ్.

సుబ్బు : అవతలి వాళ్ళని మెచ్చుకునే క్వాలిటీ కూడా తమరిలో ఏడ్చినందుకు సంతోషం..

శరణ్య : అమ్మా ముందు దిష్టి తీయ్యవే.. ఇక్కడ అందరి కళ్ళు నా మీదే.. అని నడ్డి ఊపుతూ లోపలికి పోయింది. అమ్మమ్మ దిష్టి తీస్తుంటే మావయ్యని కలుద్దామని రైస్ మిల్లుకి వెళ్ళాను.

అమ్మమ్మ : ఏంటే వాటంగా తయారయ్యావ్ బాగా మేపుతున్నాడా నీ బావ

శరణ్య : అలా పిలవద్దని వంద సార్లు చెప్పాను నీకు… అలాగేలే అని లేచి వెళ్లిపోతుంటే… మా ఆగవే, ఇటు రా… హా ఏంటి… నా కళ్ళలో నీకేం కనిపిస్తుంది.. ఏముంది, ఏం లేదు.. సరే.. పో.

అమ్మమ్మ : ఏంటి నీ బావ నీ కళ్లు చూసాడా?

శరణ్య : నీకెలా తెలుసు?